»   » 'ఏ మాయ చేసావె' సక్సెస్ తో పిచ్చహ్యాపీగా నాగచైతన్య..!!

'ఏ మాయ చేసావె' సక్సెస్ తో పిచ్చహ్యాపీగా నాగచైతన్య..!!

Subscribe to Filmibeat Telugu

'జోష్' సినిమాతో హీరోగా పరిచయం అయి, ఆ సినిమా కాస్త ఫట్ అనడంతో ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా హిట్ కొట్టాలనుకుని వెంటనే ఏ మాయ చేసావే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. హిట్ కోసం పరితపించిన చైతూ ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో యమా హ్యాపీగా వున్నాడు. అన్నట్టు ఈ సినిమాకు చైతన్య పారితోషికం తీసుకోకుండానే పనిచేసాడట. కానీ ఈ సినిమా శ్యాటిలైట్ హక్కులు తీసుకున్నాడట.

సినిమాకు హిట్ టాక్ రావడంతో శ్యాటిలైట్ హక్కులకు ఫ్యాన్సీ ఆఫర్ వస్తోందట. దీంతో చైతూ డబల్ హ్యాపీగా వున్నాడట. ఇక ఈ సినిమా ద్వారా పరిచయం అయిన సమంతాకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమా విజయంలో ముఖ్యభూమిక పోషించిన ఆమెకు ఆఫర్లు వెళ్లువెత్తుతున్నాయట. ఇందిరా ప్రొడక్షన్స్ తర్వాత మహేష్ బాబుతో తీయనున్న సినిమాలో సమంతనే నాయికగా తీసుకోనున్నట్టు మంజుళ ప్రకటించింది. ఇక ఇప్పటికే సమంత జూ.ఎన్టీఆర్ బృందావనంలో సెకెండ్ హీరోయిన్ గా ఎంపికయింది. దీంతో ఇక సమంత టాప్ హీరోయిన్ అవ్వడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu