»   » నాగచైతన్యకు ప్రమాదం..గాయాలు

నాగచైతన్యకు ప్రమాదం..గాయాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న 'బెజవాడ రౌడీలు"చిత్రంలో నటిస్తున్న నాగచైతన్యకు షూటింగ్లో చిన్న ప్రమాదం చోటు చేసుకుంది. యాక్షన్ సీక్వెన్స్ లు చేస్తున్న నాగచైతన్య పట్టుతప్పి పడటంతో దెబ్బలు తగిలాయి. వెంటనే హాస్పటిల్ తీసుకు వెళ్ళితే నాలుగు కుట్లు వేసి వారం రోజులు రెస్టు తీసుకోమని చెప్పటం జరిగింది. వివేక్ కృష్ణ దర్శకుడుగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో అమలా పౌల్, ప్రీతికారావు హీరోయిన్స్ గా చేస్తున్నారు.

ఈ చిత్రం గురించి నాగచైతన్య గురించి మాట్లాడుతూ -''రామ్‌గోపాల్‌వర్మ ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పినప్పుడు ఎంతో ఎక్సైట్ అయ్యాను. ఇందులో నా క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. దర్శకుడు వివేక్ అద్భుతంగా సినిమాను తీస్తున్నారు. నా కెరీర్‌కి ఈ సినిమా ఓ టర్నింగ్ పాయింట్ అవుతుంది"" అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అమర్ మొహ్లే, బప్పీటూటిల్, విశాల్, విక్రమ్, నేగి, ప్రదీప్ కోనేరు, ధరమ్ సందీప్, కెమెరా: ఎస్.కె.ఎ.భూపతి, ఆర్ట్: కృష్ణమాయ, సమర్పణ: వందిత కోనేరు.

English summary
Naga Chaitanya got injured on the sets of Bejawada Rowdilu while he was shooting for an action sequence without body double. Naga Chaitanya was rushed to nearby hospital where he got four stitches and the doctors advised for a week rest.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu