Just In
Don't Miss!
- News
యూఎస్ క్యాపిటల్ కాంప్లెక్స్ తాత్కాలిక మూసివేత: జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి రెండ్రోజుల ముందు
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Lifestyle
ప్రతిరోజూ ఒక చెంచా బొప్పాయి గింజలను తింటే ఏమవుతుందో తెలుసా? ... వెంటనే తినడం ప్రారంభించండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సీక్రెట్... నాన్నకు ముందే లీకైంది, అఖిల్ షాకిచ్చాడు: నాగ చైతన్య (ఇంటర్వ్యూ)
హైదరాబాద్: నాగ చైతన్య హీరోగా శ్రుతిహాసన్, మడొన్నాసెబాస్టియన్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా 'చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన యూత్ ఫుల్ లవ్ ఎంటర్టెనర్ 'ప్రేమమ్' ఈ 7న విడుదలకు సిద్ధమవుతోంది.
సినిమా ప్రమోషన్లో భాగంగా నాగ చైతన్య మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ప్రేమమ్ సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు సమంతతో తన ప్రేమ, పెళ్లి అంశాలపై కూడా సమాధానం ఇచ్చారు.
ప్రేమమ్ మలయాళ రీమేకే ... కానీ ఎలా ఉందో అలాగే కాపీ కొట్టినట్లు చేయలేదు. సినిమా సోల్ నచ్చడంతో, తెలుగు ఆడియెన్స్‌తో మన నెటివిటీకి తగిన మార్పులు చేసి చేశాం. సినిమా చూస్తే రేపు మీకే తెలుస్తుందని నాగ చైతన్య చెప్పుకొచ్చారు.

అలాంటి ఉద్దేశ్యంతో తీసిన సినిమా కాదు
రీమేక్ సినిమా అనగనే ఈ మధ్య కాలంలో కొన్ని విమర్శలు వస్తున్నాయి. రీమేక్ సినిమాలు చేయడం కొత్త విషయం ఏమీ కాదు. మన సినిమాలు కూడా వేరే బాషల్లో రీమేక్ అవుతున్నాయి. మలయాళ సినిమా కన్నా బాగా తీయాలనే ఉద్దేశ్యంతో చేయలేదని మలయాళీ అభిమానులకు కూడా చెప్పాను. అదే సోల్‌తో తెలుగు నేటివిటికీ తగిన విధంగా సినిమా తీశామని నాగ చైతన్య తెలిపారు.

ఛాలెజింగ్ గా అనిపించింది
మలయాళ ప్రేమమ్‌లో నటించిన నవీన్ పౌలీ నటనతో చాలా ఇన్‌స్పైర్ అయ్యాను. ముఖ్యంగా తన సెకండ్ లవ్‌స్టోరీలో తను చేసిన ఎక్స్‌ప్రెషన్స్ చూసి ఇన్‌స్ఫైర్ అయ్యాననాలి. దాన్ని అలాగే తీసుకుని ఈ సినిమాలో చూపించాను. మరో రెండు వేరియేషన్స్ ఉన్న లవ్‌స్టోరీస్‌ను నా స్టయిల్‌లో చేశాను. ఒకే సినిమాలో మూడు వేరియేషన్స్‌లో నటించడం చాలా కొత్తగా, చాలెంజింగ్‌గా అనిపించింది. ఇలా చేయడం వల్ల ప్రేక్షకుల వైపు నుండి కూడా మంచి పేరొస్తుందని భావిస్తున్నాని తెలిపారు.

ఆ సినిమాతో పోల్చొద్దు
రీమేక్ సినిమా కదా అని..... ఆ సినిమాతో ఈ సినిమాను పోల్చిచూడొద్దు. సినిమాలో తెలుగు నేటివిటీకి తగిన విధంగా చాలా మార్పులు చేసాం. ముఖ్యంగా మూడో లవ్‌స్టోరీ విషయంలో ఎక్కువగా చేసాం. మలయాళంలోని ఉండే ట్విస్ట్, తెలుగులో ఉండే ట్విస్ట్ వేరుగా ఉంటుందని చైతన్య తెలిపారు.

సీక్రెట్ గానే ఉంచుతా, నాన్నకు ముందే సమంతతో లవ్ విషయం లీకైంది
సమంతతో నా ప్రేమ వ్యవహారం నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. ఫ్యామిలీలో అయితే ముందు నాన్నకే చెప్పాను. 'నాకెప్పుడో తెలుసురా..కొత్తగా చెప్తావేంటి..' అన్నారు. నాన్న నేను చెప్పిన విషయాన్ని బాగా వెల్‌కమ్ చేశారు. ఎంగేజ్‌మెంట్, పెళ్లి వచ్చే ఏడాదినే ప్లాన్ చేస్తున్నాం. నా వ్యక్తిగత జీవితాన్ని అందరితో షేర్ చేసుకోవాలనుకోను. ఎంత సీక్రెట్‌గా ఉంచాలో అంత సీక్రెట్‌గానే ఉంచాలనుకుంటాను అని నాగ చైతన్య అన్నారు.

అఖిల్ షాకిచ్చాడు...
నా ప్రేమ గురించి చెప్పినప్పుడు ఇంట్లో పెద్దగా షాకవ్వలేదు కానీ అఖిల్ ప్రేమ గురించి చెప్పినప్పుడు అందరూ షాక్ అయ్యాం. చిన్నవయసులోనే పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం తీసుకోవడం మామూలు విషయం కాదు అని చైతన్య తెలిపారు.

సాహసం శ్వాసగా ఆలస్యం గురించి..
సాహసం శ్వాసగా సాగిపో' సినిమా చిత్రీకరణ పూర్తయిపోయింది. అయితే తమిళ వెర్షన్‌కు సంబంధించిన పార్ట్ పెండింగ్ ఉంది. రెండు వెర్షన్స్‌ను ఒకేసారి విడుదల చేయాలనుకుంటడంతో సినిమా విడుదల ఆలస్యం అవుతోందని తెలిపారు. సాహసం శ్వాసగా సాగిపో చిత్రాన్ని మలయాళంలో కూడా తీస్తున్నారన్నారు చైతూ.

కల్యాణ్ కృష్ణతో ‘సోగ్గాడే చిన్నినాయనా’ తరహాలో
కల్యాణ్ కృష్ణతో ‘సోగ్గాడే చిన్నినాయనా' తరహాలో ఓ చిత్రంలో నటించబోతున్నాను. ఇదొక రొమాంటిక్ ఎంటర్‌టైనర్. ఇందులో యాక్షన్ కూడా ఉంటుంది. సగం విలేజ్, సగం సిటీ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. అయితే నిన్నేపెళ్లాడతా అనే టైటిల్ వినపడింది కానీ దీనికి ఇంకా టైటిల్ అనుకోలేదన్నారు.