»   » నాగచైతన్య కొత్త చిత్రం ఫ్రారంభం(ఫోటోలు)

నాగచైతన్య కొత్త చిత్రం ఫ్రారంభం(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగచైతన్య హీరోగా అన్నపూర్ణ స్టుడియోస్‌ పతాకంపై కొత్త చిత్రం రూపొందుతోంది. పూజా హెగ్డే హీరోయిన్. విజయ్‌కుమార్‌ కొండా దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున నిర్మాత. ఈ సినిమా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో అన్నపూర్ణ స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది.

అక్కినేని అన్నపూర్ణ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించే ప్రొడక్షన్ నెం. 25 గా ఈ చిత్రం మొదలైంది. 'గుండె జారి గల్లంతయ్యిందే' చిత్రదర్శకుడు విజయ్‌కుమార్ కొండా ఈ చిత్రానికి దర్శకుడు కావటంతో ఇది క్రేజీ ప్రాజెక్టు గా మారింది.

ఇది లవ్ తో కలిసిన ఫ్యామిలీ సబ్జెక్టు గా చెప్తున్నారు. ఆద్యంతం ఫన్ కే ప్రయారిటి ఇచ్చి స్క్రిప్టు రెడీ చేసినట్లు గా చెప్పుకుంటున్నారు. ఫంక్షన్ కి వచ్చిన వారందిలో నాగ చైతన్య మరో హిట్ కొట్టబోతున్నారనే వాతావరణం కనిపించింది.

మిగతా విశేషాలు ...స్లైడ్ షో లో..

ఫ్యామిలీ ఫంక్షన్

ఫ్యామిలీ ఫంక్షన్

ఈ ప్రారంభ వేడుక ఆద్యంతం ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లా జరిగింది. అక్కినేని కుటుంబ సభ్యులు చాలా మంది వచ్చి ఈ ప్రారంభోత్సవంలో పాల్గొని నాగ చైతన్యకు విషెష్ తెలిపారు.

క్లాప్...

క్లాప్...


ఈ కొత్త చిత్రం ప్రారంభానికి బేబి సత్య క్లాప్ ఇచ్చింది. క్లాప్ కొట్టాక అంతా టప్పట్లుతో మారు మ్రోగిపోయింది. ఈ సినిమా విజయవంతం కావాలని అంతా కోరుకున్నారు.

కెమెరా స్విచ్చాన్...

కెమెరా స్విచ్చాన్...

దేవుని ఫొటోలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి బేబి సాగరి కెమెరా స్విచాన్ చేసింది. ఆమె తల్లి ఎత్తుకుని మరీ చేయించింది. ఆ పాప ని అంతా ముద్దాడారు.

నాగచైతన్య మాట్లాడుతూ...

నాగచైతన్య మాట్లాడుతూ...

'దర్శకుడు చెప్పిన కథ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. డిఫినెట్‌గా మంచి సినిమా అవుతుంది. ప్రేమకథలో ఇదో కొత్తరకం. అందరినీ అలరించేలా ఉంటుంది. లవ్ స్టోర్లీల్లో వెరైటీ అవుతుంది' అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ...

దర్శకుడు మాట్లాడుతూ...

ఈ సందర్భంగా క్లీన్, రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా చిత్రం రూపుదిద్దుకుంటుందని దర్శకుడు విజయ్‌కుమార్ చెప్పారు.

ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత సాయిబాబా మాట్లాడుతూ...

ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత సాయిబాబా మాట్లాడుతూ...

''సినిమా పేరు ఇంకా నిర్ణయించలేదు. ఈ నెల 23 నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ఉంటుంది. ఏప్రిల్‌ కల్లా చిత్రీకరణ పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాము''అన్నారు.

షెడ్యూల్..

షెడ్యూల్..

ఈ నెల 23 నుంచి షూటింగ్ ప్రారంభమవుతుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌లో జరిగే షూటింగ్‌తో చిత్రం పూర్తవుతుంది

టైటిల్ లేదు...

టైటిల్ లేదు...

ఈ చిత్రానికి ఇంకా పేరు నిర్ణయించలేదు. ఈ చిత్రానికి 'ఒక లైలా కోసం...' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ పాట అక్కినేని నాగేశ్వరరావు...రాముడు కాదు కృష్ణుడు చిత్రంలో పాట.

స్క్రిప్టు మీదే...

స్క్రిప్టు మీదే...

ఎనిమిది నెలలపాటు శ్రమించి కథను సిద్ధం చేశారు. 'గుండె జారి గల్లంతయ్యిందే' కంటే రెండింతలు ఎక్కువ వినోదం ఉంటుంది. సినిమా చూశాక బంధువుల పెళ్లికి వెళ్లొచ్చిన అనుభూతి కలుగుతుందని చెప్తున్నారు. నాగచైతన్యని తెరపై కొత్త తరహాలో చూపించబోతున్నామని అంటున్నారు.

ఎవరెవరు వచ్చారు..

ఎవరెవరు వచ్చారు..

ప్రారంభోత్సవ కార్యక్రమంలో నాగచైతన్య, హీరోయిన్ పూజా హెగ్డే, అక్కినేని అమల, అఖిల్, సుశాంత్, నాగసుశీల, సుప్రియ, యార్లగడ్డ సురేంద్ర కూడా పాల్గొన్నారు.

ఎంపికైన ఆర్టిస్టులు..

ఎంపికైన ఆర్టిస్టులు..

బ్రహ్మానందం, ఆలీ, ప్రభు, నాజర్, ఆశిష్ విద్యార్థి, సుప్రీత్, మధు, ప్రగతి, సుధ, దీక్షాపంత్ తదితరులు నటిస్తున్నారు. సమ్మర్ కి విడుదల అవుతుంది.

టెక్నికల్ టీమ్

టెక్నికల్ టీమ్

ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఛాయాగ్రహణం: ఐ.ఆండ్రూ, కూర్పు: ప్రవీణ్‌పూడి, కళ: పి.ఎస్‌.వర్మ.

English summary

 Naga Chaitanya's new film in the direction of Konda Vijay Kumar was launched at the Annapurna Studios. The film's formal pooja was conducted today. The director is famous for his film Gunde Jaari Gallanthaindhe.Naga Chaitanya will start working for this film till 23rd December. No titles have been finalized as yet, but Oka Laila Kosam is being considered. This film will be produced by Annapurna Studios. Pooja Hegde is playing the heroine role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu