For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మెకానిక్ గా నాగచైతన్య హైలెట్ అవుతారు

  By Srikanya
  |

  హైదరాబాద్ : దేవ కట్టా దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందుతున్న చిత్రం 'ఆటోనగర్ సూర్య'. ఈ చిత్రంలో నాగచైతన్య స్కిల్ డ్ మెకానిక్ గా కనిపించనున్నారు. మూడు రోజుల టాకీ పార్ట్ మినహా చిత్రం షూటింగ్ పూర్తైంది. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో దర్శకుడు దేవకట్టా మాట్లాడుతూ.."మా సినిమాకు విజయవాడకి ప్రత్యేకంగా కనెక్షన్ ఏమీ లేదు. ఆటోనగర్ అనేది అక్కడ ఆటో మొబైల్ కమ్యూనిటీ బిజినెస్ సెంటర్. మెకానికల్ బిజినెస్, పొలిటికల్ ఇంటర్ లింక్ లతో కథనం నడుస్తుంది" అన్నారు.

  నాగాచైతన్య పాత్ర గురించి వివరిస్తూ... "చైతూ ఈ చిత్రంలో స్కిలెడ్ మెకానిక్ గా కనిపించనున్నారు. పూర్తిగా హీరో సెంట్రిక్ స్క్రిప్టు ఇది. ప్రస్దానం కన్నా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది అన్నారు. ఇక దేవకట్టాకు డైలాగ్స్ విషయంలో మంచి గ్రిప్ ఉందని గతంలో ప్రస్దానం నిరూపించింది. ఆ చిత్రంలో లోతైన భావమున్న డైలాగులుకు మంచి పేరు వచ్చింది. అలాగే ఈ చిత్రకు మొదట ఆడియో టీజర్ విడుదల చేసి మరీ క్రేజ్ క్రియేట్ చేసారు" అన్నారు.

  ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో డైలాగును కూడా వినిపించారు. అది ... "చూడు బాబాయ్ కొట్టుకు చావటానికి మన మధ్య ఫ్యాక్షన్ గొడవలు లేవు, భూమి మీద పుట్టిన ప్రతీ ఒక్కడికి ఒక హక్కు ఉంది ...తెలిసిన పని చేసుకుంటూ అడగడమ్...కానీ ఆ హక్కుని కబ్డా చేసుకుంటూ అడగడమ్ నీ హక్కు అనుకుంటున్నా..హిస్టరీ లో జరిగిన ప్రతీ పోరాటానికి,యుద్దానికి ఇదే కారణం... అవును బాబాయ్ నేను అనాధనే కానీ అనామకుడ్ని కాదు నా పేరు సూర్య...ఆటో నగర్ సూర్య..."

  ఇక ఈ చిత్రంలో స్టోరీ లైన్ ఏమిటంటే...విజయవాడలో బెంజ్‌ సర్కిల్‌ ఎంత ఫేమసో... ఆటోనగర్‌ సూర్య కూడా అంతే. తనకు తెలిసిన పని చేసుకొంటూ... ఆ రంగంలో ఎదగాలనుకొనే రకం. ఒకరి హక్కును కబ్జా చేస్తే మాత్రం ఊరుకోడు. అందుకే సూర్య పేరు చెబితే రౌడీమూక గుండెల్లో కంగారు మొదలవుతుంది. ఇలాంటి మనస్తత్వమున్న సూర్య జీవితంలోకి ఎవరెవరు వచ్చారు? అతని ప్రయాణానికి అడ్డుగా నిలిచిన వారికి ఎలా బుద్ధిచెప్పాడు? తదితర విషయాలు తెలియాలంటే 'ఆటోనగర్‌ సూర్య' చిత్రం చూడాల్సిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా సమంత చేస్తోంది.

  ఈ చిత్రంలో సాయికుమార్‌ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. సంగీతం: అనూప్‌రూబెన్స్‌, సమర్పణ: ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌. ఈ చిత్రానికి నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దేవాకట్టా.

  English summary
  Naga Chaitanya's forthcoming movie "Autonagar Surya" is nearing completion. The film's director Deva Katta says that the shooting is all done except for 3 days talkie part and a couple of songs. When asked about Naga Chaitanya's character, he said, "Chaitu is playing the role of a skilled mechanic and his character will be a very fulfilling one. The film would be more hero-centric with several interesting characters being created in the script." Deva further promises that Autonagar Surya will be more entertaining than his previous outing "Prasthanam", which was crucially acclaimed.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X