»   » టీనేజ్ చైతూ: మేకప్ ఇంతగ మార్చేస్తుందంటే నమ్మలేం కావాలంటే ఇది చూడండి

టీనేజ్ చైతూ: మేకప్ ఇంతగ మార్చేస్తుందంటే నమ్మలేం కావాలంటే ఇది చూడండి

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు సిని నటుడు అక్కినేని నాగార్జున కుమారుడు మరియు విక్టరి వెంకటేష్ మేనల్లుడు, ఇద్దరు దాదా సాహెబ్ ఫాల్కే ల ముద్దుల మనవడిగా, నాన్న, మేనమామల నటవారసత్వాన్ని పుణికి పుచ్చుకుని హీరోగా పరిచయం అయిన అక్కినేని నాగచైతన్య హైదరాబాద్లో పుట్టాడు.

కొన్ని కారణాల వల్ల తల్లితో పాటు మద్రాస్ వెళ్ళిన చైతు అక్కడే చదువుకున్నాడు. అందుకే పెద్దగా చైతూ టీనేజ్ ఫొటోలు మనకి కనిపించలేదు. అయితే ఇప్పుడు ఆ లోటు కాస్త తీరినట్టే కొత్త సినిమాలో మళ్ళీ మనం టీనేజ్ నాగ చైతన్యని చూడ బోతున్నాం..


గత కొన్నేళ్ళు గ చైతూకి సరైన హిట్ పడలేదు. ఒక్క "ఏం మాయ చేసావే తప్ప" సోలో హిట్ ఇవ్వలేక పోయాడు నాగ చైతన్య. అయితే ఇప్పుడు ఆ మొత్తం ఫైయిల్యూర్ ని ఒకే దెబ్బతో తుడిచి పెట్టాలనుకుంటున్నాడు నాగ చైఒతన్య. మళయాలం రీమేక్ "ప్రేమం" ని అదే పేరుతో తెలుగు లోకి తెస్తున్న సంగతి తెలిసిందే.


Naga chaitanya Premam Teenage Look

గౌతం మీనన్ దర్శకత్వంలో సాహసమే శ్వాసగా సాగిపో చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తూనే చందూ డైరెక్షన్ లో ప్రేమమ్ సినిమా ద్వారా తనకి అచ్చొచ్చిన లవర్ బాయ్ రోల్ చేస్తున్నాడు.


అయితే మూడు విభిన్న వయసుల నడుమ పుట్టే ప్రేమను తెలియజేస్తూ తెరకెక్కుతున్న ప్రేమమ్ సినిమాలో చైతూ మేక్ ఓవర్ అందరినీ అలరిస్తుంది. ఇటీవలే మాసిన గెడ్డంతో తన టీచర్ శృతిహాసన్ సరసన కనువిందు చేసిన చైతూ పిక్స్ ని ఆరాధించడం పూర్తయ్యే లోపే సినిమాలో కీలకమైన రిసెప్షన్ ఫోటోని రిలీజ్ చేశాడు.


అయితే ప్రస్తుతం స్కూల్ ఏజ్ లో జరిగే ప్రేమాయణంలో చైతూ చిన్నప్పటి లుక్ కోసం వేసిన మేక్ అప్ అందరినీ అలరిస్తుంది.గడ్దం మీసం లేకుందా పూర్తిగా తీసేసి, నున్నగ దువ్విన తలతో పదహారేళ్ళ టీనేజర్ లా కనిపిస్తున్నాడు ఒక్కసారిగా చూసిన వాళ్ళకి నిజంగానే చైతూ చిన్నప్పటి ఫొటో ఏమో అనుఇకునేలా ఉందీ మేకప్.

English summary
Teenage look of Naga Chaitanya in the Telugu remake of the super hit Malayalam film Premam was leaked.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu