»   » నాగచైతన్య యమహా విహారం

నాగచైతన్య యమహా విహారం

Subscribe to Filmibeat Telugu

హీరో నాగచైతన్య హైదరాబాద్‌ రోడ్లపై తన సరికొత్త స్పోర్ట్స్‌ బైక్‌ యమహాపై పరుగులు తీయనున్నారు. అయితే ఆ బైక్‌ అట్లాంటి ఇట్లాంటి బైక్‌ కాదు. సకల సదుపాయాలు ఉన్న వాహనం. ఇంతకీ దాని ఖరీదెంతో తెలుసా.. అక్షరాల రూ.12.40 లక్షలు! సినీనటుడు అక్కినేని నాగచైతన్య బుధవారం ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయాన్ని సందర్శించారు.

తాను కొత్తగా కొనుగోలు చేసిన ద్విచక్రవాహనం యమహా వైజడ్‌ ఎఫ్‌ ఎఫ్‌ ఆర్‌1 రిజిస్ట్రేషన్‌ కోసం ఆయన స్వయంగా వచ్చి డిజిటల్‌ సిగ్నేచర్‌ చేశారు. ఇటీవలే మార్కెట్‌లోకి విడుదలైన ఈ స్పోర్ట్స్‌ బైక్‌ ఖరీదు అక్షరాల రూ.12.40 లక్షలు. దీనికి జీవిత కాల పన్ను కిందే రూ.లక్షా 11 వేలు చెల్లించారు. తనకు సిటీ ట్రాఫిక్‌ గురించి బాగా తెలుసునని, బైక్‌ రైడింగ్‌ అంటే చాలా ఇష్టమని ఈ సందర్భంగా నాగచైతన్య చెప్పారు. వాహనం రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ ఏపీ 9బిఎక్స్‌ 4568. వాహనాన్ని పూర్తిగా తనిఖీ చేసి, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఈ బైక్‌ నగర రోడ్లపై నాగచైతన్య చేతుల్లో పరుగులు తీయనుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu