For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మెకానిక్ vs మేయర్ ( 'ఆటోనగర్‌ సూర్య' ప్రివ్యూ )

  By Srikanya
  |

  హైదరాబాద్: ఆర్ధిక ఇబ్బందులలో చాలా కాలం ఆగిపోయి, మొత్తానికి విడుదల అవుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల అంచనాలు మాట దేమెడురుగు కానీ, నిర్మాత,దర్శకుల కెరీర్ లు మాత్రం ఆధారపడి ఉన్నాయని చెప్పవచ్చు. దర్శకుడుగా దేవకట్టాకు ఇది అగ్నిపరీక్ష లాంటి చిత్రం. ఈ చిత్రం హిట్ పై ఆయ తదుపరి చిత్రాలు,హీరోలు డేట్స్ ఆధారపడి ఉంటాయి. ఇక ఆర్దికంగా దివాళా తీసారని చెప్పబడుతున్న భారీ నిర్మాతలు ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారుకి ఇది తిరిగి ఊపిరిపోస్తుందా...ఉన్న కొన ఊపరి కాస్తా తీసేస్తుందా అనేది కొద్ది గంటల్లో తేలనుంది. అయితే చిత్రం బాగా వచ్చిందని, ఖచ్చితంగా హిట్ అయ్యే చిత్రం అని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది.

  ఆటోనగర్‌ నీడలో పెరిగిన ఓ నవతరం యువకుడి కథ ఇది. అతడి పేరు సూర్య (నాగచైతన్య). అందరూ ఆటోనగర్‌ సూర్య అంటారు. అతనికి కార్లు రిపేర్‌ చేయడం వృత్తి అయితే సమాజంలో చెడ్డవాళ్లను సరిచేయడం ప్రవృత్తి. పేదల కడుపుకొట్టాలని చూసేవాడికి ముచ్చెమటలు పట్టిస్తుంటాడు. అలాంటివాడు ఓ సారి నగర మేయర్‌తోనే గొడవకు దిగుతాడు. పెద్దవాళ్లతో మనకెందుకురా అంటే.. 'ఇది నాకు మేయర్‌కు జరుగుతున్న పోరాటం కాదు. అత్మాభిమానానికి ఆత్మవంచనకు జరుగుతున్న పోరాటం అంటాడు'.. 'మనిషి విలువకు జంతు బలానికి జరుగుతున్న పోరాటం'అని చెబుతాడు. అసలు ఈ సూర్య ఎవరు.. అతడలా మారడానికి కారణాలేంటి? అనేదే చిత్ర ప్రధానాంశం.

  Naga Chaitanya's 'Autonagar Surya' preview

  దర్శకుడు దేవా కట్టా మాట్లాడుతూ... ''సూర్య' పాత్ర ప్రజల్లోంచి పుట్టినది. మనం సృష్టించుకున్న పరిస్థితులు తిరిగి మనల్నే ఎలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి... దానికి సమాధానమేంటనేది సినిమాలో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటివరకు నాగచైతన్యను ప్రేమికుడిగా, కళాశాల విద్యార్థిగా చూశారు. ఈ సినిమాలో చైతు పాత్ర భిన్నంగా ఉంటుంది. ఆయన పలికే సంభాషణలు సమాజంలో అచేతనంగా ఉన్న వాళ్లకు చురకలు వేసేలా ఉంటాయి. వీటితోపాటు విజయవంతమైన జోడీ నాగచైతన్య-సమంత మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు మరింత ఆకర్షణగా నిలుస్తాయి''

  నాగచైతన్య మాట్లాడుతూ... ''దేవా కట్టా కథ చెప్పినప్పుడు ఈ సినిమా కచ్చితంగా చేయాలి అనిపించింది. సూర్య పాత్ర నాకు మంచి గుర్తింపును ఇస్తుంది. ప్రేమ, పోరాటం, ఉత్కంఠ.. ఇలా అన్ని అంశాలు కలిపి ఉన్న సినిమా ఇది. వివిధ కారణాల వల్ల ఆలస్యమైనా ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఏ మాత్రం నిరాశపరచదు. అన్నింటికీ మించి అనూప్‌ అందించిన సంగీతం పెద్ద ఎసెట్‌. సినిమా ప్రేక్షకుల నోళ్లలో ఇన్నాళ్లు నానింది అంటే అది అనూప్‌ సంగీతం వల్లే''.

  పతాకం: మ్యాక్స్‌ ఇండియా ప్రొడక్షన్స్‌

  చిత్రం: ఆటోనగర్‌ సూర్య

  నటీనటులు: నాగచైతన్య, సమంత, సాయికుమార్‌, కిమాయా, బ్రహ్మానందం, ఆశిష్‌ విద్యార్థి, అజయ్‌, ఎమ్మెస్‌ నారాయణ, జయప్రకాశ్‌రెడ్డి, రఘుబాబు, దువ్వాసి మోహన్, వేణుమాధవ్, బ్రహ్మాజీ, జీవా, శ్రీనివాసరెడ్డి, మాస్టర్ భరత్, అజయ్ ఘోష్ తదితరులు

  ఛాయాగ్రహణం: శ్రీకాంత్ నారోజ్,

  కూర్పు: గౌతంరాజు,

  ఫైట్స్: రామ్-లక్ష్మణ్,

  కళ: రవీందర్,

  సంగీతం: అనూప్‌ రూబెన్స్‌,

  కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: దేవా కట్టా.

  నిర్మాత: కె.అచ్చిరెడ్డి

  సమర్పణ: ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌.

  విడుదల తేదీ: 27, జూన్ 2014.

  English summary
  
 Autonagar Surya is a action drama movie directed by Deva Katta. Naga Chaitanya and Samantha playing the main lead roles along with Sai Kumar in pivotial roles. The film was produced by K. Atchi Reddy on Max India Productions banner. Anoop Rubens scored music for this film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X