»   »  రోజుకొకటి...ఐడియా బాగుంది

రోజుకొకటి...ఐడియా బాగుంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఏదో ఒక కొత్తదనం లేకపోతే ఎవరూ పట్టించుకోవటం లేదు. అందుకే ఆడియో విడుదల నుంచి రిలీజ్ దాకా ప్రతీ అడుగు విభిన్నతకు చోటిచ్చేలా ప్లాన్ చేస్తున్నారు నవయువ దర్శకులు. అలాంటి ప్రయత్నమే నాగచైతన్య తాజా చిత్రం 'దోచేయ్‌' కి జరుగుతోంది. ఓ కొత్త ఆలోచనతో ఈ చిత్రం ఆడియోని విడుదల చేసి అందరి దృష్టిలో పడటానికి దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే...

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

నాగచైతన్య, కృతి సనన్‌ జంటగా నటించిన చిత్రం 'దోచేయ్‌'. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహించారు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాత. సన్నీ ఎం.ఆర్‌ సంగీతం అందించిన 'దోచేయ్‌' ఆడియో సీడీని ఏప్రిల్‌ 3న విడుదల చేయనున్నారు. ఈలోగా మార్చి 28 నుంచి, ఏప్రిల్‌ 1 వరకూ 'దోచేయ్‌'లోని ఒకొక్క పాటని విడుదల చేస్తారు. ఏప్రిల్‌ 2న మేకింగ్‌ వీడియోను ఆవిష్కరిస్తారు. ఏప్రిల్‌ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

దర్శకుడు మాట్లాడుతూ... ''క్రైమ్‌- కామెడీ నేపథ్యంలో సాగే చిత్రమిది. 'స్వామి రారా'లో ఏ కొత్తదనమైతే ఆకట్టుకొందో... అలాంటిదే ఈ సినిమాలోనూ కనిపిస్తుంది. సన్నీ స్వరపరిచిన పాటలు ఆకట్టుకుంటాయి. ఆయన అందించిన నేపథ్య సంగీతమూ ఈ చిత్రానికి చాలా కీలకం'' అని చెప్పారు.

Naga Chaitanya's Dochay’s audio release date confirmed

అలాగే ... ''ప్రతి మోసం వెనుక ఇద్దరుంటారు. ఒకరు మోసం చేసేవాడు. మోసపోయేవాడు. నువ్వు రెండో వాడు కాకుండా ఉండాలంటే, మొదటివాడివి అయ్యితీరాల్సిందే..'' ఈ అంశం చుట్టూ తిరిగే కథే మా చిత్రం అంటున్నారు సుధీర్‌ వర్మ.

ఈ చిత్రంలో చైతన్య ఇంతకు ముందెన్నడూ చేయని పాత్రలో కనిపిస్తాడని చెప్తున్నారు. మోసం చేసేవారిని ఘరానా మోసంతో దెబ్బకొట్టే యువకుడి పాత్రలో నాగచైతన్య నటిస్తున్నాడు. చైతన్య సరసన కృతిసనాన్‌ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రే.లి. పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నిర్మాత మాట్లాడుతూ... ఇటీవల పీటర్ హెయిన్స్ నేతృత్వంలో నాగచైతన్యతో ఓ థ్రిల్లింగ్ ఛేజ్ ని చిత్రీకరించటం జరిగింది. ఆ ఛేజ్ చాలా ఎక్సట్రార్డనరీగా వచ్చింది. రెండు పాటలు సెట్స్ లోనూ, ఒక పాట బ్యాంకాక్ లోనూ తీసాం. దీంతో మా దోచేయ్ చిత్రం షూటింగ్ ఆల్రోస్ట్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సమ్మర్ స్పెషల్ గా ఏప్రియల్ 17 న వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తాం అన్నారు.


ఈ చిత్రంలో బ్రహ్మానందం, పోసాని కృష్ణముర ళి, రవిబాబు, రావు రమేష్‌ తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్‌., సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ప్రసాద్‌., ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్‌., ఆర్ట్‌: నారాయణరెడ్డి., కో-ప్రొడ్యూసర్‌: భోగవల్లి బాపినీడు., నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌., కథ-స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: సుధీర్‌వర్మ.

English summary
Naga Chaitanya and Sudheer Varma's Dochay film makers are planning to release the audio of the film on April 3rd.
Please Wait while comments are loading...