»   » నాగ చైతన్య 'దోచేయ్‌' 4 వ సాంగ్ (వీడియో)

నాగ చైతన్య 'దోచేయ్‌' 4 వ సాంగ్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అక్కినేని నటవారసుడు నాగచైతన్య నటిస్తున్న చిత్రానికి ‘దోచెయ్‌' అనే టైటిల్‌ను ఖరారు చేసి రోజుకో పాట చొప్పున విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ‘స్వామిరారా' ఫేం సుధీర్‌ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రే.లి. పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అందులో భాగంగా ఈ రోజు నాలుగవ పాట టీజర్ కొద్ది సేపటి క్రిందట విడుదలైంది. ఈ వీడియోని మీరు ఇక్కడ చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ చిత్రంలో చైతన్య ఇంతకు ముందెన్నడూ చేయని పాత్రలో కనిపిస్తాడట. మోసం చేసేవారిని ఘరానా మోసంతో దెబ్బకొట్టే యువకుడి పాత్రలో నాగచైతన్య నటిస్తున్నాడు. అందుకే దీనికి ‘దోచెయ్‌' అనే టైటిల్‌ను రిజిస్టర్‌ చేసినట్టు సమాచారం. చైతన్య సరసన కృతిసనాన్‌ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.

చల్లని వాతావరణం, కారు పక్క సీట్లో ప్రేయసి, మృదుమధురమైన సంగీతం.. లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లడానికి ప్రేమికులకు ఇంతకంటే మంచి సందర్భం ఏముంటుంది. ఇలాగే అనుకున్నారు నాగచైతన్య, కృతి సనన్‌. ఇంకేముంది? ఓ కారు తీసుకొని అలా లాంగ్‌డ్రైవ్‌కెళ్లి ఓ పాటేసుకున్నారు. ఆ ప్రయాణ సరిగమలు తెలియాలంటే మాత్రం 'దోచేయ్‌' చూడాల్సిందే.

''ప్రతి మోసం వెనుక ఇద్దరుంటారు. ఒకరు మోసం చేసేవాడు. మోసపోయేవాడు. నువ్వు రెండో వాడు కాకుండా ఉండాలంటే, మొదటివాడివి అయ్యితీరాల్సిందే..'' ఈ అంశం చుట్టూ తిరిగే కథే మా చిత్రం అంటున్నారు సుధీర్‌ వర్మ. కృతి సనన్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రై.లి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

 Naga Chaitanya’s Dochey 4th song teaser released

నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ-‘ అత్తారింటికి దారేది తర్వాత మా బ్యానర్‌లో స్వామిరారా టెక్నిషియన్స్‌తో చేస్తున్న సినిమా ఇది. నాగచైతన్య చాలా డెటికేటెడ్‌ ఆర్టిస్ట్‌. స్టైలిష్‌గా ఉండే కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. నాగచైతన్య మూవీలో బెస్ట్‌ మూవీ అవుతుంది. ఆడియన్స్‌తో పాటు ఫ్యాన్స్‌కి కూడా బాగా నచ్చే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. పీటర్‌ హెయిన్స్‌ సారధ్యంలో ఒక థ్రిల్లింగ్‌ ఛేజ్‌ జరుగుతోంది'. అన్నారు.

ఈ చిత్రంలో బ్రహ్మానందం, పోసాని కృష్ణముర ళి, రవిబాబు, రావు రమేష్‌ తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్‌., సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ప్రసాద్‌., ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్‌., ఆర్ట్‌: నారాయణరెడ్డి., కో-ప్రొడ్యూసర్‌: భోగవల్లి బాపినీడు., నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌., కథ-స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: సుధీర్‌వర్మ.

English summary
Naga Chaitanya’s Dochey 4th song teaser has been released a short while ago. The song teaser is awesome with feel-good music.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu