»   » 'మజ్ఞు' : నాగచైతన్య,శ్రుతిహాసన్ గెటప్స్ లీక్ ( ఫొటోలు)

'మజ్ఞు' : నాగచైతన్య,శ్రుతిహాసన్ గెటప్స్ లీక్ ( ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మళయాళంలోలో విజయవంతమైన ప్రేమమ్ సినిమాకి రీమేక్ గా నాగ చైతన్య 'మజ్ఞు' టైటిల్ తో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం లో నాగచైతన్య విక్రమ్ అనే పేరుతో కనిపిస్తారు. శృతి హాసన్..టీచర్ గా కనిపించనుంది. ఆమె పాత్ర పేరు సితార అని తెలుస్తోంది. ఈ చిత్రంలో వారి పాత్రలకు సంభందించిన ఫొటోలు ..లొకేషన్ నుంచి లీక్ అయ్యాయి. వాటిని మీరు ఇక్కడ చూడవచ్చు.

అలాగే..ఈ సినిమా లో చైతు మూడు రకాలుగా కనిపిస్తాడని సమాచారం. మెదటిగా చాలా తన వయస్సు కన్నా చాలా తక్కువగా ఉంటే కుర్రాడి గా మెదటి అరగంట కనిపిస్తాడు. తరువాత 25 సంవత్సరాల కాలేజి కుర్రాడి పాత్రలో ఓ గంట సేపు కనిపించి, చివరి అరగంట 30 సంవత్సారాల వ్యక్తిలా కనిపిస్తాడని సమాచారం.

Naga Chaitanya's Majnu getup

హీరోయిన్ శ్రుతి హాసన్ ఈ మూడు రకాల క్యారక్టర్స్ తోను కలిసిపోవచ్చు. ఇందులో టీచర్ గా మాత్రం ఒరిజినల్ సినిమాలో చేసిన సాయి పల్లవి తోనే ఆ క్యారక్టర్ ని చేయించబోతున్నారు.

Naga Chaitanya's Majnu getup

శ్రుతిహాసన్‌ తొలిసారిగా ఈ చిత్రంలో నాగచైతన్య సరసన నటించనున్నారు. 'కార్తికేయ' చిత్రంతో విజయం అందుకున్న చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళంలో విజయవంతమైన 'ప్రేమమ్‌'ని తెలుగులో రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Naga Chaitanya's Majnu getup

ఒక కుర్రాడి జీవితంలోని మూడు దశల్లో సాగే ప్రేమకథల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఇందులో ముగ్గురు హీరోయిన్లు వుంటారు. చైతూను టీనేజీలో లవ్‌లోకి దింపే అమ్మాయిగా ‘ప్రేమమ్'లో నటించిన అనుపమ పరమేశ్వరనే నటిస్తుండగా.. లెక్చరర్ పాత్రలో హీరోని ప్రేమలో ముంచెత్తే బ్యూటీగా శ్రుతి హాసన్ కనిపించబోతోంది.

English summary
Naga Chaitanya will sport three different looks in 'Majnu' which is the remake of malayalm hit 'Premam'.
Please Wait while comments are loading...