»   » అమ్మ వచ్చింది..., ఇక పుకార్లు ఆపండి: నాగ చైతన్య ఇలా పోస్ట్ చేసాడు...

అమ్మ వచ్చింది..., ఇక పుకార్లు ఆపండి: నాగ చైతన్య ఇలా పోస్ట్ చేసాడు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

అక్కినేని నాగచైతన్య, స్టార్‌ హీరోయిన్‌ సమంతల నిశ్ఛితార్థ వేడుక హైదరాబాద్‌లో ఆదివారం ఘనంగా జరిగింది. చాలా కాలం తర్వాత ఈ ఫంక్షన్‌లోనే చైతన్య తండ్రి నాగార్జున, తల్లి లక్ష్మి ఒకే వేదికపై కనిపించారు. వారిద్దరూ వారి వారి భాగాస్వాములతోనే కొడుకు నిశ్ఛితార్ధ ఫంక్షన్‌కు హాజరయ్యారు.

చైతన్య ఎంగేజ్‌మెంట్‌ సందర్భంగా అందరూ తమ తమ కుటంబాలతో తరలివచ్చారు. ఎప్పుడూ పెద్దగా బయటకు రాని వెంకటేష్‌ భార్య నీరజ, కూతుళ్లు కూడా ఈ ఫంక్షన్‌కు వచ్చారు. ఈ ఫోటోలన్నింటినీ చైతన్య తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. 'ఓ మరిచిపోలేని రాత్రి.. కొత్త జీవితానికి ప్రారంభం.. ఇంత సంతోషానికి కారణమైన నా సమంతకు ధన్యవాదాలు' అని చైతూపోస్ట్ చేశాడు.

నాగార్జున తొలి భార్య సంతానం నాగ‌చైత‌న్య అని తెలిసిన విష‌య‌మే. ఆమె పేరు లక్ష్మి. నాగ‌చైత‌న్య వాళ్ల అమ్మ బ‌య‌టికి వ‌చ్చేదే చాలా త‌క్కువ‌. ఆమెను చూసిన వాళ్లు కూడా త‌క్కువే. రామానాయుడు కూతురు అయిన ల‌క్ష్మి.. చాలా ఏళ్ల కిందే నాగార్జున‌తో విడిపోయింది. నాగ‌చైత‌న్య కూడా ఆమెతోనే పెరిగాడు. చిన్న‌ప్ప‌ట్నుంచీ తండ్రి అండ లేకుండానే ఉన్నాడు నాగ‌చైత‌న్య‌. అదే విష‌యాన్ని చెప్పాడు నాగచైత‌న్య‌.

Naga Chaitanya's Mother Laxmi was Present at Naga Chaitanya and Samantha Engagement

చై పెళ్ళి విషయం వచ్చే వరకూ దాదాపు అఙ్ఞాతంగానే ఉండిపోయారు లక్ష్మి. తండ్రి నాగార్జున గురించి తెలుసు కానీ చైతూ తల్లి లక్ష్మి గురించి ఎవరికీ తెలియదు. కొద్ది నెలల క్రితమే రామానాయుడి కూతురైన లక్ష్మి గురించి చైతూ మదర్స్ డే సందర్భంగా కొన్ని విషయాలు తెలిపాడు.నేను-అమ్మ.. 18 ఏళ్ల వరకు నాకు తెలిసిన ప్రపంచం మేమిద్దరమేనని. నన్ను కోప్పడాలన్నా.. ప్రేమించాలన్నా.. నాతో ఆడుకోవాలన్నా.. అన్నిటికీ అమ్మేనని ఒక్కమాటలో చెప్పేసాడు చైతు.

అంతేకాకుండా తనకు క్రికెట్, మ్యూజిక్, ఫొటోగ్రఫీ, రేసింగ్ ఏది ఇష్టమంటే అది నేర్పించేదని, ఏదైనా కావాలంటే ఈ పరీక్ష పాసవ్వు తెచ్చిపెడతానని, ఊరికే వచ్చిందేదీ సంతోషాన్నివ్వదని చెప్పడమే అమ్మ ఉద్దేశం అంటూ నాగచైతన్య తన తల్లి గురించి తెలిపాడు. ఓ స్నేహితురాలిగా.. గురువుగా.. గైడ్ లాగా నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది అమ్మే అని తనకు తన తల్లి ఎంతో చెప్పేసాడు.

Naga Chaitanya's Mother Laxmi was Present at Naga Chaitanya and Samantha Engagement

అమలను పెళ్లి చేసుకోవడానికి ముందు నాగార్జున.. రామానాయుడి కూతురు, వెంకటేష్‌, సురేష్‌బాబుల చెల్లెలు అయిన లక్ష్మిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. చైతన్య పుట్టిన తర్వాత వారిద్దరూ విడిపోయారు. దగ్గుబాటి ఫ్యామిలీ..నాగ‌చైత‌న్య నిశ్చితార్థం అంతా ద‌గ్గ‌రుండి జ‌రిపించారు.

ఎంత‌యినా త‌మ ఇంటి ఆడ‌బిడ్డ త‌న‌యుడు చైతూ..అందుకే రామానాయుడు లేని లోటు క‌న‌ప‌డ‌కుండా..కుటుంబ‌స‌భ్యులంతా హాజ‌రై వేదిక‌ను క‌ళ‌క‌ళ‌లాడించారు. నాగ‌చైత‌న్య ప్రేమ పెళ్లి ప‌ట్టాలెక్కేందుకు కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన త‌ల్లి ల‌క్ష్మి.. నిశ్చితార్ధానికి రాలేదనీ అమల పై ఆమె కోపంగా ఉన్నారనీ వదంతులు వచ్చినా అవన్నీ "వదంతులేనని" ఈ పోస్ట్ తో తేలిపోయింది.

English summary
"An unforgettable night .. to a new beginning .. thank you ..my love #Samantha.. my family and everyone out there for the positivity" Posted Nagachaitanya On his Facebook wall
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu