»   » చైతూ,సమంత లవ్ స్టోరీపై దాసరి, గెడ్డం బాగుందా అంటూ నాగ్, అఖిల్ అలా అనేసాడు

చైతూ,సమంత లవ్ స్టోరీపై దాసరి, గెడ్డం బాగుందా అంటూ నాగ్, అఖిల్ అలా అనేసాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగచైతన్య హీరోగా నటించిన చిత్రం 'ప్రేమమ్‌'. చందు మొండేటి దర్శకుడు. శ్రుతిహాసన్‌, మడోనా సెబాస్టియన్‌, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్స్. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. గోపీసుందర్‌, రాజేష్‌ మురుగేశన్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలని మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో విడుదల చేశారు.

అలాగే వెంకీ, నాగ్ లు కీలక పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నట్టు సమాచారం. ఇక ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా దసరాకి ఈ మూవీని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్ 7న ప్రేమమ్ చిత్రం విడుదల కానున్నట్టు వార్తలు వస్తోండగా, సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ప్రేమమ్ ఆడియో వేడుకని ఘనంగా నిర్వహించారు.స్లైడ్ షోలో ఆడియో పంక్షన్ విశేషాలు... ఫొటోలతో


నాగేశ్వరరావుతో అన్ని తీసింది నేనే

నాగేశ్వరరావుతో అన్ని తీసింది నేనే

ప్రేమమ్ తొలి సీడీని దాసరి నారాయణరావు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ...‘‘ప్రేమ అనే పదానికీ, పదార్థానికీ అర్థం అక్కినేని కుటుంబం. ఆ ఫ్యామిలీ ప్రేమకథలకు కేరాఫ్‌ అడ్రస్‌. అక్కినేని నాగేశ్వరరావుతో నేను 27 సినిమాలు తీశా. అందులో 22 ప్రేమ కథలే. ఆయనతో అన్ని సినిమాలు తీసిన ఏకైక దర్శకుడిని నేనే. అదే చరిత్ర నాగార్జునతో కొనసాగింది. ‘మజ్ను' నాగ్‌ కెరీర్‌లో మంచి విజయం సాధించింది. చైతూ కూడా ఆ సంప్రదాయం కొనసాగించడం ఆనందంగా ఉంది. అఖిల్‌ కూడా ప్రేమకథల్ని ఎంచుకోవాలని కోరుకొంటున్నా'' అన్నారు ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు.


అఖిల్ చేతుల మీదుగా

అఖిల్ చేతుల మీదుగా

ప్రేమమ్ ట్రైలర్ ని అఖిల్‌ విడుదల చేశారు. ప్రేమమ్ లో స్కూల్ లైఫ్ , కాలేజ్ లైఫ్, ఆ తర్వాతి జీవితం..ఇలా మూడు క్యారెక్టర్ లను చైతు పోషించగా, ఆ విషయాన్ని ట్రైలర్ లో క్లియర్ గా చూపించాడు చందూ మొండేటి. గోపీసుందర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , కార్తీక్ ఘట్టమనేని కెమెరా పనితనం ఈ ట్రైలర్ లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరో విశేషమంటే లవ్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ట్రైలర్ ని కరెక్ట్ గా 1:43 నిమిషాలు కట్ చేశారు. 143 అంటే మీకు అర్ధమయ్యే ఉంటుంది కదా ..


నాగ్ చెప్పేస్తాడనుకున్నారు

నాగ్ చెప్పేస్తాడనుకున్నారు

వాస్తవానికి 'ప్రేమమ్' ఆడియో వేడుక అభిమానుల్లోనే కాక మీడియా వర్గాల్లోనూ ఆసక్తిని రేపింది. ముఖ్యంగా నాగచైతన్య - సమంతల వివాహం ఖరారైన తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి అభిమానుల ముందుకు వస్తుండడంతో. అక్కినేని కుటుంబం నుండి ఎలాంటి ప్రకటన వస్తుందో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. నాగార్జున తన వైపు నుండి పూర్తి స్పష్టత ఇచ్చేయగా, చైతూ కూడా ఈ ఏడాది కాదు, వచ్చే ఏడాదిలో వివాహం అంటూ ప్రకటన ఇచ్చేసారు. ఇక ఇప్పటివరకు నెటిజన్లతో ఆడుకున్న సమంత వైపే అందరి చూపులు ఉన్నాయి. 'ప్రేమమ్' వేడుకకు సమంత విచ్చేస్తుందా? ఒకవేళ వస్తే ఎలాంటి ప్రకటన చేస్తుంది? అని అంతా ఎదురుచూసారు.


అంతకుమించి ముహూర్తం ఉంటుందా

అంతకుమించి ముహూర్తం ఉంటుందా

అయితే ఈ ఆడియో పంక్షన్ కేవలం సినిమా గురించే చెప్పింది. అభిమానులను ఉత్సాహపరిచే విధంగా చెలరేగిపోయింది. ఒక మంచి ముహూర్తాన్ని చూసి తానే అధికారిక ప్రకటన చేస్తానని చెప్పిన నాగార్జునకు తన తండ్రి ఏఎన్నార్ పుట్టినరోజును మించిన మంచి ముహూర్తం ఉంటుందా? దీంతో 'ప్రేమమ్' వేడుక ఖచ్చితంగా నాగచైతన్య, అఖిల్ ల వివాహ ప్రకటనలకు వేదిక అవుతుందన్న టాక్ హల్చల్ చేసింది. కానీ అందరిని నిరాశపరిచింది.


చైతూని ఆ సినిమాలు వద్దని చెప్పా

చైతూని ఆ సినిమాలు వద్దని చెప్పా

చైతూని చూస్తుంటే హీరోలా అనిపించడు. మనింట్లోనో పక్కింట్లోనో ఓ చిట్ట చివరి కుర్రాడిలా ఉంటాడు.‘ఏం మాయ చేశావె', ‘100 % లవ్‌' చిత్రాలతో చైతూ అక్కినేని వారసుడు అనిపించాడు. అతను మధ్యలో యాక్షన్‌ కథల్ని ఎంచుకొన్నప్పుడు‘యాక్షన్‌ సినిమాలొద్దు' అని నాగార్జునతో చెప్పా అని దాసరి అన్నారు.
హృదయాలను దోచుకునే కుర్రాడిలా

హృదయాలను దోచుకునే కుర్రాడిలా

ఎందుకంటే ప్రేమకు మరణం లేదు. ఎన్ని వందల సంవత్సరాలైనా, ప్రేమకథలకున్న చరిత్ర ఏ సినిమాకీ ఉండదు. హీరో అంటే వంద మందిని కొట్టేసేలా కాకుండా వందమంది అమ్మాయిల హృదయాల్ని దోచుకొనే కుర్రాడిలా చైతూ చక్కటి పేరు సంపాదించుకొన్నాడు. అంటూ చైతన్యను పొగడ్తల్లో ముంచెత్తారు దాసరి. దాసరి కెరీర్ లో కూడా ఎక్కువ ప్రేమ కథలే చేసారు అని దాసరి అన్నారు.


శ్రుతిహాసన్ గురించి దాసరి

శ్రుతిహాసన్ గురించి దాసరి

శ్రుతి హాసన్ ని చూసి ‘కమల్‌హాసన్‌లా ఉంది' అంటున్నారు. కానీ నాకు ఆమె తల్లి సారిక గుర్తొచ్చింది. చైతూ- శ్రుతి కాంబినేషన్‌ బాగుంది. మడోనా చక్కగా ఉంది. ఈ కాంబినేషన్‌ మంచి విజయం సాధించాలి అని ఆశ్వీరదించారు దాసరి నారాయణరావు.


 రీమేక్ కదా అనుకోవచ్చు కానీ..

రీమేక్ కదా అనుకోవచ్చు కానీ..

చందు గతంలో తీసిన ‘కార్తికేయ' చూశా. వైవిధ్యమైన దర్శకుడు అనిపించాడు. ఈ సినిమాని బాగా తీశాడనిపిస్తోంది. ‘ప్రేమమ్‌' గొప్ప సినిమా. రీమేక్‌ కదా అనుకోవొచ్చు. కానీ రీమేక్‌ కత్తిమీద సాము లాంటిది. గోపీసుందర్‌ సంగీతమందించిన ‘వూపిరి' చూశా. అందులో నేపథ్య సంగీతం చాలా బాగుంది అన్నారు దాసరి నారాయణరావు.


 నాగార్జున మాట్లాడుతూ....

నాగార్జున మాట్లాడుతూ....

‘‘చైతూ ‘ఎవరే...' పాటని ఎప్పుడో వినిపించాడు. రోజూ పొద్దుటే ఆ పాట వింటూనే ఉన్నా. విజువల్స్‌ చాలా బాగా వచ్చాయి. ప్రేమమ్‌ అంటే ఏమిటో మొన్నే తెలుసుకొన్నా. సంస్కృతంలో ప్రేమమ్‌ అంటే... ప్రేమ అన్నారు నాగార్జున. నాగార్జున ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఆయనే స్వయంగా ఈ చిత్రం చూసి రీమేక్ ని ఓకే చేసారు. సినిమా ఘన విజయం సాధిస్తుందని నమ్మకంగా ఉన్నారు.


కొడుకుని చూసే తండ్రి గెడ్డం

కొడుకుని చూసే తండ్రి గెడ్డం

ఈ సినిమా కోసం చైతన్య గెడ్డం పెంచినప్పుడు బాగుందే అనిపించింది. అది చూసే ‘ఓం నమో వేంకటేశాయ'లో నేనూ గెడ్డం పెంచా అన్నారు నాగార్జున. నాగార్జున గెడ్డం కూడా బాగుందని అందరూ అంటున్నారు. నాగార్జున గెడ్డంతో ఈ మధ్యనే వచ్చిన నిర్మలా కాన్వెంట్ లోనూ కనిపించారు. నాగార్జున గెడ్డంతో కనిపించిన చిత్రాలు తక్కువనే చెప్పాలి.


‘దేవదాస్‌', ‘గీతాంజలి' , ప్రేమమ్ అంటారు

‘దేవదాస్‌', ‘గీతాంజలి' , ప్రేమమ్ అంటారు

ప్రేమకథా చిత్రాల్ని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తున్నారు. ‘దేవదాస్‌', ‘గీతాంజలి' సినిమాల్ని ఆదరించారు. వాటికి సరిపోయే ప్రేమకథ... ‘ప్రేమమ్‌'. మలయాళంలో సూపర్‌ హిట్‌ అయ్యింది. ఇక్కడ ఈ సినిమా కూడా అంతే సూపర్‌ హిట్‌ అవుతుందని నా నమ్మకం. వచ్చే నెల 7న సినిమా విడుదల అవుతుంది అన్నారు నాగార్జున.


పోటీ పడలేను..ఫాలో అవుతాను

పోటీ పడలేను..ఫాలో అవుతాను

‘‘ట్రైలర్‌ చూస్తుంటే.. ప్రపంచంలో స్వచ్ఛమైన ప్రేమికుడు మా అన్నయ్యే అనాలనిపిస్తుంది. ప్రేమకథల్లో తనతో పోటీ పడలేను. తనని ఫాలో అయిపోతానంతే. చందూ తొలి సినిమా ‘కార్తికేయ' చూసినప్పుడు కాస్త భయం వేసింది. ఇప్పుడు ఈ సినిమాని చాలా బాగా తీశాడు''అన్నారు అఖిల్.


చైతూ నాకు ప్రెండ్

చైతూ నాకు ప్రెండ్

‘‘ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. నాపై నమ్మకంతో ఈ పాత్ర ఇచ్చినందుకు కృతజ్ఞతలు. సంగీతం చాలా బాగుంది. చైతూ నాకు మంచి స్నేహితుడు'' అంది శ్రుతిహాసన్‌. శ్రుతిహాసన్, నాగచైతన్య కాంబినేషన్ లో ఇంతకు ముందు ఏ చిత్రమూ రాలేదు. తొలి చిత్రం ఇది. ఈ చిత్రంలో ఆమె టీచర్ గా కనిపించనుంది. సినిమాలో రెండో ఎపిసోడ్ గా వస్తుంది అది.


రీమేక్ చేయమనటం తప్పు

రీమేక్ చేయమనటం తప్పు

‘‘చందూని రీమేక్‌ చేయమని అడగడం తప్పు. ఎందుకంటే తనలో క్రియేటివిటీ లెవల్స్‌ వేరేలా ఉన్నాయి. తన సొంత కథతో ఓ మరో మంచి సినిమా తీయాలనుంది. చాలా నమ్మకంగా చెబుతున్నా. మనమంతా గర్వంగా చెప్పుకొనే సినిమా ఇది'' అన్నారు నాగచైతన్య.


దాసరి ఒక్కడే సమంత ప్రస్ధావన

దాసరి ఒక్కడే సమంత ప్రస్ధావన

నాగచైతన్య సమంత ఇద్దరూ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో వీరిద్దరి ప్రేమకథ గురించి నాగార్జున, నాగచైతన్యలు మనసు విప్పి మాట్లాడతారేమో అనుకొన్నారు అక్కినేని అభిమానులు. అయితే.. వాళ్లిద్దరూ సమంత ప్రస్తావన తీసుకురాలేదు. అయితే ముఖ్య అతిథిగా విచ్చేసిన దాసరి మాత్రం సమంత ప్రస్తావన తీసుకొచ్చారు.


సమంతను మాయలో పడేసాడు

సమంతను మాయలో పడేసాడు

దాసరి మాట్లాడుతూ ‘‘చైతూ తమాషాగా ఉంటాడు. మాటలతో, నవ్వుతో పడేస్తాడు. ఆ నవ్వులోనే ఏదో మాయ ఉంది. అలా నవ్వుతూనే ఓ హీరోయిన్‌ని పడేశాడు. ‘ఏం మాయ చేసావే'తో ఆ హీరోయిన్‌ కూడా మాయ చేసింది'' అంటూ పరోక్షంగా సమంత ప్రస్తావన తీసుకొచ్చారు. దాసరి మాట్లాడుతున్నంతసేపూ నాగచైతన్య ముసిముసిగా నవ్వుకోవడం అందరినీ ఆకట్టుకొంది.


నాకు కావాల్సిన వాళ్ళ కోసమే వస్తాను

నాకు కావాల్సిన వాళ్ళ కోసమే వస్తాను

''నాకు కావల్సినవారు.. రావల్సినవారు.. అనుకుంటేనే నేను వస్తాను. అందుకే ఈ కార్యక్రమానికి వచ్చాను. నేను అక్కినేనితో 28 సినిమాలు చేస్తే అందులో 22 సినిమాలు లవ్ స్టోరీసే. ప్రేమాభిషేకం మరో 20 ఏళ్ళు అలాగే ఉంటే మాత్రం.. 100 ఏళ్ళ తెలుగు సినిమా చరిత్రలో అది మరో రికార్డు అవుతుంది. నాగ్ కెరియర్ లో ఒక మజ్నూ సూపర్ హిట్. అలాగే చైతన్యకు ఈ లవ్ స్టోరీ పెద్ద హిట్టవ్వాలి. ఇక అఖిల్ కూడా ప్రేమ కథలే చేయాలి'' అంటూ సెలవిచ్చారు గురువు గారు.


గ్లామర్ డాల్ అనేసారే

గ్లామర్ డాల్ అనేసారే

హీరోయిన్ శృతి హాసన్ గురించి మాట్లాడుతూ.. ''శృతి హాసన్.. సారిక రెప్లికా.. నాతో 5 సినిమాలు చేసింది.. పెర్ఫామర్. డ్యాన్సర్. గ్లామర్ డాల్'' అంటూ పొగిడేశారు దాసరి. అనుకోకండా సారిక ప్రస్దావన వచ్చేసరికి శృతికి ఏమనాలో అర్దం కాలేదు. అలా చూస్తూండిపోయింది. ముఖ్యంగా తన త్లిని గ్లామర్ డాల్ అనటంలో ఆమెకు ఆనందం కలిగిందో లేదా అనేది మాత్రం అర్దం కాలేదు.


హిట్టైనా, ఫ్లాఫైనా

హిట్టైనా, ఫ్లాఫైనా

''బాధ సంతోషం హిట్టయినా ఫ్లాపైనా కొన్ని సంవత్సరాల నుంచి నన్ను సపోర్టు చేస్తోంది అక్కినేని అభిమానులే. ఒరిజినల్ కంటే బాగా చేద్దాం.. ఆ హీరోకంటే బాగా చేద్దాం.. అలాంటి ఇంటెన్షన్ తో ఈ సినిమా చేద్దామని అనుకోలేదు. మేం అక్కడున్న టెక్నీషియన్లను అందరినీ ఎప్రిషియేట్ చేస్తూ ఈ సినిమా తీశాం. అలాగే తెలుగు ప్రేమమ్ రిలీజయ్యాక అక్కడి టెక్నిషియన్లు ఇక్కడ వారందరినీ అభినందిస్తారు'' అని చెప్పాడు నాగచైతన్య.


ఎక్కువ చేసినా, తక్కువ చేసినా నష్టమే

ఎక్కువ చేసినా, తక్కువ చేసినా నష్టమే

సోగ్గాడే చిన్నినాయన సినిమాను తీసిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ.. ''రీమేక్ కష్టం.. ఎక్కువ చేసినా కష్టమే తక్కువ చేసిన కష్టమే. అందుకే చందుని ప్రశంసిస్తున్నా'' అన్నాడు. ఇక స్వామిరారా ఫేం సుధీర్ వర్మ అయితే ఒక సిన్సియర్ కన్ఫెషన్ ఇచ్చేశాడు. ''దోచెయ్ తో నేను డిజప్పాయింట్ చేసినా.. నా ఫ్రెండ్ చందూ కాంపెన్సేట్ చేస్తాడు'' అంటూ తన కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశాడు.


నాదా , నా కొడుకుదా ఎవరిది బాగుంది

నాదా , నా కొడుకుదా ఎవరిది బాగుంది

''చైతన్య గెడ్డం చూసినప్పుడు నాకు చైతన్య గెడ్డం బాగుంది అనిపించి.. నేను ఓం నమో వెంకటేశాయ సినిమా కోసం గెడ్డం పెంచాను. అప్పటి నుండి చైతూ ఏమంటున్నాడంటే.. నాకంటే నీ గెడ్డమే బాగుంది అని కామెంట్ చేస్తున్నాడు. మీరే చెప్పండి.. ఎవరి గెడ్డం బాగుంది?'' అంటూ కామెంట్ నాగార్జున ఆడియన్స్ ను ఉర్రూతలూగించారు నాగార్జున.


అఖిల్ మారిపోయాడు

అఖిల్ మారిపోయాడు

'ప్రేమమ్' ఆడియో ఫంక్షన్లో అన్నయ్య చైతూకు విషెస్ చెప్పడానికి విచ్చేసిన అఖిల్.. కాస్త బలంగా బొద్దుగా బరువుగా.. ఒక కండలవీరుడు తరహాలో కనిపించటం అందరినీ ఆస్చర్యపరిచింది. ఖచ్చితంగా ఈ కొత్త కండలవీరుడి కొత్త కండలు మరి తన రెండో సినిమా కోసమే అని వేరే చెప్పక్కర్లేదుగా. 'మనం' మూవీ ఫేం విక్రమ్.కె.కుమార్ డైరక్షన్లో అఖిల్ తన రెండో సినిమా చేయబోతున్నాడని ఆ మధ్యన స్వయంగా కింగ్ నాగార్జున ప్రకటించారు.


ప్రేమమ్ ఆడియోకు వీరంతా..

ప్రేమమ్ ఆడియోకు వీరంతా..

ఈ కార్యక్రమంలో... చిత్ర నిర్మాతలు నాగవంశీ, ఎస్.రాధాకృష్ణ, దర్శకుడు చందు మొండేటి, సంగీత దర్శకులు రాజేశ్ మురు గేశన్, గోపీసుందర్, హీరోయిన్లు శ్రుతీ హాసన్, మడోన్నా, నిర్మాతలు దామోదర ప్రసాద్, ప్రసాద్ వి.పొట్లూరి, దర్శకులు మారుతి, కల్యాణ్‌కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎమ్‌.ఎల్‌ కుమారస్వామి, గీత రచయితలు వనమాలి, రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి, శ్రీనివాసరెడ్డి, నందినిరెడ్డి, బ్రహ్మాజీ, దామోదర ప్రసాద్‌, నిఖిల్‌ తదితరులు పాల్గొన్నారు.


English summary
The much-awaited audio launch event of 'Premam' happened. The event take place at HICC in Hyderabad. 'Premam', remake of Malayalam blockbuster by the same name, has music by Gopi Sunder and Rajesh Murugan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu