twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మా ‘ప్రేమమ్‌’ ని ఇష్టమొచ్చినట్లు ట్రోల్ చేసారు, వీళ్లు అర్టిస్టులా, డైరక్టరా అంటూ... : నాగ్

    By Srikanya
    |

    హైదరాబాద్ : నాకు తెలుసు. ఈ సినిమా వస్తోందగానే ఈ సినిమాను విపరీతంగా ట్రోల్ చేసారు. ఇష్టమొచ్చినట్లు ..ముఖ్యంగా ఫస్ట్ లుక్ ,టీజర్ రాగానే..ఇదొక సినిమానా, వీళ్లొక ఆర్టిస్టులా, ఇది ఒక డైరక్టరా,ఇది ఒక మ్యూజిక్కా, ఇది ఒక టేకింగా అని కంప్లీట్ తమిళనాడు, కేరళ నుంచి వాళ్ల ఫ్యాన్స్ ట్రోల్ చేసారు. ఐకెన్ అండరస్టాండ్. మనం మన కల్ట్ సినిమాని వాళ్లు తీసినా మనమూ అలాగే అనుకుంటాం అన్నారు నాగార్జున.

    అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్య హీరోగా నటించిన చిత్రం 'ప్రేమమ్‌'. శ్రుతిహాసన్‌, అనుపమ పరమేశ్వరన్‌, మడోన్నా సెబాస్టియన్‌ కథానాయికలు. చందు మొండేటి దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. పి.డి.వి.ప్రసాద్‌ సమర్పకుడు.

    ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో విజయోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా నాగార్జున ముఖ్య అతిధిగా హాజరయ్యి సినిమా మంచి రన్ లో ఉందని, పెద్ద హిట్ అని, ఎందరు ట్రోల్ చేసినా సినిమా ఘన విజయం సాధించిందని చెప్పారు.

    ''మలయాళం 'ప్రేమమ్‌'లోని సోల్‌ తీసుకుని చందు మన నేటివిటీకి తగ్గట్టు అద్భుతంగా సినిమా చేశాడు. ఒక భాషలో అంత పెద్ద హిట్‌ అయిన చిత్రాన్ని మరలా తీయడానికి గట్స్‌ ఉండాలి. 'ప్రేమమ్‌' చిత్రాన్ని చూసి తప్పకుండా హిట్‌ అవుతుందని ట్వీట్‌ చేశాను. అదే నిజమైంది. '' అని అక్కినేని నాగార్జున అన్నారు.

     ఆ డైలాగునే..

    ఆ డైలాగునే..

    ‘‘ప్రేమమ్‌' సినిమా చివర్లో ‘కొడుకు గెలుపే తండ్రి సంతోషం' అనే ఓ సంభాషణ ఉంది. ఇప్పుడు అదే ఆనందంలో నేనున్నా అంటూ చాలా ఆనందంగా చెప్పుకొచ్చారు నాగార్జున.

     నేను పొగడుతాను..

    నేను పొగడుతాను..

    నేను బాగా నటిస్తే నాన్నగారు ‘కొడుకు కదా, ఎక్కువగా పొగడకూడదు' అనేవారు. కానీ నేను మాత్రం ఇప్పుడు నా కొడుకుని పొగుడుతాను. చైతన్య మూడు పాత్రల్లో చాలా బాగా నటించాడు'' అన్నారు నాగార్జున.

     హ్యాపీగా ఇంటికి వెళ్తున్నా నని

    హ్యాపీగా ఇంటికి వెళ్తున్నా నని

    '' 'ప్రేమమ్' విడుదలకు వారం ముందే చందూ నాకు సినిమా చూపించాడు. ఇప్పుడే 'ప్రేమమ్' చూశా బాగుంది, హ్యాపీగా ఇంటికెళుతున్నానని అదే రోజు ట్వీట్ చేశా.కొందరు క్రింద కామెంట్లలో ప్రేమమ్ చూసినందుకు ఆనందంగా ఇంటికి వెళ్తున్నారా..అన్నారు. అవును ప్రేమమ్ చూసి ఆనందంగా ఇంటికివెల్తున్నా'' అని హీరో నాగార్జున అన్నారు.

    తుడుచుకుంటాను కానీ..

    తుడుచుకుంటాను కానీ..

    క్లయిమాక్స్‌లో శ్రుతీహాసన్ సన్నివేశానికి కంట్లో నీళ్లొచ్చాయి. సినిమాలో రెండు మూడు చోట్ల అదే ఫీల్ కలిగింది అంటూ ఎమోషనల్ గా నాగార్జున చెప్పుకొచ్చారు. నాగార్జున తను కన్నిరు వస్తే అందరిలాగే తుడుచుకుంటాను కానీ దాచుకోను అన్నారు.

     గట్స్ ఉన్న డైరక్టర్

    గట్స్ ఉన్న డైరక్టర్

    మంచి ఫీల్‌ ఉన్న చిత్రమిది. మలయాళంలో విజయవంతమైంది. అటువంటి సినిమాని రీమేక్‌ చేయాలంటే చాలా ధైర్యం కావాలి. కానీ చందు మొండేటి చాలా బాగా తీశాడు. మలయాళంలో ఉన్నట్టు తీస్తే మన దగ్గర ఆడదు. మన శైలి వేరు. ఆ విషయాన్ని చక్కగా అర్థం చేసుకొని తెరకెక్కించారు అని నాగార్జున డైరక్టర్ ని అబినందించారు.

     శివ రీమేక్ చెయ్యమంటున్నారు

    శివ రీమేక్ చెయ్యమంటున్నారు

    ‘శివ' సినిమాని చైతన్యతోకానీ, అఖిల్‌తో కానీ తీయొచ్చు కదా అంటుంటారు. అది జరగని పని. ‘ప్రేమమ్‌' కూడా ‘శివ'లాంటి సినిమానే.. నాతోనూ ఓ సినిమా చేయమని అడుగుతున్నా అతణ్ని అని అన్నారు నాగార్జున.

     నాకు ఆ ఏజ్ లోనే

    నాకు ఆ ఏజ్ లోనే


    మూడు కోణాల్లో సాగే పాత్రల్లో చాలా బాగా నటించాడు చైతూ. పదహారేళ్ల కుర్రాడిగా నటించడం చాలా కష్టం. కానీ ఆ పాత్రలోనూ ఒదిగిపోయాడు. సరిగ్గా ఇప్పుడు చైతూ అంత వయసులో ఉన్నప్పుడే నాకు ‘గీతాంజలి' వచ్చింది. నా బలాలేమిటి? నేనేం చేయగలుగుతాను? అని ఆలోచించి నాకు నచ్చినట్టుగా ఆ సినిమా చేశా. చైతూ కూడా ఈ సినిమాని అలాగే చేసినట్టనిపించింది. ‘ప్రేమమ్‌' ఒక మంచి సినిమాగా నిలబడిపోతుంది. టీవీల్లో ఎన్నిసార్లు వేసినా ప్రేక్షకులు చూస్తూనే ఉంటారు''అన్నారు నాగార్జున.

    ఆ సమస్యలు వెంకటేష్ తో ..

    ఆ సమస్యలు వెంకటేష్ తో ..

    'ప్రేమమ్'లో చూపించినట్టు మీతో చెప్పుకోలేని సమస్యలేవైనా చైతూకి ఉంటే మేనమామ(వెంకటేష్) పరిష్కరిస్తారా? అని విలేకరులు అడగ్గా, ''అది సినిమా మాత్రమే. మా ఇంట్లో అందరం ఫ్రెండ్లీగా ఉంటాం, అన్ని విషయాలు షేర్ చేసుకుంటాం'' అని నాగార్జున నవ్వుతూ సమాధానం ఇచ్చారు.

     మంచి గిప్ట్ ఇచ్చాడు చందు

    మంచి గిప్ట్ ఇచ్చాడు చందు

    ‘‘ప్రేక్షకులు మలయాళం ‘ప్రేమమ్‌'ని మరిచిపోయి పోలికలు వెతక్కుండా ఓ కొత్త సినిమాలా చూస్తూ ఆస్వాదిస్తున్నారు. ‘ప్రేమమ్‌' రూపంలో నాకు ఓ మంచి బహుమానాన్ని ఇచ్చారు దర్శకుడు చందు అన్నారు నాగచైతన్య మాట్లాడుతూ..

     అందరికి సంతృప్తిగా అనిపించాకే

    అందరికి సంతృప్తిగా అనిపించాకే

    ‘ప్రేమమ్‌' సినిమాని రీమేక్‌ చేద్దామని నాకు మొదట చెప్పింది నిర్మాత వంశీనే. సినిమా షూటింగ్ పూర్తయ్యాక ఎప్పుడు విడుదల చేద్దామని మరో నిర్మాత చినబాబుగారిని అడిగా. ‘ఫస్ట్‌ కాపీ చూశాక, మనందరికీ సంతృప్తిగా అనిపించాకే సినిమాని విడుదల చేద్దామ'న్నారు. అలాంటి ఆలోచనలవల్లే సినిమా ఇంత బాగా వచ్చింది. హీరోయిన్స్ , సహ నటులు చక్కటి సహకారాన్ని అందించారు'' అన్నారు.

     అలాంటి మాటలేమి చెప్పలేదు

    అలాంటి మాటలేమి చెప్పలేదు

    ''ఓ క్లాసిక్ మూవీని రీమేక్ చేయాలంటే ధైర్యం కావాలి. మేం చేసి సక్సెస్ అయ్యాం. జనరల్‌గా దర్శకులు ఈ చిత్రం మీ కెరీర్‌లో బిగ్ హిట్ అవుతుందని చెబుతారు. చందూ మాత్రం చెప్పకుండా హిట్ ఇచ్చారు'' అని నాగచైతన్య అన్నారు.

     ఆరేళ్ల క్రితం తీసిందా అని అడుగుతున్నారు

    ఆరేళ్ల క్రితం తీసిందా అని అడుగుతున్నారు

    ‘‘నాగార్జునగారు, వెంకటేష్‌గారు నటిస్తేనే నేనీ సినిమా చేస్తానని చెప్పేవాణ్ని. వారిద్దరూ నటించినందుకు చాలా కృతజ్ఞతలు. చైతూ ఈ సినిమాలో చాలా బాగా నటించాడు. ఫస్ట్‌ ఎపిసోడ్‌ని చూసి ఆరేడేళ్ల కిందట తీసిందా? అని అడుగుతున్నారు''అన్నారు దర్శకుడు చందు.

     అమలాపురం దాకా...

    అమలాపురం దాకా...

    ‘‘అమెరికా నుంచి అమలాపురం వరకు సినిమా చాలా బాగా ఆడుతోంది''అన్నారు చిత్ర సమర్పకుడు పి.డి.వి.ప్రసాద్‌. ఈ కార్యక్రమంలో ప్రవీణ్‌, నోయల్‌ తదితరులు పాల్గొన్నారు.

     పదిరోజుల్లోనే ...

    పదిరోజుల్లోనే ...

    నిర్మాత మాట్లాడుతూ.. ‘‘పది రోజుల్లో ‘ప్రేమమ్‌'కు రూ.21కోట్ల షేర్‌ వచ్చింది. అన్ని చోట్ల నుంచీ మంచి రెస్పాన్స వస్తోంది. ఈ వారంలో చెన్నైలో మరో ఆరు స్క్రీన్స్ ను పెంచుతాం'' అని తెలిపారు.

     నాగ్, వెంకటేష్ లకు ధాంక్స్

    నాగ్, వెంకటేష్ లకు ధాంక్స్

    దర్శకుడు చందు మాట్లాడుతూ ‘‘ఈ చిత్రంలో చైతన్య టీనేజ్‌ లుక్‌ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అదే చైతూకి బెస్ట్‌ కాంప్లిమెంట్‌. ఈ చిత్రంలో నటించిన నాగార్జునగారికి, వెంకటేశ్ గారికి ధన్యవాదాలు చెబుతున్నాను'' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్‌తో పాటు పలువురు యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.

    ప్రేమకథలకి ముగింపు ఉండొచ్చు కానీ.. ప్రేమ తాలూకు జ్ఞాపకాలకి మాత్రం కాదని చెప్పే ఈ కథ కేవలం తెరపై విక్కీ ప్రేమకథే కాదు.. ప్రతి ఒక్కరి ,మనందరి ప్రేమకథ కనిపిస్తుంది. ప్రేమలో గెలవడం.. ఓడిపోవడం కంటే అందులో పడడమే కీలకమైన విషయం అని.. ప్రేమలో గెలిస్తే అమ్మాయి మన పక్కన ఉంటుంది.. ఓడితే ఆ జ్ఞాపకాలు మనతో ఉంటాయని చెప్పే ఓ అందమైన పాయింటే ఈ సినిమాకు హైలెట్, అదే ఈ సినిమాకు ప్రాణం పోసింది. ఈ చిత్రం ఏపి, నైజాం ఏరియాల కలెక్షన్స్ కలిపి మొదటి వారం 12.44 కోట్లు వసూలు చేసింది.

     ఈ టీమేతో ఇంత పెద్ద హిట్

    ఈ టీమేతో ఇంత పెద్ద హిట్


    బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌
    నటీనటులు: నాగచైతన్య, శృతిహాసన్, అనుపమా పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్, చైతన్యకృష్ణ, జోష్ రవి, ప్రవీణ్‌, శ్రీనివాస్‌రెడ్డి, బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్, జీవా.నాగార్జున - వెంకటేష్‌ (అతిథి పాత్రల్లో), వైవాహర్ష తదితరులు
    కథ: ఆల్ఫోన్స్‌ పుథరెన్‌
    సంగీతం: గోపీసుందర్‌, రాజేశ్‌ మురుగేశన్‌
    ఛాయాగ్రహణం: కార్తీక్‌ ఘట్టమనేని
    కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
    నిర్మాణం: ఎస్‌.రాధాకృష్ణ, పి.డి.వి.ప్రసాద్‌, ఎస్‌, నాగవంశీ
    స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చందు మొండేటి.
    విడుదల తేదీ: 7-10-2016

    English summary
    Naga Chaitanya starrer Premam has been declared a super hit and is still running successfully with steady collections. Makers have finally held the success meet after 12 days of its release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X