»   » చైతు-గౌతమ్ మీనన్ ‘సాహసం శ్వాసగా సాగిపో’...షోకిల్లా ( సాంగ్ టీజర్)

చైతు-గౌతమ్ మీనన్ ‘సాహసం శ్వాసగా సాగిపో’...షోకిల్లా ( సాంగ్ టీజర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గౌతమ్ మేనన్ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపో'. ఈ చిత్రం ప్రత్యేక టీజర్‌ను నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కూడా 'ఏ మాయ చేసావే' రేంజిలో ఉంటుందనే అంచనాలు ఏర్పడ్డాయి.

తాజాగా ఈ చిత్రంలోని షోకిల్లా సాంగుకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేసారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ఫాస్ట్ బీట్ తో ఆకట్టుకుంటోంది. స్లైడ్ షోలో సాంగు జీర్ ఉంది...మీరూ వినండి సూపర్ గా ఉంది.

ఆల్రెడీ చిత్రానికి సంబంధించిన 'వెల్లిపోమాకే' సాంగ్ ఈ ఏడాది జనవరిలో విడుదల చేయగా...కుర్రకారు ఫిదా అయిపోయారు. యూట్యూబులో ఆ సాంగు తెలుగు, తమిళంలో కలిపి కోటికిపైగా హిట్స్ వచ్చాయి.

సాధారణంగా గౌతం మీనన్ సినిమాలంటేనే ఒక స్పెషల్ ఫీల్ తో సాగుతాయి. ఇపుడు దానికి ఏఆర్ రెహమాన్ సంగీతం కూడా తోడవటంతో 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నాగ చైతన్య, గౌతం మీనన్, ఏఆర్ రెహమాన్ కాంబినేసన్లో అప్పట్లో వచ్చిన 'ఏ మాయ చేసావే' చిత్రం అప్పట్లో క్లాసికల్ హిట్ గా నిలిచి పోయింది. ఇపుడు ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని అంటున్నారు.

'ఏ మాయ చేసావె' చిత్రం తెలుగులో నాగ చైతన్య, తమిళంలో శింబు చేసినట్లే.... 'సాహసం శ్వాసగా సాగిపో' కూడా తెలుగులో చైతన్య, తమిళంలో శింబు చేస్తున్నారు. ఈ సినిమాకు ఎం రవీందర్ రెడ్డి నిర్మాత. సునితా తాటికి చెందిన గురు పిల్మ్స్ బేనర్లో కోన వెంకట్ సమర్పకుడిగా ఈ సినిమా తెరకెక్కబోతోంది.

స్లైడ్ షోలో షోకిల్లా సాంగ్ టీజర్ తో పాటు ఇప్పటి వరకు విడుదలైన ఇతర సాంగ్స్, టీజర్...

షోకిల్లా

సాహసం శ్వాసగా సాగిపో చిత్రంలోని షోకిల్లా సాంగ్ టీజర్ నిన్న రిలీజ్ చేసారు.

డైలాగ్ టీజర్

సాహసం శ్వాసగా సాగిపో చిత్రం డైలాగ్ టీజర్ ఇదే.

వెల్లిపోమాకే సాంగ్

వెల్లిపోమాకే సాంగ్ ఇప్పటికే విడుదలై సూపర్ హిట్టయింది. మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి.

టీజర్

సాహసం శ్వాసగా సాగిపో చిత్రానికి సంబంధించిన మరో టీజర్

తమిళంలో...

వెళ్లిపోమాకే అంటూ సాగిన తెలుగు సాంగ్ కంటే... తమిళంలో తల్లి పొగతే సాంగ్ యూట్యూడులో పెద్ద హిట్టయింది.

English summary
The Official Teaser of "Shokilla.." from 'Saahasam Swaasaga Saagipo' composed by A.R. Rahman.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu