»   »  అభిమానంతో రెచ్చిపోయారు: ‘ప్రేమమ్’ థియేటర్ల వద్ద..... చైతూ-సమంత బేనర్లు

అభిమానంతో రెచ్చిపోయారు: ‘ప్రేమమ్’ థియేటర్ల వద్ద..... చైతూ-సమంత బేనర్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగ చైతన్య, సమంత ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. వీరి లవ్ మ్యాటర్, పెళ్లి మ్యాటర్ పబ్లిక్ అయిన తర్వాత వస్తున్న తొలి చిత్రం 'ప్రేమమ్'.

ఇంకేం... అక్కినేని అభిమానులు అభిమానంతో రెచ్చిపోయారు. ప్రేమమ్ థియేటర్ల వద్ద నాగ చైతన్-సమంత ఫోటోలతో భారీ బేనర్లు ఏర్పాటు చేసారు. ప్రేమకి అసలైన నిర్వచనం మా అన్నా-వదినమ్మలు అంటూ కొన్ని థియేటర్ల వద్ద బేనర్లు దర్శనమిస్తున్నాయి.


 అన్న-వదినమ్మలపై అభిమానంతో

అన్న-వదినమ్మలపై అభిమానంతో

అన్న వదినమ్మలపై అభిమానంతో ‘ప్రేమమ్' రిలీజ్ సందర్భంగా కొందరు చైతు అభిమానులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బేనర్లు. సోషల్ మీడియాలో కూడా వీటిని పోస్టు చేయడం గమనార్హం. పెళ్లికి ముందే..

పెళ్లికి ముందే..


అభిమానంతో రెచ్చిపోవడం అంటే ఇదేనేమో... చైతు-సమంతకి ఇంకా పెళ్లి కాలేదు, నిశ్చితార్థం కూడా జరుగలేదు. అప్పుడే అన్నా-వదిమ్మ అంటూ అభిమానులు పిలుచుకుంటున్నారు. పాజిటివ్ టాక్

పాజిటివ్ టాక్


కాగా... ప్రేమమ్ సినిమా విడుదలైన మార్నింగ్ షో నుండే పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మలయాళం ప్రేమమ్ కంటే కూడా తెలుగు ప్రేమమ్ చాలా బావుందని అంటున్నారు. అయితే సినిమా యావరేజ్ గా ఉందనే వాళ్లు సైతం ఉన్నారు. సినిమాకు సంబంధించిన పూర్తి రివ్యూ... మా ఫిల్మీబీట్ క్రిటిక్స్ మరికొద్ది సేపట్లో మీకు అందించబోతున్నారు.నాగ చైతన్య-సమంత

నాగ చైతన్య-సమంత


ఇంట్రెస్టింగ్: నాగ చైతన్య, సమంత చెప్పిన ప్రేమ విషయాలు!... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిEnglish summary
Naga Chaitanya, Samantha banners at Premam theaters. Premam is an 2016 Telugu language coming-of-age musical-romantic comedy film co written and directed by Chandoo Mondeti Karthikeya fame.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu