»   » సమంత నాకు ముద్దు ఇవ్వనంది, పబ్లిగ్గా చెప్పేసాడు!

సమంత నాకు ముద్దు ఇవ్వనంది, పబ్లిగ్గా చెప్పేసాడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అప్పట్లో గౌతం మీనన్ దర్శకత్వంలో వచ్చిన 'ఏమాయ చేసావె' చిత్రంలో సమంత, నాగ చైతన్య మద్య ఉన్న ఘాటైన ముద్దు సన్నివేశం ఎంత పాపులర్ అయిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఒక రకంగా ఆ సినిమాకు ఆ ముద్దు సీన్ హైలెట్ అయింది. తాజాగా ఈ ఇద్దరు నటిస్తున్న చిత్రం 'ఆటో నగర్ సూర్య'.

గతంలో ఓ సారి ముద్దు సీన్‌ చేసారుగా...ఈ సినిమాలోనూ ముద్దు సీన్ ఉంటుందా? అనే ప్రశ్నకు 'ఆటో నగర్ సూర్య' ఆడియో ఫంక్షన్లో నాగ చైతన్య స్పందిస్తూ.....ఇందులో ముద్దు సీన్లు లేవు, సమంత మళ్లీ ముద్దు ఇవ్వనని చెప్పింది అందుకే ఈ సినిమాలో అలాంటి సీన్లు వీలు కాలేదు అని చెప్పుకొచ్చారు.

నాగచైతన్య హీరోగా ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సమర్పణలో మాక్స్ ఇండియాప్రొడక్షన్స్ పతాకంపై కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'ఆటోనగర్‌ సూర్య'. సమంత హీరోయిన్. దేవాకట్టా దర్శకత్వం వహించారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూర్చారు. పాటల విడుదల కార్యక్రమం ఆదివారం రాత్రి హైదరాబాద్‌ శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది.

నాగచైతన్య మాట్లాడుతూ...ఈ సినిమాను ఏ సినిమాతో కంపార్ చేయలేము. ఇది ఆటో నగర్ సూర్య మాత్రమే. దేవ నాలో వేరియేషన్ చూపించాడు. నేను ఎంజాయ్ చేశాను. సమంత లిప్ లాక్ కు ఒప్పుకోలేదు. దేవా రోజు గ్రీసు, మట్టి పట్టించేవారు. చాలా బాగుంది. మంచి అనుభవం. నిజంగా నేను నమ్మలేక పోతున్నాను.సినిమా త్వరలో విడుదల అవుతుందంటే నా కల నెరవేరనుంది త్వరలో చాలా మంది టెక్నిషియన్స్ త్యాగాలు చేసి ఈ దశకు తీసుకుని వచ్చారు.

అభిమానులు చూపుతున్న అభిమానానికి నా ధన్యవాదాలు. వెంటనే దేవతో సినిమా చేయమంటే చేస్తాను ఈ సినిమా అతని కృషి ఉంది అనూప్ తో వరసగా మూడు సినిమాలు చేస్తున్నాను. ఇది మేము చేరుకునే మరో మెట్టు అన్నారు. 'వరుసగా పది సినిమాలు దేవాకట్టాతో చేయమంటే కళ్లు మూసుకొని పనిచేస్తాను. అంత నమ్మకాన్నిచ్చారు''అన్నారు నాగచైతన్య.

English summary

 During the audio launch of 'Autonagar Surya', Anchor Jhansi asked Naga Chaitanya if there are any love making scenes in the action flick. The young hero replied, "Samantha refused to Kiss".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu