»   » ఏం జరుగుతోంది?: నాగచైతన్య, శృతి హాసన్ కలిసి ఇలా(ఫొటో)

ఏం జరుగుతోంది?: నాగచైతన్య, శృతి హాసన్ కలిసి ఇలా(ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నాగచైతన్య, శృతి హాసన్... వీళ్లిద్దరూ ఏంటి ఇలా ఫోజిచ్చారు. ఏదన్నా సినిమాకు కలిసిపనిచేస్తున్నారా అంటే అదేమీ లేదు. వీళ్లిద్దరూ ఈ రోజు చెన్నై ఎయిర్ పోర్ట్ లో కలిసారు. గౌతమ్ మీనన్ చిత్రం కోసం నాగ చైనత్య చెన్నై వెళితే అక్కడ... శృతిహాసన్ తన సొంత ఊరైన చెన్నైలో లాండ్ అవుతూ కనిపించింది. అనుకోకుండా కలిసిన వీళ్లిద్దరూ ఇదిగో ఇలా ఫోజిచ్చారు. ఈ విషయమై శృతి హాసన్ ట్వీట్ కూడా చేసింది...హలో లవ్ లీ చెన్నై... తిరిగి ఇంటికి రావటం ఆనందంగా ఉంది అంటూ రాసుకొచ్చింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

నాగచైతన్య తాజా చిత్రాలు విషయానికి వస్తే...

నాగ చైతన్య, సమంత.... కలిసి నటించిన తొలి సినిమా ‘ఏమాయ చేసేవె'తోనే జెడీ అదిరింది అనిపించారు. ఇద్దరి మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ సూపర్బ్. ఆ తర్వాత వీరిద్దరూ నటించిన ‘ఆటో నగర్ సూర్య', ‘మనం' చిత్రాల్లోనే చూడముచ్చటైన జంటగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఈ ఇద్దరూ నాలుగోసారి జతకట్టిబోతున్నాట్లు టాక్.

Naga Chaitanya & Shruti Haasan at Chennai airport

దోచెయ్ సినిమా తరువాత నాగచైతన్య నటించబోయే కొత్త సినిమాలో సమంత హీరోయిన్ గా ఖరారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించే అవకాశం ఉంది. ఈ సినిమాలో చైతూ సరసన సమంత అయితేనే బావుంటుందని భావిస్తున్నాడట చందూ మొండేటి.

నాగచైతన్య మాట్లాడుతూ... ''క్లాస్‌ మాస్‌ తేడా నాకు తెలీదు. ఎక్కువమంది చూస్తే అది మాస్‌ సినిమా. ఏ కొందరికో చేరువైతే అది క్లాస్‌. కానీ అందరికీ నచ్చే కథలు ఎంచుకోవాలన్నదే నా అభిమతం. అలాగని ప్రయోగాలు మానేయకూడదు. ఏడాదికి ఒక్కసారైనా కొత్తగా ప్రయత్నించాలి. రిస్క్‌ తీసుకోవడంలో తప్పు లేదు. అప్పుడే మన ప్రతిభ బయటపడుతుంది. 'గీతాంజలి', 'శివ' తీసేటప్పుడు నాన్నగారు రిస్క్‌ అనుకోలేదు. అవే ఆయన కెరీర్‌ని మలుపుతిప్పాయి'' అని చెప్పారు.

ఫైనల్ గా... ''ప్రతిభావంతులైన కొత్త హీరోలు వస్తున్నారు. వాళ్ల మధ్య మనదైన మార్క్‌ చూపించాలంటే కష్టపడాల్సిందే. నాన్నగారు, తాతగారూ ఓ మార్క్‌ సృష్టించారు. ఓ మంచి కుటుంబం నుంచి వచ్చానన్న సంగతి ఎప్పుడూ గుర్తుంటుంది. దాంతో పాటు ఒత్తిడీ ఉంటుంది. మంచి కథల్ని, ఈ తరం అభిరుచుల్ని అందుకొనే సినిమాల్ని ఎంచుకోవడమే నేను చేయగలిగింది. సినిమా సినిమాకీ నేర్చుకొంటూనే ఉండాలి. అది ఎప్పుడు ఆపేస్తామో మన ఎదుగుదల అప్పుడు ఆగిపోయినట్టు లెక్క'' అంటున్నాడు నాగచైతన్య.

English summary
While Naga Chaitanya reached Chennai Today for the shoot of his film with Gautham Menon, Shruti Haasan too landed in her home town and she even wrote 'Hello my lovely chennai !!! So good to be back home'.
Please Wait while comments are loading...