»   » 'జోష్' లో జరిగిన పొరపాట్లు నుంచి...

'జోష్' లో జరిగిన పొరపాట్లు నుంచి...

Posted By:
Subscribe to Filmibeat Telugu

'జోష్' విషయంలో నేననుకున్న ఫలితం రాలేదు. నా తొలి సినిమా కావడంతో దానిపై అంచనాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. దాంతో అనుకున్నంతగా అది ప్రేక్షకులకి రీచ్ కాలేదు అంటున్నారు నాగచైతన్య. అయితే తొలి చిత్రం..దిల్ రాజు బ్యానర్ లో చేయటంతో ఆనందంగా ఉన్నారు. సినిమా ఫ్లాప్ అయినా అందులో నా అభినయం బాగుందని అందరూ చెప్పారు. అయితే ఇవాళ ప్రేక్షకులు మంచి డిమాండింగ్. అన్నీ బాగుంటేనే వారు చూస్తున్నారు. అందుకే అన్ని రకాలుగా ఆల్‌రౌండర్ అనిపించుకోడానికి కృషిచేస్తా. అందులో చేసిన పొరబాట్ల నుంచి నేర్చుకున్నాను అని తేల్చారు. నాగచైతన్య హీరోగా చేసిన ఏ మాయ చేసావే ఈ శుక్రవారం రిలీజవుతోంది. గౌతం మీనన్ దర్శకత్వంలో రెడీ అయిన ఈ చిత్రం మంచి ఓపినింగ్స్ వస్తాయని అంతా భావిస్తున్నారు. నాగార్జున అయితే ఈ చిత్రాన్ని తన గీతాంజలితో పోలుస్తున్నారు. తమిళంలో ఇదే చిత్రాన్ని శింబు, త్రిషల కాంబినేషన్ లో రూపొందించి అదే రోజున రిలీజ్ చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu