»   »  పంజాబీ రీమేక్‌లో నాగచైతన్య ఖరారు..డిటేల్స్

పంజాబీ రీమేక్‌లో నాగచైతన్య ఖరారు..డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : రీసెంట్ గా రీమేక్‌ చిత్రం 'తడాఖా'తో విజయం సాధించిన నాగచైతన్య మరో రీమేక్‌కి సిద్ధమవుతున్నారు. వినూత్న ప్రేమ కథగా పంజాబీలో తెరకెక్కిన చిత్రం 'సింగ్‌ వర్సెస్‌ కౌర్‌'. ప్రముఖ నిర్మాత డా||డి.రామానాయుడు దీని నిర్మాత. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో రీమేక్‌ చేసేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఇప్పటికే సత్యానంద్ ఈ చిత్రం స్క్రిప్టుపై వర్క్ చేస్తున్నట్లు సమాచారం.


ఈ రీమేక్ లో మొదట దగ్గుపాటి రానాతో చేద్దామనకున్నా... నాగచైతన్య ని హీరోగా ఫైనలైజ్ చేసారు. ఈ విషయమై డా||డి.రామానాయుడు మాట్లాడుతూ ''పంజాబీలో విజయం సాధించిన ఈ సినిమాని తెలుగులోకి రీమేక్‌ చేస్తున్నాం. ఇక్కడి పరిస్థితులకు తగ్గట్గుగా మార్పులు, చేర్పులు చేస్తాం. దర్శకుడు, తారాగణం తదితర విషయాలు త్వరలో వెల్లడిస్తాము''అన్నారు.

నాగ చైతన్య సంవత్సరం తన ఇద్దరు తాతయ్యలతో కలిపే పని చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీ మల్టీస్టారర్ 'మనం' మొదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఏఎన్ఆర్, నాగార్జున, నాగ చైతన్యలు నిజ జీవిత పాత్రల్లో తాత, తండ్రి, మనవడుగా నటిస్తున్నారు. ఇదే సంవత్సరం మరో తాతయ్య రామానాయుడుతో కలిసి సినిమా చేసే అవకాశం దక్కడం విశేషం.

మరో ప్రక్క ఇటీవల నితిన్‌తో 'గుండె జారి గల్లంతయ్యిందే' లాంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన విజయ్ కుమార్ కొండ త్వరలో నాగ చైతన్యతో సినిమా చేయబోతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి పతాకంపై నాగార్జున అక్కినేని ఈచిత్రాన్ని నిర్మించబోతున్నారు. అక్బోబర్ నెలలో ఈచిత్రం ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. హీరోయిన్, ఇతర సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగాల్సి ఉంది. ప్రస్తుతం దర్శకుడు స్క్రిప్టు వర్కుపై దృష్టి పెట్టాడు. ఇది పూర్తయిన వెంటనే షూటింగ్ ప్రారంభం కానుంది.

ఇవి కాకుండా నాగ చైతన్య, హన్సిక జంటగా సినిమా తెరకెక్కబోతోంది. ఇంతకు ముందు నాగార్జునతో 'డమరుకం' చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీనివాసరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. నిర్మాత సి. కళ్యాణ్ శ్రీశుభశ్వేత ఫిలింస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

English summary

 Movie mogul Dr D Ramanaidu might produce a film with Naga Chaitanya.The movie is a remake of punjabi film "Singh vs Kaur" which is produced by ramanaidu earlier.Currently, Naga Chaitanya is acting in Vikram Kumar’s Manam and after that he will join the sets of Hello Brother’s remake under Srinivas Reddy direction.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu