»   » హిందీలో 'ఏ మాయ చేసావె' రీమేక్

హిందీలో 'ఏ మాయ చేసావె' రీమేక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగచైతన్య, సమంతా కాంబినేషన్ లో దర్శకుడు గౌతం మీనన్ రూపొందించిన ఏ మాయ చేసావె చిత్రం హిందీలోకి రీమేక్ చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే గౌతం మీనన్ ఈ చిత్రాన్ని తన హోమ్ ప్రొడక్షన్ లో రీమేక్ చేయనున్నట్లు చెప్తున్నారు. ఈ మేరకు ఆయన హిందీ వెర్షన్ రాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు ఆయన చెలి చిత్రాన్ని రెహనా హై తేరా దిల్ మే చిత్రంగా హిందీలో అందించారు. అయితే అది బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ విషయాలను ఆయన నేషనల్ డైలీ తో మాట్లాడుతూ చెప్పుకుచ్చారు. అలాగే ఇటువంటి రొమాంటిక్ చిత్రం చేయటానికి కారణం చెపుతూ...నేను స్వతహాగానే రొమాంటిక్ పర్శన్ ని. దాన్నే నేను తెరపై చూపెడుతున్నాను. అవి ఒక్కోసారి నవ్విస్తే...మరో సారి ఏడిపిస్తాయి. ఎమోషనల్ గా కట్టిపడేస్తాయి అని చెప్తున్నారు. ఇక ఆయన చిత్రాన్ని తెలుగు రిలీజు నాడే తమిళ వెర్షన్ కూడా రిలీజ్ చేసారు. తమిళంలో శింబు, త్రిష నటించారు. ఈ చిత్రంలోని జెస్సీ పాత్ర రెండు భాషల్లో నూ యువతను కట్టిపాడేస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu