»   » షూటింగ్ స్పాట్లో... నాగ శౌర్య-నిహారిక కొణిదెల (ఫోటో)

షూటింగ్ స్పాట్లో... నాగ శౌర్య-నిహారిక కొణిదెల (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్ గా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు' వంటి ప్రేమకథా చిత్రాన్ని అందించిన రామరాజు ఈ చిత్రానికి దర్శకుడు. ‘ఒక మనసు' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ శౌర్య హీరో. మధుర శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ వైజాగ్ బీచ్ ప్రాంతంలో జరుగుతోంది. సినిమా సెట్స్ లో నిహారిక, నాగ శౌర్య ఫోటోలకు ఇలా ఫోజు ఇచ్చారు. నిహారిక ఈ ఫోటోల చీకట్టులో కనిపించడాన్ని బట్టి చూస్తే సినిమాలో ఆమె పాత్ర చాలా డీసెంటుగా, సాంప్రదాయాలకు విలువ ఇచ్చే విధంగా ఉంటుందని స్పష్టమవుతోంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం ప్రకాశ్ రాజ్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో నాగశౌర్య తండ్రి పాత్రకి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందట. అందువలన ఆ పాత్రకి ప్రకాశ్ రాజ్ అయితేనే పూర్తి న్యాయం జరుగుతుందని భావించి ఆయనని తీసుకున్నారని అంటున్నారు. ఈ విషయం అఫీషియల్ గా ఖరారు కావాల్సి ఉంది.

Naga Shaurya and Niharika Konidela at Sets of Oka Manasu

ఈ సినిమాలో నిహారిక తల్లి పాత్ర ప్రముఖ నటి రమ్య కృష్ణ చేయబోతున్నట్లు సమాచారం. సినిమాలో నిహారిక తల్లి పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని, అందుకే రమ్య కృష్ణ లాంటి స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్టును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ విషయమై అపీషియల్ ప్రకటన రానుంది.

హెల్తీ ఎంటర్టెన్మెంట్ సబ్జెక్టుతో ఫీల్ గుడ్ గా ఈ సినిమా ఉంటుందని, మెగా ఫ్యామిలీ ఇమేజ్ ఏమాత్రం డ్యామేజ్ కాకుండా, నటిగా నిహారికకు మంచి గుర్తింపు తెచ్చే విధంగా ఉంటుందని అంటున్నారు. మధుర శ్రీధర్, టీవీ 9 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎక్కువ భాగం షూటింగ్ వైజాగ్ లో జరుగనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించనున్నారు.

English summary
Naga Shaurya and Niharika Konidela at Sets of Oka Manasu.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu