»   » గొడవలున్నా నాగశౌర్యని హైబ్రిడ్ పిల్ల భలే పొగిడిందిగా.. నాగశౌర్య డుమ్మా కొట్టింది అందుకేనా!

గొడవలున్నా నాగశౌర్యని హైబ్రిడ్ పిల్ల భలే పొగిడిందిగా.. నాగశౌర్య డుమ్మా కొట్టింది అందుకేనా!

Subscribe to Filmibeat Telugu

నాగశౌర్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం కణం. తమిళంలో కారు పేరుతో రూపొయిందిన ఈ చిత్రం తెలుగులో కూడా విడుదలవుతోంది. అనేక వాయిదాల అనంతరం ఎట్టకేలకు ఈ చిత్రాన్ని మార్చ్ 9 న విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. హైదరాబాద్ లో తాజగా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో సాయి పల్లవి ప్రధాన ఆకర్షణగా మారింది. ఈ ఈవెంట్ కు నాగశౌర్య హాజరు కాకపోవడంతో ఉహాగానాలు మొదలవయ్యాయి.

సాయి పల్లవి అందగత్తెనా ? అయితే దూకి చచ్చిపోతా..!
రెండు సూపర్ హిట్లు

రెండు సూపర్ హిట్లు

సాయి పల్లవి నటించిన రెండు తెలుగు చిత్రాలు ఫిదా, ఎంసీఏ ఘనవిజయం సాధించాయి. ఈ రెండు చిత్రాలతో సాయి పల్లవి తెలుగులో క్రేజీ హీరోయిన్ గా మారింది.

 హ్యాట్రిక్ పై కన్ను

హ్యాట్రిక్ పై కన్ను

ఇప్పటికి రెండు విజయాలు అందుకున్న సాయి పల్లవి, కణం చిత్రంతో హ్యాట్రిక్పై కన్నేసింది. తాను తెలుగులో నటించిన ఫిదా, ఎమ్ సి ఏ వేరని, ఈ చిత్రం ఆ రెండింటి కన్నా విభిన్నమని సాయి పల్లవి తెలిపింది.

 నాగశౌర్య డుమ్మా

నాగశౌర్య డుమ్మా

ప్రీరిలీజ్ ఈవెంట్ కు నాగ శౌర్య హాజరు కాలేదు. దీనితో అభిమానుల్లో ఉహాగానాలు మొదలయ్యాయి.

సాయి పల్లవితో విభేదాలు

సాయి పల్లవితో విభేదాలు

గతంలో నేరుగా మీడియా వేదికగానే నాగశౌర్య సాయి పల్లవి పై విమర్శలు చేశాడు. ఆ కారణంగానే ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరు కాలేదేమో అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

నాగ శౌర్య పై ప్రశంసల వర్షం

నాగ శౌర్య పై ప్రశంసల వర్షం

నాగశౌర్య ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరు కాకున్నా సాయి పల్లవి మాత్రం అతనిపై ప్రశంసలు కురిపించింది. నాగశౌర్య అద్భుతమైన నటుడు అంటూ పొగిడేసింది. ఈ చిత్రంలో నాగశౌర్య పాత్రని ఎప్పటికి గుర్తుంచుకుంటారని తెలిపింది. ఏఎల్ విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

English summary
Naga shaurya not attended to Kanam prerelease event. Speculations going viral in social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu