»   » ‘భూమి’ షార్ట్ ఫిల్మ్ : దర్శకుడిగా మారిన హీరో నాగ శౌర్య

‘భూమి’ షార్ట్ ఫిల్మ్ : దర్శకుడిగా మారిన హీరో నాగ శౌర్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ఊహలు గుసగుసలాడే' సినిమాతో హీరోగా కెరీర్ మొదలు పెట్టిన నాగ శౌర్య తక్కువ కాలంలోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 'ఛలో' సినిమాతో నిర్మాతగా మారి హిట్ అందుకున్న ఈ లవర్ బాయ్ ఇపుడు దర్శకత్వంలోకి అడుగు పెట్టాడు.

అయితే నాగ శౌర్య దర్శకుడిగా చేసింది ఫీచర్ ఫిల్మ్ కాదు.... తన లోని డైరెక్షన్ స్కిల్స్ నిరూపించుకునేందుకు ఓ షార్ట్ ఫిల్మ్‌కు దర్శకత్వం వహించాడు. మదర్స్ డే సందర్భంగా మహిళ గొప్పదనం గురించి వివరిస్తూ... ఇటీవల మహిళలపై జరుగుతున్న అకృత్యాలను ఫోకస్ చేస్తూ 10 నిమిషాల నిడివితో ఈ షార్ట్ ఫిల్మ్ రూపొందించారు. 

నాగ శౌర్య సొంత బేనర్ ఇరా క్రియేషన్స్ పతాకంపై దీన్ని నిర్మించారు. ఈ షార్ట్ ఫిల్మ్ మహిళల గురించి తప్పుడు ఆలోచనలు చేసే ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే విధంగా ఉంది.

Naga Shourya turns as a start short director

నాగ శౌర్య సినిమాల విషయానికొస్తే.... ఆయన నటించిన 'అమ్మమ్మగారిల్లు' త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. శ్రీమ‌తి స్వ‌ప్న స‌మ‌ర్ప‌ణ‌లో స్వాజిత్ మూవీస్ బ్యాన‌ర్‌పై నాగ‌శౌర్య‌, బేబి షామిలి జంట‌గా కె.ఆర్ మ‌రియు రాజేష్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'అమ్మమ్మగారిల్లు'. సుంద‌ర్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వహించారు.

English summary
Young actor, Naga Shourya is trying his hand at everything he can do in the films. After being an actor, he turned into producer and now a director too. But he did not make a full length feature film, he decided to start short. The movie is titled, Bhoomi and it is produced on Naga Shourya's home banner, Ira Creations.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X