»   » స్టార్ సినిమాటోగ్రాఫ‌ర్ డైరెక్షన్‌లో నాగ‌శౌర్య‌.. సరికొత్త పాత్రలో...

స్టార్ సినిమాటోగ్రాఫ‌ర్ డైరెక్షన్‌లో నాగ‌శౌర్య‌.. సరికొత్త పాత్రలో...

Written By:
Subscribe to Filmibeat Telugu

ప‌క్కింటి కుర్రాడు పాత్ర‌ల్లో నటించి మ‌న కుటుంబంలో కుర్రాడిలా మ‌న హ్రుద‌యాల్లో స్థానం సంపాయించిన నాగ‌శౌర్య ఏ చిత్రం చేసినా కుటుంబ విలువ‌లు వుండేలా చ‌క్క‌టి ఎంట‌ర్ టైన్‌మెంట్ క‌థ‌లు ఎంచుకుంటారు. ప్ర‌స్తుతం నాగశౌర్య ఐరా క్రియోష‌న్స్ బ్యాన‌ర్ పై కాలేజి బ్యాక్‌డ్రాప్ లో ల‌వ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం త‌రువాత మ‌న్యం ప్రోడ‌క్ష‌న్ బ్యాన‌ర్ లో ప్రోడక్ష‌న్ నెం1 గా మ‌న్యం విజ‌య్ కుమార్ నిర్మాత‌గా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు..

Naga Shourya to work under Sai Srinivas direction

పిల్ల జ‌మిందార్‌, సుప్రీమ్‌, గీతాంజలి, ఎక్క‌డ‌కి పోతావు చిన్న‌వాడా లాంటి సూప‌ర్‌డూప‌ర్ చిత్రాల‌కి అద్బుత‌మైన సినిమాటోగ్ర‌ఫి అందించిన సాయి శ్రీరామ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. అందాల రాక్ష‌సి, అర్జున్ రెడ్డి లాంటి చిత్రాల‌కి సంగీతాన్ని అందించిన రాదాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ ని డిసెంబ‌ర్ లో ప్రారంభిస్తారు. ఇత‌ర వివ‌రాలు అతిత్వ‌ర‌లో తెల‌య‌జేస్తారు.

ఈ సంద‌ర్బంగా నిర్మాత మ‌న్యం విజ‌య్ కుమార్ మాట్లాడుతూ.. ఫ్యామిలి ఆడియ‌న్స్ లో మంచి స్థానం సంపాయించుకున్న నాగ‌శౌర్య హీరోగా మా బ్యాన‌ర్ లో చిత్రాన్ని చేస్తున్నాము. వెరీ బ్యూటిఫుల్ ఇంటిలెజెంట్ సినిమాటోగ్రాఫ‌ర్ సాయి శ్రీరామ్ ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడి గా మారుతున్నారు. ప్ర‌స్తుతం నాగ‌శౌర్య చేస్తున్న చిత్రానికి కూడా సాయి శ్రీరామ్ నే సినిమాటోగ్రాఫ‌ర్ కావ‌టం విశేషం. అలాగే అర్జున్ రెడ్డి కి చాలా మంచి సంగీతాన్ని అందించిన రాదాన్ మ్యూజిక్ చేస్తున్నారు. అలాగే ప్ర‌వీణ్ పుడి ఎడిట‌ర్ గా చేస్తున్నారు.

నాగ‌శౌర్య కి ఈ చిత్రం కొత్త త‌ర‌హ ఇమేజ్ ని తీసుకువ‌స్తుంది. విజువ‌ల్ బ్యూటి ఎలా తీసుకురావాలో మా ద‌ర్శ‌కుడి కి తెలుసు కాబ‌ట్టి ఈ చిత్రం టెక్నిక‌ల్ గా ఏరేంజిలో వుండ‌బోతుందో చూసిన ఆడియ‌న్స్ కి తెలుస్తుంది. అలాగే డిసెంబ‌ర్ లో ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ ని స్థార్ట్ చేస్తాము. ఇత‌ర వివరాలు అతిత్వ‌ర‌లో తెలియజేస్తాము. అలాగే తెలుగు ప్రేక్ష‌కులంద‌రికి విజ‌యద‌శ‌మి శుభాకాంక్ష‌లు అని అన్నారు.

English summary
Budding Hero Naga Shourya is doing a movie under cameramen Sai Srinivas directions. This movie is going produced by M Vijay Kumar. Arjun Reddy fame Radan is music Director, Praveen Pudi is the Editor for this movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu