»   » 'అబ్బాయితో అమ్మాయి' కొత్త ట్రైలర్ (వీడియో)

'అబ్బాయితో అమ్మాయి' కొత్త ట్రైలర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: నాగశౌర్య హీరోగా రమేష్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అబ్బాయితో అమ్మాయి' . ఈ చిత్ర ఆడియో విడుదల వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. స్థానిక సైబర్‌ కన్వెన్షన్‌హాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిసెంబరులో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం థియోటర్ ట్రైలర్ ని విడుదల చేసారు. మీరు ఇక్కడ చూడండి.

నేటి యువతకు రెండు ప్రపంచాలు ఉంటున్నాయి. ఒకటి రియల్ వరల్డ్... మరొకటి వర్చువల్ వరల్డ్. వర్చువల్ వరల్డ్... అంటే... సోషల్ మీడియాలో మాత్రం తమ మనసుని, అభిప్రాయాలను, భావాలను సంపూర్ణంగా, స్వేచ్ఛగా ఆవిష్కరించుకుంటున్నారు. అదే రియల్ వరల్డ్ కు వచ్చేసరికి ఈ ఓపెన్ నెస్ ఉండటంలేదు.

Naga Soury'a Abbayitho Ammayi Theatrical Trailer

ఈ రెండు ప్రపంచాల మధ్య కన్ ఫ్యూజన్ తో సాగే యువతరం జీవితాన్ని, ప్రస్తుత ట్రెండ్ ని ఆవిష్కరిస్తూ మోహనరూపా ఫిలింస్ తో కలిసి జేజి సినిమాస్, కిరణ్ స్టూడియోస్, బ్లూమింగ్ స్టార్స్ మోషన్ పిక్చర్స్ సంస్థలు నిర్మించిన చిత్రం ‘అబ్బాయితో అమ్మాయి'.

నిర్మాతలు మాట్లాడుతూ ''ప్రస్తుతం వస్తున్న ప్రేమకథా చిత్రాలతో పోలిస్తే.. 'అబ్బాయితో అమ్మాయి' విభిన్నంగా సాగుతుంది. ఇళయరాజా అందించిన స్వరాలు తప్పకుండా ఆకట్టుకుంటాయి. యువతరం సినిమా అయినా, కుటుంబ ప్రేక్షకులకూ నచ్చుతుంది. డిసెంబరులో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నాం''అన్నారు నిర్మాతలు.

బ్రహ్మానందం, రావు రమేశ్, మోహన్, ప్రగతి, తులసి, పృథ్వీ తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: శ్యాం కె నాయుడు, ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్, పాటలు: రహ్మాన్, ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళీకృష్ణ కొడాలి.

English summary
Naga Soury' s Abbayitho Ammayi Movie Theatrical Trailer released. Abbayitho Ammayi movie story based on Social net working sites. Directed by Ramesh Varma. Music by Ilaiyaraja. Produced by Kireeti Potini.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu