నాగశౌర్య ‘కళ్యాణ వైభోగమే' విడుదల తేదీ
హైదరాబాద్: 'అలా మొదలైంది' తో హిట్ ను అందుకొన్న దర్శకురాలు నందినిరెడ్డి తాజా చిత్రం ‘కళ్యాణ వైభోగమే'. నాగశౌర్య, మాళవిక నాయర్ లు జంటగా నటించిన ఈ చిత్రన్ని జనవరి 22 న విడుదల చేయనున్నారు.
చిత్రానికి సంబంధించిన విడుదల చేసిన పాటలను మ్యూజిక్ లవర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కళ్యాణ్ కోడూరి ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా, శ్రీ రంజిత్ మూవీ బ్యానర్స్ పై కేఎల్ దామోదర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇందులో ఒకప్పటి అందాల భామ రాశి మాళవికకు తల్లి పాత్రలో కనిపించనుండగా , ఈ ట్రైలర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. కె.ఎల్ దామోదర్ ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరింస్తున్నారు.


Click it and Unblock the Notifications











