»   » నాగశౌర్య 'కళ్యాణ వైభోగమే' టీజర్‌ (వీడియో)

నాగశౌర్య 'కళ్యాణ వైభోగమే' టీజర్‌ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: నాగశౌర్య, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న 'కళ్యాణ వైభోగమే' చిత్రం టీజర్‌ విడుదలైంది. చిత్ర దర్శకురాలు నందినిరెడ్డి తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా ఈ వీడియోను అభిమానులతో పంచుకున్నారు.

Here is the first teaser of #KalyanaVaibhogame, coming from the team of 'Ala Modalaindhi'. We hope you like it :)


Posted by Nandini Reddy on 17 December 2015

గతంలో నందినీ రెడ్డితో అలా మొదలైంది చిత్రం నిర్మించిన కె.ఎల్‌. దామోదర్‌ ప్రసాద్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో ఒకప్పటి అందాల భామ రాశి మాళవికకు తల్లి పాత్రలో కనిపించనుండగా , ఈ టీజర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


‘అలామొదలైంది' చిత్రంతో దర్శకురాలిగా పరిచయమైన నందినిరెడ్డి మొదటి సినిమాతోనే మంచి పేరు సంపాదించుకుంది. తర్వాత సిద్దార్థ్, సమంత జంటగా నటించిన ‘జబర్ధస్త్' చిత్రం డైరెక్ట్ చేసిని నందినికి ఆశించిన ఫలితం దక్కలేదు సరికదా...మరో సినిమా రావడానికి రెండు సంవత్సరాల సమయం పట్టింది.


Naga Sourya's Kalyana Vaibhogame teaser

ప్రస్తుతం యువతలో ప్రేమ, పెళ్లి వంటి బంధాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వీటిని యువతకు అర్థమయ్యేలా కామెడీని మేళవించి తెరకెక్కిస్తున్నట్టు దర్శకురాలు నందిని రెడ్డి అంటున్నారు. చిత్రీకరణ పార్టు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. త్వరలో ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు నిర్మాత దామోదర్‌ ప్రసాద్‌ అన్నారు.


ఈ చిత్రానికి సంగీతం : కళ్యాణ్‌ కోడూరి, సినిమాటోగ్రఫీ : జివిఎస్‌ రాజు, ఎడిటర్‌ : జువైద్‌ సిద్ధిక్‌, కొరియోగ్రఫీ : చిన్ని ప్రకాష్‌, రఘు, అని, యాక్షన్‌ : డ్రాగన్‌ ప్రకాష్‌, పాంథర్‌ నాగరాజు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : వివి నందినిరెడ్డి.

English summary
Kalyana Vaibhogame is an upcoming Telugu film written and directed by BV Nandini Reddy and Produced by KL Damodar Prasad the film. Naga Shourya and Malvika Nair in the lead role. Kalyan Koduri composed music for the movie, Dialogues have written by Lakshmi Bhoopal.
Please Wait while comments are loading...