For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చేతకాని వారే అలా అంటారు.. నెపోటిజంపై మెగా బ్రదర్ సెన్సేషనల్ కామెంట్స్

  |

  ఈ మధ్య కాలంలో ఎక్కువ వినిపించిన పేరు నెపోటిజం, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత ఈ పదం మరింత ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇండస్ట్రీలో నెపోటిజం(బంధుప్రీతి) ఉందని తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే వీటిపై ఆ మధ్య ఆర్జీవీ చేసిన కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. నెపోటిజం ఎక్కడైనా ఉంటుందని, అయితే వారసత్వం వల్ల హీరోలు కాలేరు అని ప్రజలు ఒప్పుకుంటేనే స్టార్స్ అవుతారని ఆర్జీవీ చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా నాగబాబు సైతం సుధీర్ఘంగా ఈ టాపిక్‌పై మాట్లాడాడు.

  నెపోటిజం పనికి రాదు..

  నెపోటిజం పనికి రాదు..


  ఇండస్ట్రీలో నెపోటిజం ఉందని అంటున్నారు. మాట్లాడితే ఆ నాలుగు ఫ్యామిలీలు అని అంటారు. అలా ఉండదు. ఎవరైనా రావొచ్చు.. సత్తా, ప్రతిభ ఉంటే ఎవ్వరూ ఆపలేరు. స్టార్స్ ఫ్యామిలీ నుంచి వచ్చే వారికి కొంత అడ్వెంటేజ్ ఉంటుంది. అంతే తప్ప.. ఎవ్వరూ జనాల మీదకి రుద్దలేరు. వారిలో సత్తా లేకపోతే ప్రజలే తిరస్కరిస్తారు అని నాగబాబు చెప్పుకొచ్చాడు.

  ఎంతో కష్టపడి..

  ఎంతో కష్టపడి..

  రామ్ చరణ్, అల్లు అర్జున్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడ్డారు. యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్నారు. వారికి కూడా ఫ్లాపులు వచ్చాయి.. ఎంతో కష్టపడ్డారు. సినిమా కోసం ఎంతో శ్రమిస్తారు. ఒక్కోసారి వారు తినే తిండి చూస్తే నాకు కూడా భయం వేస్తుంది. ఉప్పు కారం లేని పచ్చి కూరగాయాలను తింటారు.. సినిమా కోసం వారు అంత కష్టపడతారు కాబట్టే స్టార్స్ అయ్యారు అని నాగబాబు తెలిపాడు.

  సాయి ధరమ్ తేజ్, వరుణ్ అలా..

  సాయి ధరమ్ తేజ్, వరుణ్ అలా..


  సాయి ధరమ్ తేజ్‌కు మేము అవకావం ఇవ్వలేదు. ఎక్కడో క్రికెట్ ఆడుకుంటూ ఉంటే.. వైవీఎస్ చౌదరి చూసి అవకాశం ఇచ్చాడు. తరువాత చిరంజీవి మేనళ్లుడు అని తెలిసింది. ఇక వరుణ్ తేజ్‌ను నేను లాంచ్ చేయలేదు. అప్పుడు నా దగ్గర అంత స్థోమత కూడా లేదు.. ముకుంద సినిమా మధ్యలో ప్రాబ్లమ్స్ వచ్చాయి.. ఏడాది ఆగాడు. వరుణ్ తేజ్‌కు కూడా ఫ్లాపులు వచ్చాయి.. మరి మేమంతా నెపోటిజం అనుకుంటే వారి సినిమాలను ఫ్లాప్ కాకుండా నడిపించొచ్చు కదా. అలా ఎవ్వరూ చేయలేరు.. ప్రజలకు నచ్చితేనే చూస్తారు.. నచ్చకపోతే చూడరు అంటూ నాగబాబు పేర్కొన్నాడు.

  ఎన్టీఆర్, మహేష్ బాబు..

  ఎన్టీఆర్, మహేష్ బాబు..

  స్వర్గీయ ఎన్టీఆర్ గారి వారసత్వం వల్ల బాలకృష్ణ, ఎన్టీఆర్ నిలబడ లేదు. వారు ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. వారికంటూ ప్రత్యేకతను ఏర్పరుచుకున్నాడు. అరవింద సమేత షూటింగ్ సమయంల్ ఎర్రటి ఎండలో షూటింగ్, షర్ట్ లేకుండా ఆ ఎర్రటి ఎండలో గంటల తరబడి నిలబడ్డాడు. ఆ డెడికేషన్ ఉంది కాబట్టే ఎన్టీఆర్ ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాడు. ఇక మహేష్ బాబు చిన్నప్పుడు ఎంతో చబ్బీగా ఉండేవాడు సినిమాల కోసం కేబీఆర్ పార్క్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిగెత్తుతూనే ఉండేవాడు. అంచలంచెలు ఎదుగుతూ నెంబర్ వన్ హీరోగా ఎదిగాడు అని నాగబాబు చెప్పుకొచ్చాడు.

  Recommended Video

  Sri Reddy On Balakrishna-Nagababu Issue || ఆయన కింగే మీరే బొంగు... నగ్న సత్యం చెప్పిన శ్రీ రెడ్డి
  చేతకాని వారే..

  చేతకాని వారే..


  నెపోటిజం , బంధు ప్రీతి అని చేతకాని వారు, మూర్ఖులు, స్వార్థపరులే అంటారు. రవితేజ రాలేదా? విజయ్ దేవరకొండ ఎదగలేదా? నానితో సినిమాలు తీయడం లేదా? సత్తా ఉంటే ఎవ్వరినీ ఆపలేరు. అయితే ఇలా పదే పదే నెపోటిజం ఉందని చెప్పడం వల్ల బయట కూడా అదే నిజమని భావించే అవకాశం ఉందని చెబుతున్నా. అలాంటిదేమీ ఉండదు. ప్రతిభ ఉంటే ఎవ్వరూ ఆపలేరు. డాక్టర్ కొడుకు డాక్టర్, ఇంజనీర్ కొడుకు ఇంజనీర్, బిజినెస్ మెన్ కొడుకు బిజినెస్ మెన్ అయితే ఎందుకు నెపోటిజం అనరు. ధీరుభాయ్ అంబానీ తన ఇద్దరు కొడుకులకు వ్యాపారాన్ని ఇస్తే అందులో ముఖేష్ అంబానీ సక్సెస్ అయ్యారు అనిల్ అంబానీ ఫెయిల్యూర్ అయ్యారు అని నాగబాబు తెలిపాడు.

  English summary
  Nagababu About Nepotism In Tollywood
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X