»   » రామ్ చరణ్ సినిమాలో బాబాయ్ నటిస్తున్నాడోచ్!

రామ్ చరణ్ సినిమాలో బాబాయ్ నటిస్తున్నాడోచ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా హీరో సినిమా అంటేనే హైప్ ఓరేంజిలో ఉంటుంది. ఓపెనింగ్స్ అదిరిపోతాయి. ఇక ఒకే సినిమాలో ఇద్దరు మెగా ఫ్యామిలీ స్టార్స్ నటిస్తే ఆ సినిమాపై అంచనాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సినిమాకు స్టార్ దర్శకుడు తోడైతే ఓపెనింగ్స్ అదిరిపోతాయి.

గతంలో పవన్ కళ్యాణ్ శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో గెస్ట్ రోల్ చేయగా, అల్లు అర్జున్ ఎవడు చిత్రంలో అతిథి పాత్రలో నటించాడు. మగధీర చిత్రంలో చిరు, చరణ్ ఇద్దరూ స్క్రీన్ పై కనిపించి సూపర్బ్ అనిపించారు. మెగా ఫ్యామిలీ హీరోలు కలిసి తెరపై కనిపిస్తే అభిమానులకు, ప్రేక్షకులకు అదో ఆనందం.

రామ్ చరణ్ తాజాగా నటిస్తున్న శ్రీను వైట్ల సినిమాలో కూడా ఇలాంటి సన్నివేశాలు చూడబోతున్నాం. ఈ చిత్రంలో రామ్ చరణ్ స్టంట్ మాస్టర్ గా నటిస్తున్నాడు. సినిమా కథలో భాగంగా ఆయన పెద్ద స్టార్స్ అయిన నాగార్జున, రానా లాంటి సినిమాలకు ఫైట్ కంపోజ్ చేస్తాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ బాబాయ్.... నాగబాబు కూడా ఓ గెస్ట్ రోల్ లో కనిపిస్తారని తెలుస్తోంది. గతంలో ఆరెంజ్ సినిమాలో నాగబాబు ఓ చిన్న పాత్రలో నటించాడు. రామ్ చరణ్ సినిమాలో నటించడం నాగబాబుకు ఇది రెండో సారి.

విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సుప్రసిద్ధ నిర్మాత దానయ్య డి.వి.వి. 'డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.' పతాకం పై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుపుకుంటోంది.

 Nagababu acting in Ram Charan's Movie

రామ్ చరణ్ తో పాటు ఇతర ప్రధాన తారాగణం అంతా పాల్గొనగా టాకీ పార్ట్ కు సంభందించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు నిర్మాత దానయ్య డి.వి.వి. గత నెల 27 నుంచి బ్యాంకాక్ లో జరిగిన షూటింగ్ లో 'మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' నాయిక రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు ఇతర ప్రధాన తారాగణం అంతా పాల్గొనగా బ్యాంకాక్ లో భారీ పతాక సన్నివేశాలను, భారీ వ్యయంతో చిత్రీకరించామని తెలిపారు. అలాగే టాకీ పార్ట్ కు సంభందించిన సన్నివేశాలను కూడా చిత్రీకరించినట్లు తెలిపారు. బ్యాంకాక్ లో చిత్రీకరించిన సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని తెలిపారు నిర్మాత దానయ్య.

విజయదశమి కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ చిత్రానికి సంభందించి ఇంకా ఎలాంటి పేరును నిర్ణయించలేదని తెలిపారు. నాయక్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఈ సినిమా నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. భారీ తారాగణం తో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం ముస్తాబౌతుందని అన్నారు. ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' తో తాను రూపొందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు 'శ్రీను వైట్ల' మాట్లాడుతూ " ఫ్యామిలి ఎంటర్టైనర్ విత్ యాక్షన్ 'కథా చిత్రం గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపారు.

ఈ చిత్రానికి కథ : కోన వెంకట్, గోపి మోహన్, మాటలు: కోన వెంకట్, రచనా సహకారం: ఉపేంద్ర మాధవ్ , ప్రవీణ్ లైన్ ప్రొడ్యూసర్ : కృష్ణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి. వై. ప్రవీణ్ కుమార్ సమర్పణ : డి. పార్వతి నిర్మాత : దానయ్య డి.వి.వి. మూలకథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : శ్రీను వైట్ల.

English summary
For Ram Charan's upcoming movie under Sreenu Vytla's direction, there is huge buzz regarding the cameos being done by other stars in the movie. As the hero is playing the role of a stunt master in the film, he will be shown composing fights for other big stars. As far as revealed, Nagarjuna and Rana are going to be the two big stars featuring in the movie. But it is now confirmed that there is another biggie from Mega family in the flick, and it's none other than Baabai Nagababu.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu