For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్‌కళ్యాణ్ ఫ్యాన్ గా నాగబాబు ...

  By Srikanya
  |

  హైదరాబాద్ : తమ్ముడు పవన్‌కళ్యాణ్ అంటే అలవిమాలిన అభిమానం తనకు. అందుకే... పవన్ ఫ్యాన్‌గా ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఇంతకీ పవర్‌స్టార్ ఫ్యాన్‌గా నాగబాబు నటిస్తున్న చిత్రం పేరు తేజ '1000 అబద్దాలు'. ఇందులో నాగబాబు పాత్ర పేరు 'టవర్‌స్టార్'. పాలడుగు ప్రభాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

  దర్శకుడు తేజ మాట్లాడుతూ -''1000 అబద్దాలాడైనా ఓ పెళ్లి చేయమన్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా ఉంటుంది. ఫుల్ కామెడీ ప్యాక్ సినిమా ఇది. ముఖ్యంగా టవర్‌స్టార్‌గా నాగబాబు పాత్ర ఈ చిత్రానికి హైలైట్'' అని చెప్పారు. పవన్‌కల్యాణ్‌ని అభిమానులు పవర్‌స్టార్‌ అని పిలుచుకోవడం విన్నాం. ఇక్కడ మాత్రం టవర్‌స్టార్‌ ప్రత్యక్షమయ్యాడు. ఇంతకీ ఇతగాడు ఎవరు? పవర్‌స్టార్‌తో సంబంధమేమైనా ఉందా? ఆ విషయం తెలియాలంటే '1000 అబద్ధాలు' చూడాల్సిందే అంటున్నారు.

  ఈ చిత్రంలో టవర్‌స్టార్‌గా నటించిన నాగబాబు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారు. ఇటీవల విడుదలైన పాటలకు చక్కటి స్పందన లభించింది. రమణగోగుల సంగీతం చిత్రానికి ప్రధాన బలం'' అన్నారు. ఆగస్ట్ 15న చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: మరుధూరి రాజా, కళ: నరహరి వర్మ, ఛాయాగ్రహణం: రసూల్‌ ఎల్లోర్‌.

  చిత్రం మిగతా విశేషాలు...స్లైడ్ షో లో....

  తేజకు హిట్ అవసరం..

  తేజకు హిట్ అవసరం..

  నీకు నాకు డాష్ డాష్ సినిమా తర్వాత తేజ చేస్తున్న చిత్రం ఇది. ఆ మధ్యన దగ్గుపాటి రానా తో తేజా చిత్రం చేయనున్నారని వార్తలు వచ్చాయి. అయితే అది మెటీరియలైజ్ కాలేదు. నీకు నీకు డాష్ డాష్ డిజాస్టర్ అయ్యింది. దాంతో తేజతో చేయటానికి పెద్ద హీరోలెవరూ ఆసక్తి చూపటం లేదు.

  సాయిరామ్ శంకర్ కి సేమ్ సిట్యువేషన్

  సాయిరామ్ శంకర్ కి సేమ్ సిట్యువేషన్

  అయితే సాయిరామ్ శంకర్ కూడా అదే సిట్యువేషన్ లో ఉన్నాడు. అతనితో చేయటానికి కూడా పెద్ద నిర్మాతలు సాహసం చేయటం లేదు. ఈ నేపధ్యంలో తేజతో చిత్రం అనగానే పెద్ద క్రేజ్ రాకపోయినా..కామెడీ కాబట్టి వర్కవుట్ అవుతుందనే నమ్మతంతో నిర్మాతలు ఉన్నారు. అందులోనూ సినిమాలో నాగబాబు పాత్ర హైలెట్ అని చెప్పటం కలిసి వస్తోంది

  స్టోరీ ఏంటి

  స్టోరీ ఏంటి

  ‘‘పెళ్లంటే నూరేళ్ల పంట. నూరేళ్ల పంటను పండించడానికి ‘1000 అబద్ధాలు' అడితే తప్పుకాదు అని మన పెద్దలే చెప్పారు. ఒకరు ఆ మాటనే ఆదర్శంగా తీసుకున్నారు. 1000 అబద్ధాలతో అనుకున్న వ్యక్తిని పెళ్లాడి తమ కలను సాకారం చేసుకున్నారు. ఇంతకీ ఇన్ని అబద్దాలు అడింది అమ్మాయా? అబ్బాయా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అసలు ఇంతటి కఠోరమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం సదరు వ్యక్తికి ఎందుకొచ్చింది? అనేది ఇందులో ఆసక్తికరమైన అంశం''

  నిర్మాతల నమ్మకం

  నిర్మాతల నమ్మకం

  రాజేంద్రప్రసాద్‌తో ‘సినిమాకెళ్దాం రండి' చిత్రాన్ని నిర్మించిన శ్రీ ప్రొడక్షన్స్ సంస్థ ఈ ‘వెయ్యి అబద్ధాలు'సినిమాను నిర్మించబోతోంది. నిర్మాతలు సునీత ప్రభాకర్, సీత నెక్కంటి ఆ వివరాలను తెలియజేస్తూ - తేజ-సాయిరామ్‌శంకర్ కాంబినేషన్‌లో ఓ వైవిధ్యమైన కథాంశంతో సినిమా రూపొందిందని నమ్మకంగా చెప్తున్నారు.

  సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ..

  సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ..

  మంచి పని కోసం ఎన్ని అబద్ధాలాడినా తప్పు లేదంటారు. ఓ జంట మాత్రం ఏకంగా వెయ్యి అబద్ధాలు ఆడేసింది. ఇంతకీ వాళ్లు తలపెట్టిన పనేమిటి? అసలు ఎవరా జంట? అబద్ధాలు చెప్పాక... వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది? తదితర విషయాల్ని మా చిత్రంలో చూడొచ్చంటున్నారు .

  ఎవరెవరు...

  ఎవరెవరు...

  ఎస్తర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, నరేష్, చలపతిరావు, బాబూమోహన్, గౌతంరాజు, తిరుపతి ప్రకాష్, కొండవలస, హేమ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు: మరుధూరి రాజా, సంగీతం: రమణగోగుల, కెమెరా: రసూల్ ఎల్లోర్, కళ: నరసింహవర్మ, ఎడిటింగ్: శంకర్, పాటలు: అరిశెట్టి సాయి, పోతుల రవికిరణ్. సమర్పణ: చిత్రం మూవీస్, నిర్మాణం: శ్రీప్రొడక్షన్స్.

  English summary
  
 Teja is getting ready to present his next film, titled ’1000 Abbadhalu’. The movie will release on Aug 15th and post production work is currently underway. Sairam Shankar and Esther will be seen as the lead pair in this movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X