Don't Miss!
- News
Bengaluru: అపార్ట్ మెంట్ లో ఏం జరిగింది ?, ఆ ఇద్దరూ ఒకే సారి ఎలా చనిపోయారు ?, భార్య ఎంట్రీతో ?
- Sports
INDvsAUS : టెస్టు సిరీస్ తర్వాత.. అశ్విన్ వల్ల వీళ్లకు పీడకలలు తప్పవు!
- Travel
ప్రకృతి రమణీయతకు నిదర్శనం.. హంసలదీవి!
- Technology
ఈ ఆపిల్ మ్యాక్ బుక్ తయారీ నిలిపి వేసిన Apple ! కారణం ఏంటో తెలుసుకోండి!
- Finance
Adani Bonds: అదానీ డాలర్ బాండ్లకు ఎదురుదెబ్బ.. ప్రమోటర్ల తాజా నిర్ణయం ఏమిటంటే..
- Lifestyle
మీ రోజువారీ ఆహారంలో ఈ 9 ఆహారాలు క్యాన్సర్‌ను దూరం చేస్తాయి...
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Hyderabad Pub Case: పోలీసుల అదుపులో నిహారిక.. క్లారిటీ ఇచ్చిన నాగబాబు.. పబ్‌లో ఏం జరిగిందంటే!
హైదరాబాద్‌లో పబ్ అండ్ పార్టీ కల్చర్ రోజురోజుకూ పెరిగిపోతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ భాగ్యనగరం డ్రగ్స్ వాడకానికి అడ్డాగా మారుతుందని అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రెండు రోజుల క్రితమే మత్తు పదార్థాలకు బానిసైన ఓ వ్యక్తి మరణించాడు. దీంతో నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు దీనిపై చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే తాజాగా హైదరాబాద్‌లోని ప్రముఖ పబ్‌లో దాడులు నిర్వహించారు. ఇందులో రాహుల్ సిప్లీగంజ్, నిహారిక కొణిదెల సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా దీనిపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ఆయనేం చెప్పారో మీరే చూడండి!

ఆ పబ్‌పై దాడి చేసిన పోలీసులు
హైదరాబాద్ నగరంలో పెరుగుతోన్న డ్రగ్స్ దందాను రూపు మాపే చర్యల్లో భాగంగా నగరానికి చెందిన టాస్క్‌ఫోర్స్ అధికారులు బంజారాహిల్స్‌లోని ఓ ప్రముఖ హోటల్‌పై గత రాత్రి దాడి చేశారు. అందులో నిర్వహిస్తోన్న ఓ పబ్‌ను కూడా తనిఖీలు చేశారు. అప్పుడు దాన్ని నిర్ణీత సమయానికి మించి నడుపుతున్నట్టు అధికారులు గుర్తించి నిర్వహకులపై కేసు నమోదు చేశారు.
Rahul Sipligunj Arrest: రాహుల్ సిప్లీగంజ్ అరెస్ట్.. పోలీసుల అదుపులో మరికొందరు ప్రముఖులు!

డ్రగ్ కలకలం... రాహుల్, నిహారిక
సదరు పబ్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేసిన సమయంలో చాలా మంది పరారైనట్లు తెలిసింది. ఆ సమయంలో వాష్‌రూమ్స్, డ్యాన్సింగ్ ఫ్లోర్ దగ్గర డ్రగ్స్ దొరికినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఇందులో ప్రముఖ నటి నిహారిక కొణిదెల, రాహుల్ సిప్లీగంజ్‌తో పాటు చాలా మంది సినీ ప్రముఖులు ఉన్నారని వార్తలు వచ్చాయి. దీంతో ఇది హాట్ టాపిక్ అయింది.

150 మంది అరెస్ట్.. వాళ్లు మాత్రం
సమయానికి మించి నడుపుతున్నారన్న కారణంతో ఆ పబ్‌పై దాడి చేయగా డ్రగ్స్ దొరకడంతో కలకలం రేగింది. ఇక, ఈ ఘటనలో 150 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వాళ్లందరినీ బంజారాహిల్స్ స్టేషన్‌కు తరలించారట. అందులో చాలా మందిని విచారించి ఇంటికి పంపేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా 38 మందిపై మాత్రమే పోలీసులు కేసు నమోదు చేశారని తెలిసింది.
Malaika Arora: రోడ్డు ప్రమాదానికి గురైన హీరోయిన్.. ఆమె పరిస్థితి ఎలా ఉందంటే!

విచారణకు హాజరైన మెగా డాటర్
పబ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న మెగా డాటర్ నిహారిక కొణిదెల ఆదివారం ఉదయం పోలీస్ స్టేషన్ దగ్గర కనిపించడంతో ఈ న్యూస్ మరింత హైలైట్ అయింది. మొదట్లో పబ్‌లో పట్టుబడిన వారిలో ఆమె పేరు ఉన్నా చాలా మంది కన్ఫార్మ్ చేయలేదు. కానీ, ఎప్పుడైతే స్టేషన్ దగ్గర కనిపించిందో దీంతో దీనిపై క్లారిటీ వచ్చింది. ఆమె విచారణకు హాజరై వెళ్లినట్లు తెలుస్తోంది.

నిహారిక డ్రగ్స్ కేసు అనుమానం
హైదరాబాద్ పబ్ కేసులో విచారణకు హాజరైన తర్వాత నిహారిక కొణిదెలపై ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆమె కూడా డ్రగ్స్ కేసులో చిక్కుకుందా అని చాలా మంది ఆందోళన చెందారు. అదే సమయంలో మెగా డాటర్‌ను అసలు ఎందుకు స్టేషన్‌కు పిలిచారు? ఆమెపై ఎఫ్ఐఆర్ అయిందా? అన్న అనుమానాలు కూడా వ్యక్తం అయిన విషయం తెలిసిందే.
Bigg Boss Non Stop: ఐదో వారం షాకింగ్ ఎలిమినేషన్.. మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఔట్.. ఆమె మళ్లీ సేఫ్!
Recommended Video


నిహారిక కేసుపై నాగబాబు క్లారిటీ
తెలుగు
రాష్ట్రాల్లో
సంచలన
రేకెత్తించిన
పబ్
కేసు
గంటకో
మలుపు
తిరుగుతుంది.
ఇందులో
ఫలానా
నటుడు
ఉన్నాడని..
ఫలానా
నటి
ఉందని
రకరకాల
వార్తలు
పుట్టుకొస్తున్నాయి.
అదే
సమయంలో
నిహారిక
గురించి
కూడా
ఎన్నో
పుకార్లు
షికార్లు
చేస్తున్నాయి.
ఇలాంటి
పరిస్థితుల్లో
తాజాగా
ఈ
కేసు
గురించి
మెగా
బ్రదర్
నాగబాబు
స్పందిస్తూ
ఓ
వీడియోను
విడుదల
చేశారు.
|
దయచేసి అలాంటివి నమ్మొద్దు
తాజాగా
విడుదల
చేసిన
వీడియోలో
‘పబ్
కేసు
గురించి
నేను
స్పందించడానికి
కారణం
నా
కూతురు
నిహారిక
అక్కడ
ఉండడమే.
పబ్‌ను
సమయానికి
మించి
నడుపుతున్నారన్న
కారణంతో
పోలీసులు
నిర్వహకులపై
చర్యలు
తీసుకున్నారు.
ఇందులో
నిహారికకు
పోలీసులు
క్లీన్‌చిట్
ఇచ్చారు.
కాబట్టి
తనపై
వచ్చే
అసత్య
ప్రచారాలను
నమ్మకండి'
అంటూ
నాగబాబు
వెల్లడించారు.