twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ తాట తీస్తాడు.. సైలెంట్‌గా ఉన్నామని సహనాన్ని పరీక్షించొద్దు.. ఎలా రియాక్ట్ అవుతామో.. నాగబాబు

    By Rajababu
    |

    Recommended Video

    Srireddy issue : Nagababu Clarifies To Media

    పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై నాగబాబు తీవ్రంగా స్పందించారు. రాజకీయ నేతల వలలో పడి కొందరు బలిపశువులుగా మారుతున్నారని ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఫిలిం ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆవేశంగాను, ఆవేదనగానూ, ఉద్వేగంగానూ మాట్లాడారు. ఇండస్ట్రీ సమస్యలను తీర్చడానికి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, ఎనీఆర్ రానక్కర్లేదు. నాలాంటి వాళ్లు చాలూ అని ఆయన అన్నారు. ఉద్వేగంగా నాగబాబు చేసిన ప్రసంగం ఇదే..

     పవన్ చేసిన తప్పేమిటీ

    పవన్ చేసిన తప్పేమిటీ

    సినిమా పరిశ్రమలోని ప్రతీ సమస్యపై మాట్లాడటానికి పవన్ కల్యాణ్ (కల్యాణ్‌ బాబు) రానక్కర్లేదు. ఓ మంచి పని కోసం కల్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లాడు. సినిమా పరిశ్రమలో ఎవరికైనా అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయమనడం తప్పా? పవన్ అలా సూచించడాన్ని తప్పుపడుతారా? మీ విజ్క్షత ఏమైపోయింది. తప్పు ఎలా అవుతుంది? ఎవరికైనా అన్యాయం జరిగితే న్యాయం చేయడానికి పోలీసు వ్యవస్థ ఉంది. న్యాయం చేయడానికి మంచి అధికారులు ఉన్నారు.

    టీఆర్పీల కోసం ప్రయత్నించొద్దు

    టీఆర్పీల కోసం ప్రయత్నించొద్దు

    సినిమా పరిశ్రమలోని వ్యక్తులపై బురద జల్లడానికి ప్రయత్నించకండి. అది మీ చేతులకు అంటుకుంటుంది. టీఆర్పీ రేటింగ్‌ల కోసం మీడియా ప్రయత్నించవద్దు. మీరు పాడైపోతే సామాన్య ప్రజలకు దిక్కెవరు. రాజకీయంగా మోటివేట్ కావొద్దు. దయచేసి మీడియాను మంచిని మంచిగా.. చెడ్డను చెడ్డగా చూపించండి. రాజకీయంగా ప్రేరిపితులు కావొద్దు. యూట్యూబ్ చూడండి ఏ ఛానెల్ ఎలా పనిచేస్తుందో ప్రజలే చెబుతున్నారు.

    పవన్‌ను నీచంగా తిట్టింది

    పవన్‌ను నీచంగా తిట్టింది

    నిన్న పవన్ కల్యాణ్‌ను ఒకావిడ నీచంగా తిట్టింది. మాకు చాలా కోపం వచ్చింది. మేము తీవ్రంగా స్పందించాలని అనుకొన్నాం. కానీ ఆలోపే సినీ పరిశ్రమకు చెందిన వాళ్లు, పబ్లిక్ మాకు అండగా వచ్చారు. వ్యక్తిగతంగా మాపై ఆరోపణలు చేస్తే భరిస్తాం. మాపై ఎంత నీచంగా మాట్లాడినా తట్టుకొంటాం. బలవంతుడికే భరించే శక్తి ఉంటుంది. బలహీనుడికి భరించే శక్తి ఉండదు అని పవన్ కల్యాణ్ ఎప్పుడూ చెబుతుంటాడు.

    పవన్ కల్యాణ్ ప్రాధేయపడాలా?

    పవన్ కల్యాణ్ ప్రాధేయపడాలా?

    సోషల్ మీడియాలో ట్రోల్ విషయం ఎవరి పరిధిలో లేదు. ఎవడో ట్రోల్ చేస్తే పవన్ కల్యాణ్ ప్రాధేయపడ్డాలా. మీ వద్ద ఎలాంటి ఆధారాలు ఉన్నా వాటిని బయటపెట్టండి. ఎవడైనా తప్పు చేస్తే పోలీసులు, చట్టాలు చర్యలు తీసుకొంటారు. ఏ విషయంపైనా స్పందించవద్దు అని పవన్ కల్యాణ్ పదే పదే చెబుతున్నారు. చాలా మంది పొలిటికల్‌గా ప్రేరేపితులవుతున్నారు. వాళ్లంతా కొందరి చేతిలో బలిపశువులుగా మారుతున్నారు అని నాగబాబు అన్నారు.

    సహనాన్ని పరీక్షించొద్దు

    సహనాన్ని పరీక్షించొద్దు

    మెగా ఫ్యామిలీ, మెగాస్టార్ సైలెంట్‌గా ఉన్నారని ఏ రాయిపడితే ఆరాయితో కొడితే ఊరుకోం. ఎలా రియాక్ట్ అవుతామో మాకే తెలియదు. మా సహనాన్ని పరీక్షించొద్దు. మమల్నీ చాలా తేలికగా తీసుకోవద్దు. చేతిలో సెల్‌ఫోన్ ఉంది. డబ్బులు ఇచ్చి పిలిపించుకొనే మీడియా ఉందని బాధ్యతారహితంగా ప్రవర్తించకండి. నా మాటల్ని ఎలా అర్థం చేసుకొన్నా ఫర్వాలేదు.

     సన్నాసులు, వెధవలు ఉన్నారు

    సన్నాసులు, వెధవలు ఉన్నారు

    మా వ్యక్తిగత జీవితంలోకి వెళ్లొద్దు. ఓ వ్యక్తిని ఎదుర్కోవడం చాతకపోతే.. ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని చంపాలనుకొనే సన్నాసులు, వెధవలు ఉన్నారు. అలా అని పర్సనల్ లైఫ్‌ను టార్గెట్ చేయవద్దు. బయట ఎవడో ట్రోల్ చేస్తే వాడిపై ఫిర్యాదు చేయండి. అంతేకాని మమ్మల్ని వ్యక్తిగతంగా కెలుకవద్దు. ఎదైనా తప్పు చేస్తే నేను ఈ తప్పు చేశానని ఒప్పుకొనే దమ్మున్న వ్యక్తి నా తమ్ముడు పవన్ కల్యాణ్. మీకు ఉందా దమ్ము అని నాగబాబు ప్రశ్నించారు.

    పవన్ వద్ద డబ్బులు కూడా లేవు

    పవన్ వద్ద డబ్బులు కూడా లేవు

    ఓ మంచి పనికోసం పవన్ కల్యాణ్ ప్రజల్లోకి వెళ్లారు. ఎలాంటి విషయాలు పట్టించుకోవడం లేదు. నా తమ్ముడితో మాట్లాడక ఆరు నెలలు అవుతున్నది. వాడిని నేను డిస్ట్రబ్ చేయను. సినీ పరిశ్రమలో పవన్ నంబర్‌వన్. కోట్ల రూపాయలు వస్తున్నా అవేమీ పట్టించుకోకుండా ప్రజల్లోకి వెళ్లారు. నీ వద్ద డబ్బులు కూడా లేవు అని మేము ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదు. అలాంటి పవన్ కల్యాణ్‌ను తిడుతారా? విమర్శిస్తురా అని నాగబాబు ప్రశ్నించారు.

    అందరి దూల తీరుస్తాడు

    అందరి దూల తీరుస్తాడు

    జీవితంలో ఎవరైనా తప్పులు చేస్తారు. ప్రపంచంలో తప్పు చేయని వారు ఎవరూ ఉండరు. పవన్ కల్యాణ్‌ను వ్యక్తిగత విమర్శిస్తారా? సమాజానికి మంచి చేస్తున్నాడా లేదా చూడండి. వ్యక్తిగత జీవితాలు గురించి తవ్వితే అందరి బాగోతాలు బయటపడుతాయి. ఎవరెన్నీ మాట్లాడినా పవన్ కల్యాణ్ చాలా మౌనంగా ఉన్నాడు. వాడి మౌనాన్ని తక్కువగా అంచనా వేయవద్దు. పవన్‌పై ఆరోపణలు చేపిస్తున్న రాజకీయ నేతలు ఎవరున్నారో తెలుసు. త్వరలోనే మీ అందరి దూల తీరుస్తాడు. నేను ఈ మాటలు మాట్లాడం కూడా పవన్‌కు ఇష్టం ఉండదు అని నాగబాబు ఆవేశంగా మాట్లాడారు.

    నీచంగా తిడితే భరిస్తారా?

    నీచంగా తిడితే భరిస్తారా?

    పవన్‌ను, నా తల్లిని నీచంగా తిట్టడంపై నటి మాధవీలతతోపాటు చాలా మంది నటీనటులు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నస్థాయి నటీనటుల వసతులు, సౌకర్యాల కోసం పనిచేస్తాను. మీ తల్లిని ఓ స్త్రీ నీచంగా తిడితే భరిస్తారా? కానీ మా తల్లిని తిడితే మేము భరించాం. ఈ విషయం గురించి నా తల్లితో మాట్లాడితే.. ఆమె పట్టించుకోలేదు. నన్ను తిట్టినా ఆమెను తిట్టవద్దు అని నా తల్లి చెప్పింది. నా తల్లి సూచన మేరకే నేను ఈ మీటింగ్ పెట్టాను. దయచేసి మీడియా బాధ్యతగా వ్యవహరించాలి.

    అందరి జాతకాలు బయటపెడుతాం

    అందరి జాతకాలు బయటపెడుతాం

    ట్రోలింగ్, క్యాస్టింగ్ కౌచ్, ఇండస్ట్రీలో ఉన్న సమస్యల కోసం పోరాటం చేస్తాం. ఈ విషయాన్ని ఇంతటితో మీడియా ఆపేద్దాం. ఈ విషయాన్ని చెప్పడానికి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ఎన్టీఆర్ లాంటి రానక్కర్లేదు. వారు స్పందించే, సందర్భాలు విషయాలు వేరే ఉన్నాయి. ఇండస్ట్రీ, దేశానికి సంబంధించిన సమస్యల గురించి వారు స్పందిస్తారు. దయచేసి ఇంతటితో ఆపేయండి. ఇక ముందు కూడా ఇదే కొనసాగితే మేము అందరి జాతకాలు బయటపెడుతాం. మా చేతుల్లో చాలా ఉన్నాయి. ఇండస్ట్రీపై ఆరోపణలు చేయవద్దు అని నాగబాబు హెచ్చరించారు.

    English summary
    Actor Nagababu reacted on recent development on film Industry in media. He speaks about allegations made on the Industry. He promised that he will take care of issues related to Industry. He requested that.. Do not go into Pawan Kalyan personal life.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X