»   »  సంక్రాంతికి ముందే నాగబాబు సినిమా

సంక్రాంతికి ముందే నాగబాబు సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu
ఆపరేషన్ దుర్యోధన సినిమా ఇచ్చిన ధైర్యంతో పోసాని కృష్ణ మురళి వెంటనే మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. దాదాపు సినిమాను పూర్తి కానిచ్చారు. విడుదలకు సిద్ధం చేశారు. చాలా పెద్ద సినిమాలు అన్నీ సంక్రాంతికి విడుదల కానున్న నేపథ్యంలో వెరైటీగా పోసాని మాత్రం సంక్రాంతికి 10 రోజుల ముందే విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాడు. అంటే జనవరి 5న అన్నమాట. నాగేంద్రబాబు హీరోగా రూపొందుతున్న ఈ సినిమా పేరు ఆపదమొక్కులవాడు. రైతుల సమస్య నేపథ్యంగా ఈ సినిమా రూపొందింది. టెలివిజన్ నటి అస్మిత ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. టీవీ యాంకర్ ఉదయభాను ఈ సినిమాలో హాట్ హాట్ గా ఐటమ్ సాంగ్ లో కనిపించనుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X