»   » చిరు బర్త్‌డే: పవన్ ఫ్యాన్స్ గొడవ, వాడు రాడంటూ నాగబాబు ఫైర్

చిరు బర్త్‌డే: పవన్ ఫ్యాన్స్ గొడవ, వాడు రాడంటూ నాగబాబు ఫైర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా ఫ్యామిలీకి చెందిన ఏ కార్యక్రమం జరిగినా అక్కడ పవన్ కళ్యాణ్ కనిపించకపోతే అభిమానులు కొందరు ఆయన కోసం గోల గోల చేయడం తెలిసిందే. పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కనిపించక పోవడంతో అభిమానులు గోల చేస్తే స్వయంగా చిరంజీవే సర్దిచెప్పే ప్రయత్నం చేసారు.

తాజాగా చిరంజీవి 60వ జన్మదిన వేడుకలో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు గొడవ చేసారు. ఆయన ఎందుకు రాలేదంటూ అరిచి గీపెట్టారు. దీంతో ఓపిక నశించిన మెగా బ్రదర్ నాగబాబు....అభిమానులపై ఫైర్ అయ్యారు. ఇక్కడ అరవడం కాదు... వాడి ఇంటికెళ్లి అరవండి అంటూ మండి పడ్డారు.

Nagababu fire on Pawan Kalyan fans

‘మీరు అరవొద్దు...చాలా సార్లు ఓపిక పట్టాం. వాడు రాక పోతే మేమేం చేస్తాం? ఎన్ని సార్లు పిలిచామో ఎవరికైనా తెలుసా మీకు? ఎవరికైనా తెలుస్తుందా మీకు.... ప్రతి సారి పిలుస్తున్నాం. వాడు రావట్లేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు..ఆపండిక... వెళ్లండి..మీరు వెళ్లండి..దమ్ముంటే పవర్ స్టార్ ని అడగండి. వాడిదగ్గరకెళ్లి అరవండి. ఇక్కడ అరవడం కాదు. ప్రతి సారి వచ్చి ‘పవర్ స్టార్..పవర్ స్టార్' అని ఇక్కడ అరవడం కాదు. మీకు దమ్ముంటే, మీరు మాట్లాడగలిగితే...వాడి ఇంటికి వెళ్లండి. అక్కడికి వెళ్లి రమ్మని చెప్పండి. మేము ప్రతిసారి పిలుస్తున్నాం.. వాడు రాడు' అంటూ నాగబాబు.... పవర్ స్టార్ అంటూ గొడవ చేస్తున్న అభిమానులపై ఫైర్ అయ్యారు.

English summary
Nagababu fire on Pawan Kalyan fans.
Please Wait while comments are loading...