»   »  నాగబాబు గిఫ్ట్: నిహారిక కోసం ఖరీదైన ఆడి కారు (ఫోటోస్)

నాగబాబు గిఫ్ట్: నిహారిక కోసం ఖరీదైన ఆడి కారు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా బ్రదర్ నాగబాబు తన ముద్దుల కూతురు నిహారికకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. తన కోసం ఖరీదైన ఆడి కారు గిఫ్టుగా ఇచ్చారు. ఈ నెల 24న నిహారిక నటించిన 'ఒక మనసు' మూవీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఆమెను ఎంకరేజ్ చేస్తూ ఈ గిఫ్టు ఇచ్చాడట. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి.

సాధారణంగా తెలుగు సినిమా పరిశ్రమలో కొందరు తప్ప.... స్టార్స్ ఫ్యామిలీస్ నుండి తమ కూతుళ్లను హీరోయిన్లుగా ఇండస్ట్రీకి పంపడానికి పెద్దగా ఇష్టపడరు. అయితే నాగబాబు మాత్రం తన కూతురు నిహారికకు ఈ విషయంలో పూర్తి స్వేచ్ఛనివ్వడం, కుమారులతో పాటు కూతుర్లను కూడా ఈ విషయంలో సమానంగా చూడటంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

'ఒక మనసు' మూవీ విషయానికొస్తే...నిహారిక కొణిదెల నాగ శౌర్య జంటగా, TV 9 సమర్పణలో, మధుర ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై రామరాజు దర్శకత్వంలో మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించిన ఒక మనసు చిత్రం జూన్ 24 న విడుదలకు సిద్ధమవుతోంది.

ఇటివలే మెగా హీరోల చేతుల మీదుగా విడుదలైన పాటలకు శ్రోతలనుండి విశేష స్పందన లభిస్తోందని, సినిమా ఫస్ట్ లుక్ మొదలుకుని ఇటివలే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ వరకూ ప్రేక్షకుల నుంచి లభిస్తున్న అనూహ్యమైన స్పందన తమకెంతో ఆనందాన్ని కలిగిస్తుందని చిత్ర నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి తెలిపారు.

స్లైడ్ షోలో నిహారిక కొత్త కార్ ఫోటోస్

గిఫ్ట్

గిఫ్ట్


తండ్రి నాగబాబు నుండి ఖరీదైన ఆడి కారును గిఫ్టుగా స్వీకరిస్తున్న నిహారిక

హ్యాపీ

హ్యాపీ


తండ్రి నుండి గిఫ్ట్ అందుకుంటున్న నిహారిక మొహం సంతోషంతో వెలిగి పోయింది.

మంచి మనసు

మంచి మనసు


నాగబాబు కుమారుడితో పాటు కూతురును కూడా సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ విషయంలో సమానంగా చూడటంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ఒక మనసు

ఒక మనసు


పై రామరాజు దర్శకత్వంలో మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించిన ఒక మనసు చిత్రం జూన్ 24 న విడుదలకు సిద్ధమవుతోంది.

English summary
Actor and producer Naga Babu has presented an Audi car to his daughter Niharika who will mark her debut in Tollywood with ‘Oka Manasu.’
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu