For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జబర్దస్త్ సీక్రెట్స్ బయటపెట్టిన నాగబాబు.. రోజాతో అవసరమా అని భావించి! అనసూయపై కామెంట్స్

  |

  బుల్లితెర ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్. గత కొన్ని రోజులుగా ఇదే హాట్ టాపిక్‌గా మారింది జనాల్లో. ఈ షోపై నిత్యం వార్తలు వెల్లువెత్తుతున్నాయి. జబర్దస్త్ జడ్జ్ స్థానం నుంచి ఊహించని విధంగా నాగబాబు తప్పుకోవడంతో ఈ ఇష్యూ మరింత చర్చనీయాంశంగా మారింది. దీనిపై నాగబాబు స్పందించినప్పటికీ ఓ రేంజ్ వార్తల ప్రవాహం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి అదే నాగబాబు ఓ వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చి జబర్దస్త్ సీక్రెట్స్ బయటపెట్టడం సంచలనంగా మారింది. ఆ వివరాలు చూద్దామా..

  జబర్దస్త్ షో.. హవా అంటే వాళ్లదే మరి

  జబర్దస్త్ షో.. హవా అంటే వాళ్లదే మరి

  బుల్లితెర నవ్వుల హరివిల్లు జబర్దస్త్ కామెడీ షో. గత కొన్నేళ్లుగా బుల్లితెర ప్రేక్షకులకు వినోదాలు పంచుతూ దూసుకుపోతున్న ఈ షోలో రోజా, నాగబాబు ఇద్దరిదే హవా. జబర్దస్త్ కమెడియన్స్ వేస్తున్న పంచ్ డైలాగ్స్ ఒకెత్తయితే.. ఈ ఇద్దరి నవ్వులు మరో ఎత్తు. అలా ఈ షోలో జడ్జి స్థానంలో కూర్చొని కూడా భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నారు నాగబాబు, రోజా.

  అంతా రోజా అనుకున్నారు.. కానీ చివరకు నాగబాబు

  అంతా రోజా అనుకున్నారు.. కానీ చివరకు నాగబాబు

  ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి నాగబాబు తప్పుకోవడంతో రోజా ఒంటరైపోయింది. ముందుగా రోజానే ఈ షో నుంచి తప్పుకుంటోందని, రాజకీయాల్లో బిజీ కావడం కారణంగా ఆమె గుడ్ బై చెబుతోందని వార్తలు షికారు చేశాయి. కానీ ఎవ్వరూ ఊహించని రీతిలో నాగబాబు గుడ్ బై చెప్పడం షాకిచ్చింది. ఈ పరిస్థితుల్లో తాజాగా తన యు ట్యూబ్ ఛానెల్ ద్వారా కొన్ని జబర్దస్త్ సీక్రెట్స్ వెల్లడించారు నాగబాబు.

  అలా శ్యామ్ ప్రసాద్ రెడ్డిని కలిశా..

  అలా శ్యామ్ ప్రసాద్ రెడ్డిని కలిశా..

  తాను జబర్దస్త్ షోలో అడుగు పెట్టడానికి ప్రధాన కారణం అదుర్స్ అనే షో అన్నారు నాగబాబు. ఆ షోకి జడ్జ్‌గా ఉన్న సమయంలో ఏడుకొండలు అనే మేనేజర్ తనకు టచ్‌లో ఉండేవాడని చెప్పారు. ఆయన నుంచే నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డిని కలిసానని, అప్పటి వరకు శ్యామ్ ప్రసాద్ రెడ్డి తనకు డైరెక్ట్‌గా ఫోన్ చేయలేదని నాగబాబు అన్నారు.

  హ్యాపీగానే ఒప్పుకున్నా.. కానీ

  హ్యాపీగానే ఒప్పుకున్నా.. కానీ

  మల్లెమాల బ్యానర్ నుంచి అదుర్స్ తర్వాత జబర్దస్త్ కామెడీ షో ప్లాన్ చేస్తున్నట్లు శ్యామ్ ప్రసాద్ రెడ్డి తనతో చెప్పారని, దానికి కూడా మీరే జడ్జిగా ఉండాలని ఆయన కోరినట్లు నాగబాబు వెల్లడించారు. తాను కూడా హ్యాపీగానే ఒప్పుకున్నానని, కాకపోతే ఈ షోని ఇంత లాంగ్ టైమ్ కొనసాగించాలని శ్యామ్ ప్రసాద్ రెడ్డి కూడా భావించలేదని అన్నారు నాగబాబు.

  నచ్చితే ఎన్ని రోజులైనా ఓకే అనుకున్నా..

  నచ్చితే ఎన్ని రోజులైనా ఓకే అనుకున్నా..

  జబర్దస్త్‌ను కేవలం 25 ఎపిసోడ్స్ కోసమే ప్లాన్ చేసుకున్నారని, దానికి తనతో పాటు రోజాను జడ్జిగా ఉండాలని వారు నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు నాగబాబు. అయితే ఒకవేళ తనకు నచ్చితే 25 ఎపిసోడ్స్ ఏంటి.. ఎన్ని ఎపిసోడ్స్ చేసేందుకు తాను సిద్దమే అనుకున్నానని మెగా బ్రదర్ అన్నారు. కానీ సరిగ్గా ఆ సమయంలోనే తాను ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్ వైపు వెళ్లడం.. మరోవైపు రోజా తెలుగుదేశం నుంచి వైసీపీలో చేరడం జరిగిందని ఆయన వెల్లడించారు.

  రోజాతో అవసరమా అని భావించా.. అనసూయ యాంకరింగ్

  రోజాతో అవసరమా అని భావించా.. అనసూయ యాంకరింగ్

  రోజా, నేను ఇద్దరం ప్రత్యర్థి పార్టీల్లో ఉన్నాం కాబట్టి ఈ షోలో చేయాలా? వద్దా? అని మొదట ఆలోచించినట్లు నాగబాబు చెప్పారు. అయితే పొలిటికల్ విభేదాలు వేరు.. క్రియేటివ్ ఫీల్డ్ వేరు అని భావించి చివరకు తాను జడ్జిగా ఒప్పుకున్నట్లు ఆయన తెలిపారు. 8 ఏళ్ల కింద మొదలైన ఈ షోలో అనసూయ యాంకర్ అని, ఆమె యాంకరింగ్ అద్భుతం అని అన్నారు మెగా బ్రదర్.

  #CineBox: Tapsee Strong Counter To Reporter | Prabhas Fans Urges For #Prabhas20 Update

  అలా ఏడేళ్ల పాటు కంటిన్యూ

  అలా 25 ఎపిసోడ్స్ వస్తే.. తొలి ఎపిసోడ్‌కే బ్లాక్ బస్టర్ అయిపోయిన ఈ షో బెస్ట్ టీఆర్పీ తెచ్చి, ఏడేళ్ల పాటు కంటిన్యూ అయిందని చెప్పుకొచ్చాడు నాగబాబు. అదుర్స్ కోసం లక్షలు ఖర్చు చేసినా రాని టిఆర్పీ జబర్దస్త్ కామెడీ షోకు వచ్చిందని.. అప్పుడే తాను శ్యామ్ వాళ్ల అమ్మాయి దీప్తికి కూడా చెప్పినట్లు తెలిపారు నాగబాబు. అప్పట్లో రాకెట్ రాఘవ, రోలర్ రఘు, ధనరాజ్, చంటి, చమ్మక్ చంద్ర లాంటి వాళ్లతో మొదలైన ఈ షో సక్సెస్‌ఫుల్ జర్నీ చేస్తోందని ఆయన అన్నారు.

  English summary
  Jabardasth with tagline Katharnak Comedy Show is a popular show in Tv. The show is produced by Mallemala Entertainments and Directed by Nitin and Bharath. Nagababu says good bye for this show and now reveals some secrets of Jabardasth.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X