twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మా ఎలక్షన్ లో ఒక్క ఓటుకు పది వేలు.. మరో ఆఫర్ కూడా: షాక్ ఇచ్చిన నాగబాబు

    |

    టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మిగతా అసోసియేషన్ ఎన్నికలు చాలా కూల్ గానే జరుగుతాయి. కానీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు మాత్రం అసలైన రాజకీయాలకు తలపిస్తున్నాయి. ఎన్నికల బరిలో నిలిచిన నేతలు ఎలాగైతే విమర్శలు చేసుకుంటారో మా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న వారు కూడా అదే స్థాయిలో ఆరోపణలు చేస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. ప్రతి రోజూ ఎవరో ఒకరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లోని కొన్ని మైనస్ పాయింట్స్ ను కూడా బహిరంగంగానే చెబుతున్నారు. అయితే ఈ ఎన్నికలలో ఓటుకు నోటు కూడా కొనసాగుతోంది అని నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో అందరిని ఆశ్చర్యపరిచింది.

    లోకల్.. నాన్ లోకల్

    లోకల్.. నాన్ లోకల్

    మా ఎన్నికల హడావుడి ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒకరి తర్వాత మరొకరు ఆరోపణలు చేసుకుంటూ ఎన్నికల వాతావరణాన్ని మరింత వేడిగా మార్చేస్తున్నారు. లోకల్ నాన్ లోకల్ అనే పదం నుంచి మొదలైన ఈ ఆరోపణలు ఇప్పుడు వ్యక్తిగత విషయాల పై నిందలు వేసుకునే వరకు వచ్చింది. ఒక వైపు మంచు విష్ణు మరొకవైపు ప్రకాష్ రాజ్ మా అధ్యక్ష పదవికి పోటీకి సిద్దమైన విషయం తెలిసిందే. అయితే ప్యానెల్ లో ఉన్న సభ్యులు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉండడం అందరినీ షాక్ కు గురి చేస్తోంది.

     ఒక్క ఓటు కోసం పది వేలు

    ఒక్క ఓటు కోసం పది వేలు

    మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలుపు కోసం కొందరు అతిగా మాట్లాడుతున్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత రెండు మూడు పర్యాయాలుగా ఎన్నికల వేడి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఒకరిని మించి మరొకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఏకంగా ఓటుకు నోటు వ్యవహారం కూడా మొదలైనట్లు తెలుస్తోంది. ఒక్క ఓటు కోసం పది వేలు కూడా ఇస్తున్నారు అని నాగబాబు చేసిన వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్ గా మారింది.

    ప్రకాష్ రాజ్ ఇండియన్ యాక్టర్

    ప్రకాష్ రాజ్ ఇండియన్ యాక్టర్

    ప్రకాష్ రాజ్ కు మద్దతుగా ఉన్నటువంటి నాగబాబు ఇటీవల నిర్వహించిన మీటింగ్లో ప్రత్యర్థిగా ఉన్న వారిపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేయడం అంఅందరిని ఆశ్చర్యపరిచింది. ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడుతూ.. ఆయన లోకల్ నాన్ లోకల్ విభేదాలు చూపించడం ఏ మాత్రం కరెక్ట్ కాదని అన్నారు. ఆయన ఒక భాషకు చెందిన వారు కాదని ఏకంగా ఇండియన్ యాక్టర్ అని వివరణ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ ను తెలుగు వాడు కాదని విమర్శించే వాళ్లు సినిమాల కోసం ఆయనను ఎందుకు కావాలని అంటారని ప్రశ్నించారు.

     ఆ రెమ్యునరేషన్ వదులుకొని వచ్చారు

    ఆ రెమ్యునరేషన్ వదులుకొని వచ్చారు

    అంతేకాకుండా ప్రకాష్ రాజ్ గొప్ప వ్యక్తిత్వం గల మనిషి అంటూ ఆయన కూరలో ఉప్పు లాంటి వారిని ఒకవైపు చిన్న సినిమాలకు మరోవైపు పెద్ద సినిమాల్లో కూడా తన సహకారం అవసరం అని అన్నారు. ఇక మా ఎన్నికల్లో ప్రకాష్ పోటీ చేస్తారని తాను ఊహించలేదు అంటూ.. అసోసియేషన్ ఎన్నికల కోసం తన సినిమాలను కూడా వదులుకుని వచ్చారని నాగబాబు తెలియజేశారు. అంతేకాకుండా ఈ సినిమాకు కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకునే ప్రకాష్ రాజ్ ఆదాయాన్ని పక్కనపెట్టి మా కోసం పని చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లు వివరణ ఇచ్చారు.

    Recommended Video

    NTR Buys Fancy Number For 17 Lakhs | Lamborghini Urus || Filmibeat Telugu
    గెలిచిన తరువాత మరింత డబ్బు..

    గెలిచిన తరువాత మరింత డబ్బు..

    అంతేకాకుండా సీనియర్ నటులు కోట శ్రీనివాసరావు బాబుమోహన్ లాంటివారు ప్రకాష్ రాజ్ ఎవరు అని ప్రశ్నించడం సరైన మాటతీరు కాదని, ఆయనంటే అంత చులకన ఎందుకు అంటూ ప్రశ్నించారు. ఇక మా ఎన్నికల్లో ఓటుకు నోటు వ్యవహారం కూడా నడుస్తోంది అంటూ ఒక్క ఓటుకు పది వేల చొప్పున ఆఫర్ చేస్తున్నట్లు కూడా టాక్ వస్తోందని నాగబాబు తెలియజేశారు. అంతేకాకుండా గెలిచిన తర్వాత మరికొన్ని డబ్బులు కూడా వస్తాయని అంటున్నట్లు నాకు తెలిసిందని, మరి ఇది ఎంతవరకు నిజమో అనే విషయం కూడా తనకు తెలియదని అన్నారు. ఇక ఫైనల్ గా మా అధ్యక్షుడిగా ప్రకాష్ రాజ్ లాంటివారు ఉంటేనే 'మా' బాగుపడుతుందని వివరణ ఇచ్చారు.

    English summary
    Nagababu shocking comments on maa elections votes,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X