Don't Miss!
- Sports
Asia Cup 2023 : ఆసియా కప్ విషయంలో వాడి వేడి చర్చ.. బీసీసీఐకి పాక్ స్ట్రాంగ్ వార్నింగ్?
- Finance
SBI Q3 Result: రికార్డు లాభాలను నమోదు చేసిన స్టేట్ బ్యాంక్.. అంచనాలను తలదన్నేలా..
- News
తెలంగాణా బడ్జెట్ హైలైట్స్: బడ్జెట్లో వ్యవసాయానికి పెద్దపీట; కేసీఆర్ మార్క్ బాహుబలి బడ్జెట్ కేటాయింపులిలా!!
- Travel
ప్రపంచ స్థాయి పర్యాటక గ్రామం.. పోచంపల్లి విశేషాలు!
- Technology
బెట్టింగులు, లోన్లు అంటూ ప్రజలను వేధిస్తున్న 230 యాప్ లు బ్యాన్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
నడి రోడ్డుమీద కొట్టుకుంటూ తీసుకెళ్లాడు.. వియ్యంకుడి డేరింగ్ పై స్పందించిన నాగబాబు
మెగా బ్రదర్ నాగబాబు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కూడా ఏ విషయాన్ని చెప్పినా కూడా జనాలకు చాలా ఈజీగా ఎక్కేలా చెబుతున్నారు. అవసరం అయితే తన ఆవేశాన్ని కూడా చూపిస్తున్నారు. విమర్శలకు కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్న నాగబాబు మొదటిసారి తన వియ్యంకుడి గురించి యూ ట్యూబ్ ఛానెల్ లో మాట్లాడారు. ఆ కుటుంబం గురించి పూర్తిగా వివరణ ఇచ్చారు.

ఎలాంటి హడావుడి లేకుండా
రీసెంట్ గా చైతన్య జొన్నలగడ్డ అనే ఒక పోలీస్ ఆఫీసర్ కుమారుడితో నిహారిక నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఎలాంటి హడావుడి లేకుండా వేడుకను హైదరాబాద్ లోనే సింపుల్ గా నిర్వహించారు. ఇక పరిస్థితులు అనుకూలించిన తరువాత పెళ్లి వేడుకలను మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది.

చాలా సంతోషంగా ఉంది
ఇక వియ్యం అందుకుంటున్న గుంటూరు రేంజ్ రేంజ్ ఐజి ప్రభాకర్ రావు గురించి నాగబాబు వీడియోలో చాలా క్లియర్ గా మాట్లాడారు. ఏమన్నారంటే.. 'నా కూతురిని ప్రభాకర రావు గారి ఇంటికి కోడలిగా పంపడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఒక పోలీస్ అధికారిగా ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా సింపుల్ గా ఉండే మంచి మనసున్న మనిషి.

మా ముగ్గురి అన్నదమ్ములలో
మా ముగ్గురి అన్నదమ్ములలో ఎవరో ఒకరు ఐపీఎస్ అవ్వాలని నాన్నగారు చాలా కోరుకున్నారు. కానీ ఎవరం కూడా దాన్ని సాధించలేకపోయాం. నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి మా కుటుంబానికి ఎదో దగ్గరి సంబంధం ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే మా నాన్న కూడా పోలీస్ గా సేవలు అందించారు.
రోడ్డుపైనే కొట్టుకుంటూ..
ప్రభాకర్ రావు గారి గురించి చెప్పాలి అంటే.. ఆయన జనాలకు ఏదో ఒక విధంగా సేవలు అందించాలనే ఆలోచనలతో పోలీస్ గా మారిన మంచి మనిషి. ఇక ఆయన చాలా డేరింగ్ పర్సన్ అనే చెప్పాలి. గుంటూరులో ఒక రౌడీ షీటర్ ని నడి రోడ్డుపైనే కొట్టుకుంటూ తీసుకువెళ్లారు. అలాగే ఉగ్రవాదులను పట్టించి జాతీయా స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.
Recommended Video

ఆయన రిటైర్డ్ కాబోతున్నారు
1990లోనే పోలీస్ సర్వీస్ లో చేరిన ఆయన ఫ్యాక్షనిజం వల్ల వచ్చే నష్టాలపై ప్రజల్లో ఒక అవగాహన కల్పించారు. ఇక అలాంటి గొప్ప ఆఫీసర్ ఈ నెల 31న రిటైర్డ్ కాబోతున్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రావుగారికి అభినందనలు తెలియజేస్తున్నాను' అని నాగబాబు మాట్లాడారు.