twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాంగోపాల్ వర్మపై నాగబాబు షాకింగ్ ట్వీట్: అందరూ గుర్తించాలంటూ దర్శకుడి రిప్లై

    |

    కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోన్న అంశాల్లో సినిమా టికెట్ రేట్ల వివాదం ఒకటి. వినోదాన్ని ప్రేక్షకులకు తక్కువ ధరకు అందించాలన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టికెట్ రేట్లను భారీ స్థాయిలో తగ్గించేసింది. దీంతో థియేటర్లలో కరెంట్ బిల్లులు కూడా కట్టుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కారణంగా చాలా చోట్ల సినిమా హాళ్లను స్వచ్చందంగా మూసి వేశారు. అప్పటి నుంచి ఈ వివాదం చిలికి చిలికి గాలి వానలా మారుతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ దీనిపై స్పందిస్తూ.. ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా మెగా బ్రదర్ నాగబాబు.. ఆర్జీవీపై ఊహించని ట్వీట్ చేశారు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

    అలా మొదలైన టికెట్ రేట్ల వివాదం

    అలా మొదలైన టికెట్ రేట్ల వివాదం

    ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజలందరికీ వినోదాన్ని తక్కువ ధరలకే అందించాలనే లక్ష్యంతో.. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తూ జీవో నెంబర్ 35ను తీసుకొచ్చింది. ఆ తర్వాత కొందరు కోర్టుకు వెళ్లడం.. ఆ తర్వాత థియేటర్ యాజమాన్యాలు జాయింట్ కలెక్టర్ల పర్మీషన్ తీసుకోవాలని తీర్పు రావడం జరిగాయి. అప్పటి నుంచి హాళ్లపై దాడులు వంటి వాటితో వివాదం పెరిగింది.

    Pushpa మూవీపై మహేశ్ బాబు రివ్యూ: అల్లు అర్జున్‌పై ఊహించని విధంగా.. రష్మికకు మాత్రం షాకే!Pushpa మూవీపై మహేశ్ బాబు రివ్యూ: అల్లు అర్జున్‌పై ఊహించని విధంగా.. రష్మికకు మాత్రం షాకే!

    వెనక్కి తగ్గిన ప్రభుత్వం... మరోసారి

    వెనక్కి తగ్గిన ప్రభుత్వం... మరోసారి


    ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో అధికారులు పలు కారణాలు చూపించి 83 థియేటర్లను సీజ్ చేసిన విషయం తెలిసిందే. సుదీర్ఘ చర్చల తర్వాత ఆ 83 థియేటర్లను పున: ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, నాలుగు వారాల్లోగా ఆ థియేటర్ల యాజామాన్యాలు లైసెన్సులు రెన్యూవల్ చేసుకోవాలని సూచించింది. ఈ విషయంలో మాత్రమే వెనక్కి తగ్గింది.

    రాంగోపాల్ వర్మ ఎంట్రీ.. విమర్శలు

    రాంగోపాల్ వర్మ ఎంట్రీ.. విమర్శలు

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలో నెలకొన్న టికెట్ ధరల వివాదంపై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇటీవల స్పందించాడు. తాజాగా ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడిన ఆయన.. 'ఏదైనా ఓ వస్తువును ఉత్పత్తిదారుడు ఉత్పత్తి చేస్తే.. దాని ఎమ్మెర్పీ నిర్ణయించే అధికారం వారికే ఉంటుంది. దానిని కొనాలా? వద్దా? అనేది వినియోగదారుడు ఇష్టం మాత్రమే' అంటూ విమర్శలు గుప్పించాడు.

    Radhe Shyam విడుదలపై సెన్సేషనల్ న్యూస్ లీక్: వచ్చేది జనవరి 14న కాదు.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!Radhe Shyam విడుదలపై సెన్సేషనల్ న్యూస్ లీక్: వచ్చేది జనవరి 14న కాదు.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!

    వరుస ట్వీట్లు.. పది ప్రశ్నలతో రచ్చ

    వరుస ట్వీట్లు.. పది ప్రశ్నలతో రచ్చ

    రాంగోపాల్ వర్మ చేసిన కామెంట్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. అప్పటి నుంచి ఆయన దీనిపై మరింతగా స్పందిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాటోగ్రఫి మంత్రితో పాటు పలువురు మినిష్టర్లు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ప్రస్తావిస్తూ వరుస ట్వీట్లు చేస్తున్నాడు. అంతేకాదు, ప్రభుత్వానికి పది ప్రశ్నలు వేసి సమాధానం చెప్పాలని కోరాడు.

    రాంగోపాల్ వర్మకు నాగబాబు సపోర్ట్

    రాంగోపాల్ వర్మకు నాగబాబు సపోర్ట్

    టికెట్ ధరల వివాదంపై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరును వ్యతిరేకిస్తూ తన గళాన్ని వినిపిస్తున్న రాంగోపాల్ వర్మకు మెగా బ్రదర్ నాగబాబు మద్దతు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో 'మీరు చెప్పింది పూర్తిగా నిజం. నా నోటి నుంచి ఏ ప్రశ్నలనైతే అడగాలని అనుకున్నానో.. అవే మీరు అడిగారు' అంటూ తొలిసారి వర్మకు సపోర్ట్ చేస్తూ మాట్లాడారు నాగబాబు.

    అరాచకమైన ఫొటోలను వదిలిన యాంకర్ వర్షిణి: తొలిసారి ఇంత హాట్‌గా.. వామ్మో చూస్తే తట్టుకోలేరుఅరాచకమైన ఫొటోలను వదిలిన యాంకర్ వర్షిణి: తొలిసారి ఇంత హాట్‌గా.. వామ్మో చూస్తే తట్టుకోలేరు

    Recommended Video

    RGV - Judicial Process లో ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళే జడ్జ్ అవడం తప్పు | Filmibeat Telugu
    నాగబాబుకు వర్మ ఊహించని రిప్లై

    నాగబాబుకు వర్మ ఊహించని రిప్లై

    తనకు మద్దతు తెలుపుతూ నాగబాబు చేసిన ట్వీట్‌కు రాంగోపాల్ వర్మ సైతం స్పందించాడు. ఈ మేరకు తన ట్విట్టర్‌లో 'థ్యాంక్యూ నాగబాబు గారూ.. మీకు లాగే మన ఇండస్ట్రీలోని చాలా మంది ఈ వివాదాన్ని గుర్తిస్తారని భావిస్తున్నాను' అంటూ రిప్లై ఇచ్చాడు. ఇక, వీళ్లిద్దరి మధ్య జరిగిన చర్చకు చాలా మంది నెటిజన్లు కూడా మద్దతు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు.

    English summary
    Sensational Director Ram Gopal Varma Respoded on Andhra Pradesh Ticket Prices Issue. And Also He Did Setires on AP Govt. Now Nagababu Supports Him.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X