twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘శివకృష్ణ’గా నాగచైతన్య వండర్

    By Srikanya
    |

    రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం బెజవాడలో నాగచైతన్య హీరోగా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో నాగచైతన్య పేరు 'శివకృష్ణ".ఇక 'ఈ బెజవాడ నాది రా...'అంటూ ప్రత్యర్థిని హెచ్చరిస్తాడు ఓ విద్యార్థి. అసలు ఆ నగరంపై ఆధిపత్యం కోసం ఎవరు ప్రయత్నించారు? వాళ్లని ఆ యువకుడు ఎలా నిలువరించాడో అనేదే చిత్ర కథ అంటున్నారు రామ్‌గోపాల్‌ వర్మ. ఆయన కిరణ్‌కుమార్‌ కోనేరుతో కలిసి నిర్మించిన చిత్రం 'బెజవాడ'.అలాగే నాగచైతన్య పాత్రను డైనమిక్‌గా మలిచాడు వివేక్. ఇందులో ప్రతి సన్నివేశం నిజానికి దగ్గరగా అనిపిస్తుంది. ఒక ఆడియన్‌గా ఈ సినిమా గురించి చెప్పాల్సివస్తే 'వండర్" అని చెబుతాను అంటున్నారు రామ్‌గోపాల్‌వర్మ.అలాగే పరిసరాలు, పరిస్థితులు మనుషుల్ని ఎలా ప్రభావితం చేస్తాయి అనేది చూపించడమే 'బెజవాడ" చిత్రం. అంతేకానీ... బెజవాడనగర గత అనుభవాలకు, ఈ కథకు ఏమాత్రం సంబంధం ఉండదు అన్నారు.

    నాగచైతన్య, అమలాపాల్‌ జంటగా నటించిన ఈ చిత్రానికి వివేక్‌కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ నెల 24న 'బెజవాడ'విడుదల చేస్తున్నారు. శనివారం పాటలు విడుదలయ్యాయి.ఇక నిర్మాత మాట్లాడుతూ..విజయవాడలోని వర్గ రాజకీయాల నేపథ్యంలో సాగే సినిమా అనే ప్రచారం జరుగుతోంది. సినిమా కథకీ వాటికీ ఎలాంటి సంబంధం ఉండదు అన్నారు నిర్మాత. ఈ చిత్రంలో ప్రభు, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అజయ్‌, ఎమ్మెస్‌ నారాయణ, ఆహుతి ప్రసాద్‌, భరత్‌, ముకుల్‌దేవ్‌, శుభలేఖ సుధాకర్‌, అంజనా సుఖాని, రూపాకౌర్‌ తదితరులు నటించారు. సంగీతం: అమర్‌ మోహ్లే, బప్పి టూటుల్‌, ప్రదీప్‌ కోనేరు,ప్రేమ్‌, పాటలు: సిరాశ్రీ, రెహమాన్‌, కలువ సాయి.

    English summary
    Naga Chaitanya, Amala Paul combination Bejawada movie is going to release on November 24.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X