»   »  నాగచైతన్య, శ్రుతిహాసన్ ‘ప్రేమం’ రీమేక్ (అఫీషియల్ డీటేల్స్)

నాగచైతన్య, శ్రుతిహాసన్ ‘ప్రేమం’ రీమేక్ (అఫీషియల్ డీటేల్స్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని నాగచైతన్య, శ్రుతిహాసన్ ల తొలి కాంబినేషన్.. 'కార్తికేయ' వంటి ఘన విజయం సాధించిన చిత్ర దర్శకుడు 'చందు మొండేటి.. మళయాళ సీమలో పెద్ద విజయం సాధించిన చిత్రం 'ప్రేమం' ఇలాంటి గొప్ప కలయికలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ.

ఈ చిత్రానికి సంభందించిన అధికారిక ప్రకటన విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ..'అక్కినేని నాగచైతన్య, శ్రుతిహాసన్, చందు మొండేటి ల కాంబినేషన్ లో మలయాళం' లో ఘన విజయం సాధించిన 'ప్ర్తేమం' చిత్రాన్ని తెలుగు‌లో పునర్నిర్మించటం ఆనందంగా ఉంది. 'సితార ఎంటర్ టైన్ మెంట్స్' పతాకం పై నిర్మిస్తున్న తొలి చిత్రమిది. ఈ నెలలోనే చిత్రం పూజా కార్యక్రమాలు జరుగుతాయి. డిసెంబర్ నెలలో చిత్రం రెగ్యులర్ షూటింగ్ విశాఖలో ప్రారంభమవుతుంది. సమ్మర్ స్పెషల్ గా చిత్రం విడుదల అయ్యే దిశగా నిర్మాణ కార్యక్రమాలకు రూపకల్పన జరుగుతోందని ఆయన తెలిపారు.

Nagachaitanya and Shriti Haasan

'ప్రేమం' ఓ స్వచ్చ మైనప్రేమకధ. 'ప్రేమ తో కూడిన సంగీత భరిత వినోద దృశ్య కావ్యం ఈ చిత్రం.అక్కినేని నాగచైతన్య సరసన శ్రుతిహాసన్ తో పాటు మరో ఇద్దరు కధానాయికలు కూడా నటిస్తున్నారు. వారిలో ఒకరు 'అనుపమ పరమేశ్వరన్' కాగా మరో కధానాయిక ఎంపిక కావలసి ఉంది. మాతృకను మించి తెలుగు లో ఈ చిత్రం మంచి విజయం సాధించేలా దర్శకుడు 'చందు మొండేటి' రూప కల్పన చేస్తున్నారు అని ఆయన తెలిపారు.

దర్శకుడు 'చందు మొండేటి' మాట్లాడుతూ..'అక్కినేని నాగచైతన్య హీరోగా, సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని రూపొందించటం ఎంతో ఆనందంగా ఉంది. 'ప్రేమం' చిత్రాన్ని తెలుగులో రూపొందించటం అన్నది భాద్యత తో కూడినది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మా టీం ఈ చిత్రం రూపకల్పన కు కృషి చేస్తోంది అని తెలిపారు దర్శకుడు.

ఈ చిత్రానికి సంగీతం; రాజేష్ మురుగేషన్, గోపిసుందర్; చాయా గ్రహణం: కార్తీక్ ఘట్టమనేని: ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు; ఆర్ట్: సాహి సురేష్; ఒరిజినల్ స్టోరి: ఆల్ఫోన్సె పుధరిన్; సమర్పణ: పి.డి.వి. ప్రసాద్ నిర్మాత: సూర్యదేవర నాగవంశి స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: చందు మొండేటి.

English summary
'Akkineni NagaChaitanya' teams up with 'Srithi Haasan' and Chandu Mondeti for 'Sithara Entertainments Production No.1', which's produced by Suryadevara NagaVamsi. The film is based on the Malayalam Super Hit 'Premam'. And Shriti Haasan teams up with NagaChaitanya first time. And the producer NagaVamsee is on cloud nine being produced this film.
Please Wait while comments are loading...