twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జీవిత రాజశేఖర్ కు షాక్.. అరెస్ట్ వారెంట్ జారీ.. ఏమైందంటే?

    |

    సినీ నటి, దర్శకురాలు జీవిత మళ్లీ చిక్కుల్లో పడ్డారు. జీవితాలు నిత్యం ఏదో ఒక వివాదంతో వార్త‌ల‌లో నిలుస్తూనే ఉంటారు. తాజాగా జీవితా రాజశేఖర్ పై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయిందని తెలుస్తోంది. నగరి కోర్టు శుక్రవారం ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. జ్యోస్టర్‌ ఎండీ హేమ జీవితపై చెక్‌ బౌన్స్ కేసులో నగరి కోర్ట్ ని ఆశ్రయించారన్న సంగతి తెలిసిందే. తమ దగ్గర తీసుకున్న రూ. 26కోట్లు ఎగ్గొట్టారని హేమ తన ఫిర్యాదులో పేర్కొంది. ఒకే ఆస్తిని ఇద్దరికి విక్రయించారనే ఆరోపణలు జీవితా రాజశేఖర్‌పై ఆమె చేశారు. అదే కేసులో ఇప్పుడు నగరి కోర్టు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. జ్యోస్ట‌ర్ సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ హేమ చెక్ బౌన్స్ కేసులో నగరి కోర్టుని ఆశ్ర‌యించిన క్రమంలోనే ఈ ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.

    తిరుపతి జిల్లా విజయపురం మండలానికి చెందిన సాయిశక్తి ఇంజనీరింగ్‌ కళాశాల నిర్వాహకుడు కోటీశ్వరరాజు భార్య హేమరాజా 'గరుడవేగ' చిత్ర నిర్మాణం కోసం జీవితకు రెండుదఫాలుగా రూ.26 కోట్లు ఇచ్చారని, దీనికి గాను చెన్నై పూనమల్లి వద్ద ఉన్న మూడెకరాల స్థలాన్ని తాకట్టు ఉంచడంతోపాటు చెక్కులు ఇచ్చారని గతంలోనే మీడియా ముందుకు వచ్చి వెల్లడించారు. జీవిత ఇచ్చిన చెక్స్ అన్నీ బౌన్స్ అయ్యాయ‌ని, అందుకే ఆమెపై కేసు పెట్టాల్సి వచ్చిందని హేమ తాజాగా వేసిన పిటిషన్ లో పేర్కొంది. ఈ నేప‌థ్యంలో చెక్ బౌన్స్ కేసుని ప‌రిశీలించిన న‌గ‌రి న్యాయ‌స్థానం జీవిత‌కు జారీ అయిన 4 వారెంట్లను పట్టించుకోకుండా కోర్టుకు హాజరు కాకపోవడంతో ఎన్‌ఐ యాక్ట్‌ కింద కోర్టు రెండు నెలల క్రితమే అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేశారు.

    Nagari court issues arrest warrant to jeevitha rajasekhar

    ఇక ఈ వారెంట్‌పై జీవిత రీకాల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కానీ తాజాగా ఆ పిటిషన్ ను కూడా కోర్టు తిరస్కరించింది. తదుపరి విచారణకు కనుక జీవిత ఒకవేళ కోర్టులో హాజరు కాని పక్షంలో ఆమెను అరెస్ట్ చేయాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఇక మరోపక్క తాము ఎలాంటి తప్పు చేయలేదని, అవన్ని తప్పుడు ఆరోపణలని గతంలోనే జీవిత మీడియా ముఖంగా స్పష్టం చేసింది. ఇప్పుడు తాజా కోర్టు ఆదేశాల మీద ఆమె ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.

    English summary
    again Nagari court issues arrest warrant to jeevitha rajasekhar in jyostar check bounce case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X