twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగ్ 'కులం తక్కువ బాడకోవ్‌' (సెన్సార్)

    By Srikanya
    |

    Rajanna
    అక్కినేని నాగార్జున టైటిల్‌ రోల్‌ పోషించి నిర్మించిన 'రాజన్న' చిత్రం అన్నపూర్ణా స్టూడియోస్‌ పతాకాన రూపొందింది. వి. విజయేంద్ర ప్రసాద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో స్నేహ, శ్వేతామీనన్‌, ప్రదీప్‌ రావత్‌, అజయ్‌, నాజర్‌, ముఖేష్‌ రుషి బేబి యేని ముఖ్య పాత్రలు పోషించారు.

    అయిదుగురు సభ్యులతో కూడిన 'ఇసి' ఈ చిత్రాన్ని చూసి 13 కట్స్‌తో

    19.12.2011న 'యుఎ' సర్టిఫికెట్‌ జారీ చేసింది.

    1. సినిమాలో రక్తంకి సంబంధించి ఏ విధమైన దృశ్యం ఎక్కడ వున్నా వాటిని తొలగించి అంగీకరింపబడిన వేరే దృశ్యాలు అంతే నిడివితో జతపరచడానికి అంగీకరించారు.

    2. సినిమాలో కత్తిగాని మరో ఆయుధం గాని శరీరంలో గుచ్చుకుని వెనుక భాగంలోకి దూసుకు వెళ్ళిన దృశ్యాలు ఎక్కడ వున్నా వాటిని తొలగించి అంతే నిడివిగల అనుమతి పొందిన వేరే దృశ్యాలను జత చేయడానికి అంగీకరించారు.

    ఒకటి, రెండు రీళ్లలో :

    3. 'నీ యబ్బా దొంగ లవ్డీముండా' డైలాగ్‌లోని ''నీయబ్బా, లవ్డీ ముండా'' తొలగించి, సినిమాలో యెక్కడ 'నీ యబ్బా' అని వున్నా ఆ పదం తొలగించమన్నారు. (పై వాక్యానికి బదులుగా అనుమతి పొందిన ''గింత లెక్కలోన బిడ్డ నేడ దాస్తివ్‌'' వాక్యాన్ని జత చేయడానికి అంగీకరించారు.

    4. ఎ). 'కులం తక్కువ బాడకోవ్‌' లోని 'బాడకోవ్‌' పదం తొలగించారు. ఇందుకు బదులుగా ''బట్టేబాజ్‌ ఇజ్జత్‌ లేని'' పదాలు పెట్టడానికి అనుమతించారు.
    బి). 'పోరి లంజా' లోని ''లంజా'' పదం తొలగింపుకు గురైంది.

    మూడు,నాలుగు రీళ్లలో :

    5. ఎ). కాలుతున్న ఇంటిలో బాలిక బాధపడే దృశ్యాల నిడివి తగ్గించమనగా అనుమతి పొందిన అంతే నిడివిగల వేరే దృశ్యాల్ని జత చేసారు.
    బి). 'దొంగ లవ్డీకొడకా'' అనడాన్ని తొలగించారు.

    6. అయిదు, ఆరు రీళ్లలో చిత్రీకరించిన సన్నివేశంలో ''రెండు వందల సంవత్సరాలుగా మేము వుంచుకున్న దానికి పుట్టిన వాళ్లలా'' అని చిత్రీకరించిన డైలాగ్‌లోని ''వుంచుకున్న దానికి'' అనే పదాలు తొలగింపుకు గురైయ్యాయి.

    ఏడు, ఎనిమిది రీళ్ళలో

    7.''ఆడవాళ్లకి మస్తు ఆస్తి వుంది'' అంటూ చేతితో సైగ చేయడం తొలగించడంతో అందుకు బదులుగా అనుమతి పొందిన అంతే నిడివిగల వేరే దృశ్యాన్ని జత చేసారు.

    తొమ్మిది, పది రీళ్లలోని

    8. ''జాతి తక్కువ కొడుకులు'' పదాలు కత్తిరింపుకు గురి కావడంతో అనుమతి పొందిన ''కూటికి గతిలేని'' పదాల్ని జత చేయడానికి అంగీకరించారు.

    పదకొండు, పన్నెండు రీళ్ళలో :

    9. ''జెండాని ముక్కలు ముక్కలుగా నరికేయండి'' అనే వాక్యంలోని 'జెండా'ని తొలగించారు.
    10. తెల్లని నక్షత్రం గల ఆకు పచ్చని జెండా తగులబడే దృశ్యాన్ని తొలగించడంతో అనుమతి పొందిన అంతే నిడివిగల వేరే దృశ్యం ఉంచారు.

    పదమూడు, పద్నాలుగు రీళ్ళలో
    11.జెండా కర్రని కత్తితో నరకడం, అప్పుడు జెండా సగం ఎగిరినట్లుగా కనిపించడం అనేది సినిమాలో ఎక్కడ వున్నా తొలగించడంతో అనుమతి పొందిన అంతే నిడివి గల వేరే దృశ్యాల్ని వుంచారు. 3644.84 మీటర్ల నిడివిగల 'రాజన్న' 22-12-2011న విడుదలైంది.

    English summary
    Nagarjuna's Rajanna Gets U/A Certificate And Released On December 22nd.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X