»   » అందుకే అఖిల్ 'మనం' లో నటించటం లేదు :నాగార్జున

అందుకే అఖిల్ 'మనం' లో నటించటం లేదు :నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో కుటుంబం మొత్తం కలసి నటించడం ఇప్పటివరకు రాజ్‌కపూర్‌ కుటుంబానికే దక్కింది. 'మనం' చిత్రం ద్వారా మాకు ఆ అవకాశం వచ్చింది. ఇందులో అఖిల్‌ కూడా నటిస్తే బాగుణ్ను అని అందరూ అంటున్నారు. అఖిల్‌ని మొదట హీరోగా చూసి.. తర్వాత మల్టీస్టారర్‌, కుటుంబ చిత్రాలు చేయాలన్నదే నా ఆలోచన..అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలైన అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినే నాగచైతన్య ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న 'మనం' చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో అఖిల్ చేస్తాడన్న రూమర్స్ ని ఇలా ఖండించారు నాగార్జున.

అలాగే ఇంకా నేను ఎన్ని సంవత్సరాలు కథానాయకుడిగా చేస్తానో తెలియదు. అందుకే అందరినీ అలరించే మంచి పాత్రలు చేయాలనుకుంటున్నాను. సందేశాత్మక చిత్రాలు చేయాలని నాకూ ఉంది. ఇటీవల జరిగిన ఉత్తరాంచల్‌ ఘటన చూసి పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో ఓ సినిమా చేయాలనుకుంటున్నాను' అంటున్నారు నాగార్జున


'మాఫియాకి గ్రామర్‌ నేర్పింది నేనే. గ్లామర్‌ తెచ్చింది నేనే' అంటున్నారు నాగార్జున. ఆయన హీరోగా రూపొందిన 'భాయ్‌' చిత్రంలోని డైలాగ్‌ ఇది. రిచా గంగోపాధ్యాయ హీరోయిన్ . వీరభద్రమ్‌ చౌదరి దర్శకుడు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. అన్నపూర్ణ స్టుడియోస్‌ పేరుతో వెబ్‌సైట్‌, సామాజిక అనుసంధాన వేదికల్లో పేజీలను కూడా ప్రారంభించారు.

నాగార్జున మాట్లాడుతూ... ''నేను యాక్షన్‌ తరహా సినిమాలు చేసి చాలా కాలమవుతోంది. అలాగని వినోదంపాళ్లు తక్కువవడం నాకిష్టం లేదు. అందుకే 'భాయ్‌' సినిమా చేశాను. ప్రేక్షకులు నానుంచి ఆశించే అన్ని రకాల అంశాలు ఇందులో ఉంటాయి. ఇందులో నేను మూడు షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపిస్తాను. వచ్చే నెల మొదటి వారంలో పాటల్ని విడుదల చేస్తాం. అదే నెలలో సినిమాని తీసుకురావాలన్నదే మా ఆలోచన. అయితే రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడి అందరూ ఆనందంగా ఉన్నప్పుడే 'భాయ్‌' వస్తాడు'' అన్నారు.


అలాగే ... 'నాకు రేసింగ్‌ అంటే ఇష్టం. అందుకే ఓ రేసింగ్‌ జట్టును కొనుగోలు చేశాను. ఇప్పటికే 10 రేసులు పూర్తయ్యాయి. నవంబర్‌ నెలలో ఇంకో రేస్‌ జరగబోతోంది. అందులోనూ మంచి ఫలితం వస్తుందనే నమ్మకం ఉంది. నా చిన్నప్పుడు మా ఇంట్లో వాళ్లు బ్యాడ్మింటన్‌ ఆడుతుంటే చూసే వాడిని. అలా దానిపై ఇష్టం పెరిగింది. అందుకే ఇండియన్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌లో గవాస్కర్‌తో కలసి ఓ టీమ్‌ కొనుగోలు చేశాను. గోపీచంద్‌ అకాడమీలో మెరికల్లాంటి ఆటగాళ్లు తయారవుతున్నారు. సింధు కూడా మంచి విజయాలు సాధిస్తోంది. దేశంలో క్రికెట్‌ తర్వాత బ్యాడ్మింటన్‌ ఇప్పుడు మంచి స్థానంలోకి వస్తోంది' అన్నారు నాగార్జున.

English summary
Nagarjuna confirmed that Akil is not act in Manam film. Akkineni's family multi-starter movie "Manam" completed its first scheduled. ANR, Nagarjuna and Naga Chaitanya, are playing the lead roles. Shriya Saran and Samantha have been roped in as the heroines opposite to Nagarjuna and Naga Chaitanya. 'Ishq' Fame Vikram Kumar is directing the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu