»   » ఏఎన్ఆర్ ఆరోగ్యపరిస్థితిపై నాగార్జున వివరణ

ఏఎన్ఆర్ ఆరోగ్యపరిస్థితిపై నాగార్జున వివరణ

Posted By:
Subscribe to Filmibeat Telugu
Nagarjuna about ANR health
హైదరాబాద్: అక్కినేని నాగేశ్వరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ ఈ రోజు ఉదయం మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే క్యాన్సర్ వ్యాధి బారిన పడటంతో ఏఎన్ఆర్ సర్జరీ చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ వార్తలు అభిమానులను కంగారుపెట్టాయి.

మీడియాలో వచ్చిన వార్తలు విని కంగారు పడాల్సిన అవసరం లేదని, నాన్నగారు ఆరోగ్యంగా ఉన్నారని, బాగా కోలుకున్నారని, అన్ని విషయాలు బాగా మాట్లాడుతున్నారని, ఇప్పుడే ఆయన్ను కలిసొచ్చానని నాగార్జున వివరణ ఇచ్చారు. మరో వైపు ఏఎన్ఆర్ మనవడు, హీరో సుమంత్ కూడా ఈ విషయమై స్పందిస్తూ.....తాతగారి ఆరోగ్యం విషమించిందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు.

ఈ వార్తలు ఎలా ప్రచారంలోకి వచ్చాయంటే...రెండురోజుల క్రితం బాగా నీరసపడి అస్వస్థతకు గురికావడంతో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికే ప్రముఖ కార్పొరేట్‌ ఆసుపత్రి వైద్యులు వచ్చి వైద్యం అందిస్తున్నారు. ఆయన కుమారుడైన సినీహీరో అక్కినేని నాగార్జున, ఇతర కుటుంబ సభ్యులు రోజూ నాగేశ్వరరావు ఇంటికి వచ్చి, కొన్ని గంటలపాటు అక్కడే ఉండి వెళుతున్నారు. ఈ క్రమంలోనే ఈ వార్తలు ప్రచారంలోకి వచ్చినట్లు తెలుస్తోంది.

కొన్ని రోజుల క్రితం నాగేశ్వరరావు శరీరంలో క్యాన్సర్ కణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని అక్కినేని స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని, ఈ రోజుల్లో క్యాన్సర్ అనేది సాధారణ జబ్బే, పైగా వృద్ధాప్యంలో రావడం ఆనందించ దగ్గ విషయమే, ఈ వయసులో క్యాన్సర్ కణాల వ్యాప్తి నెమ్మదిగా ఉంటుందని నాగేశ్వరరావు తెలిపారు.

English summary
The Akkineni Family has responded to the rumours circulating in Hyderabad. PRO B.A. Raju released this statement via his Twitter account on behalf of Nagarjuna. "Nanna garu baga kolukunnaru. Anni vishyala gurinchi baga matladthunnaru. Ippude kalisocha" – Nagarjuna.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu