»   »  'తుఫాన్' పరిస్థితి చూసి డిసైడ్ చేస్తా : నాగార్జున

'తుఫాన్' పరిస్థితి చూసి డిసైడ్ చేస్తా : నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రేపు 'తుఫాన్' వచ్చాక పరిస్థితి చూసి, అప్పుడు డిసైడ్ చేద్దామనుకుంటున్నాం. ఆడియో ఫంక్షన్ ఎప్పుడనేది ఇంకా అనుకోలేదు. ముందు రిలీజ్ అనుకుంటే ఆడియో చేయొచ్చు. ఎందుకంటే ఇవాళ సీమాంధ్రలో మార్నింగ్ షో, మ్యాట్నీ చాలా చోట్ల పడటం లేదు. ఫస్ట్ షో, సెకండ్ షోనే పడుతున్నాయి. ఇప్పటి పరిస్థితుల్లో రోజుకు రెండు షోల చొప్పున పోయాయంటే చాలా లాస్. సినిమాలు విడుదల కాని పరిస్థితుల్లో నిర్మాతలే కాదు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. సినిమా రెడీ అయ్యి, ప్రింట్లు తయారై, క్యూబ్‌లు, యు.ఎఫ్.ఓలకు ఎక్కేశాక ఆగాయంటే ఎంత నష్టం. ఎక్కడ లీకవుతాయోనని అన్నిట్నీ వెనక్కి తెప్పించుకోవాలి. థియేటర్లు కూడా ఖాళీగా ఉంటున్నాయి. రెంట్ కట్టాల్సిందేగా. డిస్ట్రిబ్యూటర్లు అడ్వాన్సులు ఇచ్చుంటారు. ఇలా ఏ రకంగా చూసినా నష్టమే అంటూ నాగార్జున తన భాయ్ చిత్రం ఆడియో గురించి అడిగితే చెప్పుకొచ్చారు.


మూడు దశల్లో తన పాత్ర 'భాయ్' లో ఉంటుందని చెప్తూ... 'భాయ్'లో నాది మూడు దశల పాత్ర. ఫారిన్‌లో డాన్‌గా ఉండేదొకటి. అతను హైదరాబాద్‌లోని తన పాతబస్తీకొచ్చి అక్కడి తన పాత మిత్రుల్ని కలుసుకుని సరదాగా ఉండేదొకటి. తనకు దూరమైన కుటుంబాన్ని తిరిగి ఎలా కలవాలని తాపత్రయపడేది ఇంకొకటి. ఇలా మూడు ఫేజులుంటాయి. అయితే ఎక్కువగా స్క్రీన్‌ప్లే మీద, ఎంటర్‌టైన్‌మెంట్ మీద ఆధారపడిన సబ్జెక్టు. 'భాయ్' అని పేరు పెట్టాం కానీ వయొలెన్స్ మీద దృష్టి పెట్టలేదు. స్టయిలిష్ యాక్షన్ ఉంటుంది. ఎక్కడా కళ్లు మూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఫ్యామిలీతో కలిసి హాయిగా ఎంజాయ్ చేసేట్లు ఉంటుంది. పంచ్ డైలాగ్స్ ఉంటాయి. అన్ని పాత్రలూ వినోదాన్ని పంచేవే అన్నారు.

నాగార్జున ఈ చిత్రం గురించి మాట్లాడుతూ....భాయ్ చిత్రం సీరియస్‌గా వుండే దావుద్ ఇబ్రహీం లాంటి కథ అని భావిస్తున్నారని, కానీ పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ చిత్రం ఉంటుందని ఆయన వివరించారు. అలాగే'భాయ్' పేరుతో వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి నిజమే, కాని అది మాఫియా నేపథ్యం కాదు. 'హలో బ్రదర్' సినిమా తరహాలో పూర్తి వినోదాత్మకంగా వుంటుంది. ఇందులో నా పాత్ర 'కింగ్'లో బొట్టు శ్రీనులా వినోదాన్ని పంచుతుంది అన్నారు.


దర్శకుడు వీరభద్రమ్ చౌదరి చిత్ర విశేషాలు తెలియజేస్తూ 'రెండున్నర గంటలు కడుపుబ్బా నవ్వించే చక్కటి హాస్య చిత్రమిది. 'హలో బ్రదర్' తరహాలో నాగార్జున పాత్ర చిత్రణ వుంటుంది. ఇందులో నాగార్జున మాఫియా డాన్ పాత్రను చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. అసలు మాఫియా అనే అంశమే ఈ చిత్రంలో వుండదు. నాగార్జున సంభాషణలు, మేనరిజమ్స్ సరికొత్త పంథాలో వుంటాయి. ఆయన అభిమానుల్ని అలరించే అంశాలన్నీ 'భాయ్'లో వున్నాయి' అన్నారు.

English summary
Nagarjuna’s ‘Bhai’ is getting ready for release. The movie has completed about of its shoot. Bhai has been shot in over 15 exotic locales in Bangkok, Europe and India. Also starring Richa Gangopadhyay, Sonu Sood, Rahul Dev, Mukul Dev, Ashish Vidyarthi, Brahmanandam, Jayprakash, Hamsa Nandhini and Nathalia Kaur, the film is expected in theatres next month. "We are as excited as numerous of movie goers and my fans who viewed the first trailer of the film are pouring in their compliments, comments and eagerness to watch the film. The trailer, which reveals the stylish look along with a rocking one minute title song of the film, continues to attract views," Nagarjuna said in a statement. Produced under the banner Annapurna Productions the movie is currently under post production. Veerabhadram Choudry has directed the film and the music is by Devi Sri Prasad.
Please Wait while comments are loading...