»   »  నాగచైతన్య ప్రవర్తన కూడా మారుతుంది : నాగార్జున

నాగచైతన్య ప్రవర్తన కూడా మారుతుంది : నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నాగచైతన్య ప్రవర్తన విషయానికొస్తే అందరితో తొందరగా కలవడు. నేను కూడా మొదట ఇలాగే రిజర్వ్‌డ్‌గా ఉండేవాడిని. ఆ తర్వాత మారాను. తను కూడా మారతాడు అంటున్నారు నాగార్జున. ఆయన హీరోగా తెరకెక్కిన 'భాయ్‌' ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నాగచైతన్యని దగ్గర్నుంచి చూస్తున్నాను కదా.. తన నటన గురించి చెప్పాలంటే...మేము ముగ్గురం సినిమా కోసం మద్యం తాగే సన్నివేశంలో నటించాం. నేను, నాన్న గతంలో ఇలాంటి సన్నివేశాల్లో నటించిన వాళ్లమే. నాగచైతన్య ఏమైనా బెదురుతాడేమో అనుకున్నా కానీ బాగా చేశాడు అని అన్నారు.

'భాయ్‌' ఎలా ఉంటాడో చెప్తూ... 'భాయ్‌' అంటే యాక్షన్‌ తరహా సినిమా కాదు. చక్కటి కుటుంబ కథా చిత్రం. యాక్షన్‌, వినోదం, కుటుంబ సంబంధాలు ఇలా అన్ని రకాల అంశాలున్న కథతో తెరకెక్కిన సినిమా ఇది. 'అహనాపెళ్లంట', 'పూలరంగడు' సినిమాల్లో వీరభద్రమ్‌ ఎంత బాగా నవ్వించాడో చూశాం. 'గ్రీకువీరుడు' తర్వాత పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం చేద్దామనుకొని వీరభద్రమ్‌ రాసుకున్న కథ విన్నాను. నేను అనుకున్నట్లు ఉండటంతో వెంటనే అంగీకరించాను.

ఈ సినిమా ప్రత్యేకతలు విషయానికి వస్తే.... దర్శకుడు నా పాత్ర చిత్రణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇందులో నా మూడు గెటప్స్‌ వైవిధ్యంగా తీర్చిదిద్దాడు. పంచ్‌ డైలాగ్స్‌ ఆకర్షణగా నిలుస్తాయి. దేవిశ్రీప్రసాద్‌ చక్కటి సంగీతాన్ని అందించాడు. ఈ ఫీల్డ్‌లో ఎవరైనా కొత్తగా ట్రై చేయాలంటే అది నేనే... మాఫియాకి గ్రామర్‌ నేర్పింది నేనే... గ్లామర్‌ తెచ్చింది నేనే... దోస్తీ కొస్తే భాయ్‌... దుష్మన్‌ కొస్తే గుడ్‌బాయ్‌.... హైదరాబాద్‌లో రెండే ఫేమస్‌... ఒకటి ఇరానీ చాయ్‌, రెండు భాయ్‌...అట్మాస్ఫియర్‌ వైలంట్‌గా ఉందంటే... భాయ్‌ ఎంటర్‌ అయినట్లే... ఇవి మచ్చుకు కొన్ని పంచ్‌లు... ఇలాంటివి సినిమాలో చాలా ఉన్నాయంటున్నారు నాగార్జున.

'మనం' గురించి చెప్తూ.... ఫస్ట్‌లుక్‌ ఆకట్టుకొంది. ఇది దర్శకుడు విక్రమ్‌ ఆలోచనే. నాన్నకి చిన్నపిల్లాడి డ్రెస్‌ వేయడం అందరికీ కొత్తగా అనిపించింది. ఈ ఫొటోకి సినిమా కథకి కాస్త సారూప్యత ఉంది. నేను, నాన్న, నాగచైతన్య ఉన్న సినిమా అనేసరికి అంచనాలూ భారీగానే ఉన్నాయి. చిత్రీకరణ వేగంగా జరుగుతోంది. వచ్చే నెలకి నాన్న పాత్ర షూటింగ్‌ పూర్తయిపోతుంది. డిసెంబర్‌ కల్లా సినిమా సిద్ధమవుతుంది.

English summary
‘Bhai’ has completed its censor formalities today. As per the latest reports that have reached us, the movie has received a U/A rating from the censor board.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu