»   » కృష్ణవంశీ సబ్జెక్ట్ ని ఎందుకు రిజెక్టు చేసాడో చెప్పాడు

కృష్ణవంశీ సబ్జెక్ట్ ని ఎందుకు రిజెక్టు చేసాడో చెప్పాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :అదివరకు కృష్ణవంశీ కథ చెప్పిన మాట నిజమే. అది కూడా మంచి సబ్జెక్టే. 'ఇంకా ఏదో కొత్తగా చెయ్యాలి. ఒకే చాన్స్ దొరుకుతుంది. రెగ్యులర్ సబ్జెక్టు చెయ్యకూడదు. చాలా కొత్తగా ఉండాలి' అనే ఆలోచనతోనే అది చెయ్యలేదు అంటూ నాగార్జన ఇంతకు ముందు మనం కోసం కృష్ణ వంశీ చెప్పిన కథను రిజెక్టు చేసిన విషయం గుర్తు చేసుకున్నారు. అయితే ఆ స్క్రిప్టు కూడా బాగానే ఉందని కితాబు ఇచ్చారు. ఇప్పుడదే సబ్జెక్టుని గోవిందుడు అందరి వాడేలా అనే టైటిల్ తో కృష్ణ వంశీ రామ్ చరణ్ తో చేస్తున్నట్లు సమాచారం.

అలాగే... విక్రమ్ కథ చెప్పినప్పుడు నాకు, చైతన్యకి బాగా నచ్చింది. నాన్న విని చాలా బాగుందన్నారు. ఆ తర్వాత ఇంకో ఏడాదికి దాన్నింకా బాగా డెవలప్ చేశాడు విక్రమ్. అలా ఈ సినిమాని మొదలుపెట్టాం. మూడు, నాలుగేళ్ల నుంచీ ముగ్గురం కలిసి ఓ సినిమా చేయాలని అనుకుంటున్నాం. చాలా స్క్రిప్టులు విన్నాం. విక్రమ్‌ను 'ఇష్క్' నిర్మాత సుధాకర్‌రెడ్డి పంపించారు. 'ఈ కథ ఎవరూ చేయలేరు. మీరే చెయ్యాలి' అని చెప్పారు. విన్నాం. చాలా బాగుంది. ఈ సినిమా మీద ఆయనకు ఎంత కాన్ఫిడెన్స్ అంటే నైజాంలో సినిమాని ఆయనే విడుదల చేస్తున్నారు అని నాగార్జున వివరించారు.

Nagarjuna about krishna Vamsi story

ఇక మనం' చూశాను. చాలా చాలా సంతోషంగా ఉంది. మా ఇంట్లో రాత్రే మా ఇద్దరు పిల్లలు, నేను, అమల చూశాం. అసాధారణ చిత్రం. అందమైన చిత్రం. నాకు చాలా చాలా తృప్తిగా ఉంది. ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. కొంచెం సేపు ఏడిపిస్తుంది. ఎక్కువసేపు నవ్విస్తుంది. ఏడుపంటే మెలోడ్రామా కాదు. ఒక గుడ్ ఫీలింగ్‌తో, చిన్నపాటి నవ్వుతో బయటకు వస్తారు. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఫొటోగ్రఫీ కానీ, డైరెక్షన్ కానీ, ఎడిటింగ్ కానీ, మ్యూజిక్ కానీ అన్నీ బాగా కుదిరిన సినిమా. అ

నూప్ రూబెన్స్‌కి బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. ఎ, బి, సి సెంటర్లనే తేడా లేకుండా అన్ని చోట్లా సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఇందులో నాన్నకీ, చైతన్యకీ మధ్య కామెడీ సీన్లు చాలా బాగుంటాయి. కథ 1920లో మొదలై, 2013కి ముగుస్తుంది. ఇందులో పునర్జన్మలూ ఉంటాయి. అయితే దాన్ని మెలోడ్రామాతో డ్రమాటిక్‌గా చూపించలేదు. 'అరుంధతి'లాగానో, ఇంకోలాగానో ఆ సన్నివేశాలుండవు. పునర్జన్మ అనేది ప్రేక్షకులకి తెలుస్తుంది కానీ, పాత్రలకి తెలీదు అన్నారు.

English summary
Nagarjuana says that he wants a very much new story. So he rejected his story for Manam.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu