»   » రాజమౌళి కృషి సూపర్బ్:నాగార్జున

రాజమౌళి కృషి సూపర్బ్:నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu

యాక్షన్ ఎపిసోడ్‌లో రాజమౌళి కృషి సూపర్బ్.క్లైమాక్స్ ఈ సినిమాకు హైలైట్ అవుతుంది అంటూ నాగార్జున రాజమౌళి పనితనం గురించి చెప్పుకొచ్చారు. నాగార్జున హీరోగా నటిస్తున్న చిత్రం 'రాజన్న'. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై ఆయనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ "ఈ చిత్రంలోని రాజన్న క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. స్వాతంత్ర సమరయోధుడి కథ ఇది. అప్పటి యథార్థ సంఘటనలు కొన్నింటిని తీసుకుని తెరకెక్కిస్తున్నాం. విజయేంద్రప్రసాద్‌గారు చాలా బాగా డీల్ చేశారు. కీరవాణిగారి సంగీతం ప్రాణం. అత్యంత కీలకమైన పాత్రలో ఎనిమిదేళ్ళ బేబి ఏని నటన సూపర్బ్.

అలాగే ఈ కథలో పాప పాత్రకు ప్రాముఖ్యత ఉంది. ఎన్నో సెట్లు వేసి స్వాతంత్య్ర పోరాటం నాటి వాతావరణాన్ని క్రియేట్ చేశాం. ఆర్ట్ డైరక్టర్ రవీందర్ సెట్స్‌ని అద్భుతంగా వేశారు. మా సంస్థలో వస్తున్న ప్రెస్టీజియస్ చిత్రమిది. చిత్ర నిర్మాణం పూర్తి కావచ్చింది. ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుంది. పేట్రియాటిక్ ఫీల్‌తో సాగుతుంది. నటుడిగా సంతృప్తినిచ్చిన సినిమా అని అన్నారు.ఈ చిత్రాన్ని ఆర్.ఆర్.ఫిలిమ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సెప్టెంబర్ 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా 'రాజన్న' ఫస్ట్‌లుక్‌ను, సెప్టెంబర్ రెండో వారంలో పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అక్కినేని అన్నపూర్ణమ్మ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై. లిమిటెడ్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో స్నేహ, బేబి ఏని, శ్వేత మీనన్, నాజర్, అజయ్, సుప్రీత్, ప్రదీప్ రావత్, ముఖేష్ రుషి, రవి కాలే, గాంధీ తదితరులు ఇతర ముఖ్యపాత్రల్ని పోషిస్తున్నారు.ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: శ్యామ్.కె.నాయుడు, అనిల్ బండారి, పూర్ణ, కళ: రవీందర్, ఫైట్స్: విజయ్, రామ్‌లక్ష్మణ్, సెల్వ, సాల్మన్, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, యాక్షన్ పర్యవేక్షణ: రాజమౌళి, నిర్మాత: అక్కినేని నాగార్జున, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: విజయేంద్రప్రసాద్.

English summary
Nagarjuna’s forthcoming film ‘Rajanna’ is nearing completion. Shooting of the film is presently progressing at Annapoorna studios in Hyderabad. Film unit is engaged in shooting climax action sequences under the direction of SS Rajamouli.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu